E-Paper
Advertisement

డిస్‌ప్లే ఇయర్‌బడ్స్ చూశారా?మార్కెట్‌లో జెబీఎల్ లైవ్ బీమ్ 4 లాంచ్

డిస్‌ప్లే ఇయర్‌బడ్స్ చూశారా?మార్కెట్‌లో జెబీఎల్ లైవ్ బీమ్ 4 లాంచ్
Advertisement

JBL Live Beam 4 review:  టెక్ ప్రపంచంలో ఇయర్‌ బడ్స్ డిజైన్ పూర్తిగా మారిపోతోంది! కేవలం పాటలు వినడమే కాకుండా.. ఛార్జింగ్ కేస్ మీదే స్క్రీన్ ఉంటే ఎలా ఉంటుంది? సరిగ్గా ఈ ఆలోచనతోనే.. ప్రముఖ ఆడియో బ్రాండ్ జెబీఎల్ మార్కెట్లోకి తెచ్చిన అద్భుతమైన డివైజ్ “జెబీఎల్ లైవ్ బీమ్ 4”. ట్రెండీ లుక్, సూపర్ సౌండ్ ,టచ్‌ స్క్రీన్ కేస్‌తో వస్తున్న ఈ ఇయర్‌ బడ్స్ టెక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ ఇయర్‌ బడ్స్ ఎలా పనిచేస్తాయి? దీని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం!

జెబీఎల్ లైవ్ బీమ్ 4 రివ్యూ:

1.డిజైన్,టచ్‌ స్క్రీన్ కేస్:

ఈ ఇయర్‌ బడ్స్ అత్యంత ప్రీమియం లుక్‌తో వస్తాయి. వీటిలో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ ఏంటంటే..దీని ఛార్జింగ్ కేస్ మీద ఒక స్మార్ట్ ఎల్ఈడీ టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఫోన్ తీయకుండానే .. ఈ స్క్రీన్ సహాయంతో మ్యూజిక్ మార్చుకోవడం, వాల్యూమ్ కంట్రోల్ చేయడం, కాల్స్ లిఫ్ట్ చేయడం, నోటిఫికేషన్లు చూసుకోవడం వంటి పనులన్నీ ఇట్టే చేసుకోవచ్చు. అంతే కాకుండా ఇయర్‌ బడ్స్ చెవుల్లో ఈజీగా సెట్ అయ్యేలా ఎర్గోనామిక్ డిజైన్‌తో రూపొందించారు.

2. అద్భుతమైన సౌండ్ ,బేస్ క్వాలిటీ:

Advertisement

జెబీఎల్ బ్రాండ్ పేరు చెబితేనే.. ముందుగా గుర్తుకొచ్చేది అదిరి పోయే సౌండ్ క్వాలిటీ! ఈ లైవ్ బీమ్ 4 మోడల్ డీప్ బేస్, క్రిస్టల్ క్లియర్ వోకల్స్‌ను అందిస్తుంది. జెబీఎల్ సిగ్నేచర్ సౌండ్ టెక్నాలజీ దీని సొంతం. మీరు ఎలాంటి మ్యూజిక్ వింటున్నా సరే.. ప్రతి బీట్ ఎంతో స్పష్టంగా వినిపిస్తుంది.

3. పవర్‌ఫుల్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్:

బయటి ప్రపంచంలోని సౌండ్‌లను పూర్తిగా కట్ చేయడానికి ఇందులో అడ్వాన్స్‌డ్ ట్రూ అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను అందించారు. ఆఫీస్‌లో ఉన్నా, రద్దీగా ఉండే రోడ్లలో ప్రయాణిస్తున్నా.. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా మ్యూజిక్ వినొచ్చు లేదా కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే ట్రాన్స్‌పరెన్సీ మోడ్ ద్వారా చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా ఈజీగా వినొచ్చు.

4. బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్:

Advertisement

బ్యాటరీ బ్యాకప్ విషయంలో.. జెబీఎల్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ ఇయ ర్‌బడ్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే .. ఏఎన్‌సీ ఆన్‌లో ఉన్నప్పటికీ సుమారు 8 నుంచి 10 గంటల వరకు పని చేస్తాయి. ఇక టచ్‌స్క్రీన్ ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి ఇది మొత్తం 40 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. అంతే కాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో కేవలం కొన్ని నిమిషాలు ఛార్జ్ చేస్తే గంటల తరబడి వాడుకోవచ్చు.

Also Read: టెక్కీలకు పండగే.. ఒకేసారి మల్టిపుల్ డివైజ్ ఛార్జ్ చేసే షావోమి పవర్ బ్యాంక్!

5. కాల్ క్వాలిటీ, కనెక్టివిటీ:

కాల్స్ మాట్లాడేటప్పుడు అవతలి వారికి మీ గొంతు స్పష్టంగా వినిపించేందుకు ఇందులో ప్రత్యేకమైన మైక్రోఫోన్లు , నాయిస్ రిడక్షన్ అల్గారిథమ్స్ ఉన్నాయి. బ్లూటూత్ లేటెస్ట్.. వెర్షన్ సపోర్ట్ ఉండటంతో ఫోన్‌కి లేదా ల్యాప్‌ టాప్‌కి క్షణాల్లో కనెక్ట్ అవుతుంది.ఒకే సమయంలో రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకునే మల్టీపాయింట్ కనెక్షన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

6.ధర:

మార్కెట్లో ఈ జెబీఎల్ లైవ్ బీమ్ 4 ఇయర్‌ బడ్స్ ధర సుమారు రూ.12,999 నుంచి రూ.14,999 మధ్యలో అందుబాటులో ఉన్నాయి.ఆన్‌ లైన్ సేల్స్, బ్యాంక్ ఆఫర్లతో వీటిని మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

ట్రెండీ డిజైన్, టచ్‌స్క్రీన్ కేస్ ,బేస్ట్ సౌండ్ క్వాలిటీ కోరుకునే మ్యూజిక్ లవర్స్‌కు జెబీఎల్ లైవ్ బీమ్ 4 ఒక పర్‌ఫెక్ట్ , వర్త్  గాడ్జెట్ అని చెప్పొచ్చు!

Related News

రూ.799కే బోట్ సౌండ్‌బార్..దీని ముందు హోం థియేటర్ బలాదూర్

పార్టీ లవర్స్ కోసం JBL కొత్త పార్టీబాక్స్ స్పీకర్లు.. 18 గంటల బ్యాటరీ, AI కారోకే మైక్స్‌తో లాంచ్!

టెక్కీలకు పండగే.. ఒకేసారి మల్టిపుల్ డివైజ్ ఛార్జ్ చేసే షావోమి పవర్ బ్యాంక్!

ఫోన్ అప్‌డేట్ చేయకపోతే వాట్సప్ గోవిందా.. సీక్రెట్‌గా టెస్టింగ్ మొదలుపెట్టిన మెటా సంస్థ!

అమెజాన్ పండగు సేల్ షురూ.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కళ్లుచేదిరే డిస్కౌంట్లు!

కిడ్స్ సేఫ్టీ కోసం మెటా మాస్టర్ ప్లాన్..హానికరమైన లింక్స్, ఫేక్ యాడ్స్ మాయం!

గూగుల్ మ్యాప్స్‌లో రంగుల గుట్టు ఇదే.. హాస్పిటల్ నుంచి హోటల్ వరకు ఎలా గుర్తించాలో తెలుసా?

Big Stories

Advertisement
×