E-Paper
Advertisement

సినిమా హాల్ రేంజ్ సౌండ్.. బోట్ కొత్త సౌండ్‌బార్లు వచ్చేశాయ్, ఫీచర్లు, ధరలు ఇవే!

సినిమా హాల్ రేంజ్ సౌండ్.. బోట్ కొత్త సౌండ్‌బార్లు వచ్చేశాయ్, ఫీచర్లు, ధరలు ఇవే!
Advertisement

Aavante Bar Prime: ఇంట్లోనే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్.. సరికొత్త Aavante Bar Prime సౌండ్‌బార్ సిరీస్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఇందులో Prime B450, Prime DA600, Prime Thunder-D అనే మూడు మోడళ్లను తీసుకొచ్చింది. అద్భుతమైన డాల్బీ ఆడియో, డ్యూయల్ సబ్‌వూఫర్లతో ఇవి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాయి.

మోడల్స్, ధరల వివరాలు:

ఈ సిరీస్‌లో Aavante Bar Prime B450 ప్రారంభ మోడల్‌గా అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.9,999గా ఉంది. ఇక ప్రీమియం ఫీచర్లతో వచ్చిన ఆవాంటే బార్ ప్రైమ్ DA600 మోడల్ ధర రూ.15,999 కాగా.. సిరీస్‌లోనే హైఎండ్ మోడల్ అయిన ఆవాంటే బార్ ప్రైమ్ థండర్-D ధరను రూ.18,999గా నిర్ణయించారు. ఇవి బోట్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, ప్రముఖ రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Also Read: Apple Smart Glasses.. రికార్డింగ్ ప్రైవసీ సమస్యలకు చెక్ పెట్టేలా కొత్త పేటెంట్!

పవర్‌ఫుల్ డాల్బీ ఆడియో:

ఈ సిరీస్‌లో DA600 మోడల్ 600W పవర్ అవుట్‌పుట్‌తో వస్తోంది. ఇది 5.2-ఛానల్ సరౌండ్ సౌండ్‌తో పాటు డాల్బీ అట్మాస్ (Dolby Atmos) టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. ఇందులో డ్యూయల్ వైర్డ్ సబ్‌వూఫర్లు, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు ఇచ్చారు. ఇది ఇంట్లో సినిమా చూస్తున్నప్పుడు మైండ్ బ్లోయింగ్ ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. B450 మోడల్ 450W అవుట్‌పుట్‌తో 5.2-ఛానల్ సరౌండ్ సౌండ్‌ను అందిస్తుంది.

కనెక్టివిటీ, డిజైన్:

Advertisement

ఈ సౌండ్‌బార్లు బ్లూటూత్ 5.3 వెర్షన్‌తో పనిచేస్తాయి. టీవీ, గేమింగ్ కన్సోల్స్ కనెక్ట్ చేయడానికి HDMI (ARC), ఆప్టికల్, AUX, USB వంటి అన్ని ఆప్షన్లు ఉన్నాయి. DA600 మోడల్‌లో మొత్తం 8 వేర్వేరు సైజుల డ్రైవర్లను అందించారు. థండర్-D మోడల్ ఆన్‌లైన్‌లో ఇంకా పూర్తి వివరాలు లిస్ట్ కాకపోయినా.. ఇది కూడా డాల్బీ ఆడియో, మిగతా మోడళ్ల లాంటి కనెక్టివిటీ ఫీచర్లతో వస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

Also Read: అబ్బా.. గూగుల్ ఏం ప్లాన్ చేసింది మావా.. Pixel Buds Pro 2లో దిమ్మతిరిగే ఫీచర్లు!

Tags

Related News

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

మీ ఛార్జింగ్ కేబుల్ తరచూ పాడవుతోందా?ఈ చిన్న మిస్టేక్స్ వెంటనే సరిదిద్దుకోండి!

బట్టలు ఉతకడమే కాదు.. 49% వేగంగా ఆరబెడుతుంది కూడా.. షియోమీ కొత్త వాషింగ్ మ్యాజిక్ ఇదే!

పార్శిల్ బాక్సులు చెత్తలో పడేస్తున్నారా?దొంగ చేతికి తాళాలిస్తున్నట్లే జాగ్రత్త!

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఆడియోను.. ఫోన్ రింగ్‌టోన్‌గా సెట్ చేయండిలా!

రీఛార్జ్ ధరల విషయంలో TRAI కీలక నిర్ణయం.. డేటా వద్దంటే ఇక ఈ ప్లాన్స్‌ను ఎంచుకోవచ్చు!

Big Stories

Advertisement
×