Xiaomi Power Bank 20000 165W review: ప్రయాణాలు చేసేటప్పుడు ల్యాప్‌టాప్, ఫోన్, ట్యాబ్ వంటి మల్టిపుల్ గాడ్జెట్ల ఛార్జింగ్ టెన్షన్ ఇకపై వదిలేయండి! ప్రముఖ టెక్ బ్రాండ్ షావోమి మార్కెట్లోకి తీసు కొచ్చిన సరి కొత్త “షావోమి 20000mAh 165W పవర్ బ్యాంక్” టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. కేవలం ఈ ఒక్క పవర్ బ్యాంక్‌తో మీ అన్ని డివైజ్‌లను సూపర్ ఫాస్ట్‌గా ఛార్జ్ చేసుకోవచ్చు. అద్భుతమైన పవర్ అవుట్‌పుట్ , ట్రెండీ డిజైన్‌తో వస్తున్న ఈ పవర్ బ్యాంక్ బడ్జెట్ ధరలోనే వస్తోంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ పవర్ బ్యాంక్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పవర్ బ్యాంక్ చూడటానికి చాలా ప్రీమియంగా, కాంపాక్ట్‌గా ఉంటుంది. దీనిలో 20000mAh భారీ కెపాసిటీ ఉన్నప్పటికీ, దీనిని ఈజీగా బ్యాగ్‌లో సర్దుకోవచ్చు. దీని బాడీపై ఉన్న స్మార్ట్ కలర్ డిస్‌ప్లే ద్వారా పవర్ బ్యాంక్‌లో ఎంత బ్యాటరీ మిగిలి ఉంది, అవుట్ పుట్ వాటేజ్ ఎంత వస్తోంది అనే వివరాలను స్పష్టంగా చూసుకోవచ్చు. ఇది ట్రావెల్ ఫ్రెండ్లీగా ఉండటంతో.. పాటు విమానాల్లో కూడా తీసుకెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది.
ఈ పవర్ బ్యాంక్ మెయిన్ హైలైట్ దీని ఛార్జింగ్ స్పీడ్! ఇది గరిష్టంగా.. 165W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. ఇందులో.. మల్టిపుల్ పోర్ట్స్ (USB-C, USB-A) ఉండటం వల్ల ఒకే సారి ఒకటి కంటే ఎక్కువ డివైజ్‌లను కనెక్ట్ చేయవచ్చు. మీరు మీ మాక్‌బుక్ లేదా ఇతర విండోస్ ల్యాప్‌టాప్‌లను ఎలాంటి అడాప్టర్ లేకుండా నేరుగా ఈ పవర్ బ్యాంక్‌తో సూపర్ ఫాస్ట్‌గా ఛార్జ్ చేసుకోవచ్చు.
మీ దగ్గర ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్, ట్యాబ్ లేదా ఇయర్ బడ్స్ ఉంటే సరే.. అన్నింటినీ ఒకేసారి ఛార్జ్ చేయెచ్చు. మీరు రెండు పోర్ట్స్‌ను వాడినప్పుడు పవర్ ఆటోమేటిక్‌గా డివైజ్‌ల అవసరానికి తగినట్లుగా షేర్ అవుతుంది. షావోమి ఇందులో లేటెస్ట్ చిప్‌సెట్‌ను వాడటం వల్ల డివైజ్‌లు వేడెక్కడం లేదా షార్ట్ సర్క్యూట్ కాకుండా పూర్తి సేఫ్టీ ఇస్తుంది.
పెద్ద బ్యాటరీ అయినప్పటికీ.. ఈ పవర్ బ్యాంక్‌ను మళ్లీ ఫుల్ ఛార్జ్ చేయడం చాలా ఈజీ. హై-వాటేజ్ వాల్ ఛార్జర్ సాయంతో.. ఇది చాలా తక్కువ సమయంలోనే పూర్తిగా ఛార్జ్ అయిపోతుంది. తద్వారా మీరు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు తక్కువ సమయంలోనే దీన్ని రెడీ చేసుకోవచ్చు.
Also Read: 120 ఇంచుల బిగ్ స్క్రీన్ మ్యాజిక్..కొత్త లుమియో ఆర్క్ 7 ప్రొజెక్టర్‌తో ఇల్లే థియేటర్!
గ్లోబల్ మార్కెట్లో విడుదలైన ఈ షావోమి 20000mAh 165W పవర్ బ్యాంక్ ధర సుమారు రూ. 5,999 నుంచి రూ. 7,499 మధ్యలో అందుబాటులో ఉంది. త్వరలోనే ఇది ఇండియన్ మార్కెట్లోనూ అధికారికంగా అందుబాటులోకి రానుంది.
తరచూ ప్రయాణాలు చేసే టెక్కీలకు, ల్యాప్‌టాప్‌లు, మల్టిపుల్ గ్యాడ్జెట్లు వాడే వారికి ఈ షావోమి 165W పవర్ బ్యాంక్ ఒక అద్భుతమైన ఛాయిస్ అని చెప్పొచ్చు. కొత్త పవర్ బ్యాంక్ కొనాలనుకుంటే మాత్రం దీనిపై ఓ లుక్కేయండి.