E-Paper
Advertisement

స్కోడా స్లావియా ఫేస్‌ లిఫ్ట్ లాంచ్ డేట్ ఫిక్స్, కొత్త మోడల్ ప్రత్యేకత ఏంటంటే?

స్కోడా స్లావియా ఫేస్‌ లిఫ్ట్ లాంచ్ డేట్ ఫిక్స్, కొత్త మోడల్ ప్రత్యేకత ఏంటంటే?
Advertisement

Skoda Slavia Facelift 2026: స్కోడా స్లావియా ఫేస్‌ లిఫ్ట్ కోసం కార్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కొత్త వెర్షన్‌ ను ఆగస్టు 18న లించ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు స్కోడా టీజ్ చేసింది. ఇది పూర్తిగా కొత్త మోడల్ కాకుండా మిడ్ లైఫ్ అప్‌ డేట్ కావడంతో, కారు డిజైన్‌ లో కొన్ని మార్పులతో పాటు కొత్త ఫీచర్లు, గేర్‌ బాక్స్‌ లో అప్‌ గ్రేడ్ వచ్చే అవకాశం ఉంది.

డిజైన్‌ లో కీలక మార్పులు

ఇప్పటికే రోడ్డుపై కనిపించిన టెస్ట్ కార్లను బట్టి చూస్తే, కొత్త స్లావియాలో ముందు భాగంలో మార్పులు ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. కొత్త హెడ్‌ లైట్లు, ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌లు, రీడిజైన్ చేసిన బంపర్లు ఇందులో కనిపించే అవకాశం ఉంది. ముందు గ్రిల్ డిజైన్ కూడా మారనుంది. కొత్త గ్రిల్‌ లో కుషాక్‌ లో కనిపించే తరహాలో ఇంటి గ్రేటెడ్ లైటింగ్ ఎలిమెంట్స్ ఉండొచ్చని సమాచారం. అంతేకాదు, అల్లాయ్ వీల్స్‌ కు కూడా కొత్త డిజైన్ ఇవ్వవచ్చని తెలుస్తోంది. వెనుక భాగంలో కొత్త టెయిల్‌ లైట్లు లాంటి చిన్న మార్పులు ఉండే అవకాశం ఉంది.

ఇంటీరియర్‌ లోనూ కొత్త ఫీచర్లు

Advertisement

క్యాబిన్‌ లో ప్రస్తుత స్లావియా డ్యాష్‌ బోర్డ్ లే అవుట్‌ ను స్కోడా పెద్దగా మార్చకపోవచ్చని తెలుస్తోంది. అయితే, కొన్ని కొత్త ఫీచర్లను జోడించే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే రావచ్చని సమాచారం. కొత్త సీట్ అప్‌హోల్స్టరీ కూడా అందుబాటులోకి రావచ్చు. ఇటీవల కుషాక్ ఫేస్‌ లిఫ్ట్‌ లో వచ్చిన వెనుక సీట్ల మసాజ్ ఫంక్షన్‌ ను స్లావియాకు కూడా ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత మోడల్‌ లో ఉన్న సన్‌ రూఫ్, వైర్‌ లెస్ ఫోన్ ఛార్జింగ్, వెనుక ఏసీ వెంట్లతో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆరు ఎయిర్‌ బ్యాగ్‌ లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ లాంటి ఫీచర్లు కొనసాగుతాయని భావిస్తున్నారు.

గేర్‌ బాక్స్‌ లో కీలక మార్పు!

స్లావియా ఫేస్‌ లిఫ్ట్‌ లో మెకానికల్‌ గా పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న 1.0 లీటర్ TSI, 1.5 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్లు కొనసాగించే అవకాశం ఉంది. 1.0 TSI ఇంజన్ 115hp పవర్‌ ను అందిస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కొనసాగవచ్చు. అయితే ఆటోమేటిక్ వేరియంట్‌లో మాత్రం కీలక మార్పు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత 6-స్పీడ్ ఆటోమేటిక్ స్థానంలో కొత్త 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తీసుకురావచ్చని తెలుస్తోంది. ఈ గేర్‌బాక్స్ ఇప్పటికే ఫేస్‌లిఫ్ట్ కుషాక్‌ లో పరిచయమైంది. మరోవైపు 150hp శక్తిని ఇచ్చే 1.5 TSI ఇంజన్ 7 స్పీడ్ DCT ఆటోమేటిక్‌తోనే కొనసాగవచ్చని అంచనా.

ధర పెరిగే అవకాశం

Advertisement

ప్రస్తుతం స్కోడా స్లావియా ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.10 లక్షల నుంచి రూ.18.19 లక్షల మధ్యలో ఉంది. ఫేస్‌లిఫ్ట్‌ లో కొత్త ఫీచర్లు, అప్‌డేట్‌ల కారణంగా ధరలో స్వల్ప పెరుగుదల ఉండే అవకాశం ఉంది. కొత్త స్లావియా కూడా ప్రీమియం మిడ్ సైజ్ సెడాన్ విభాగంలోనే కొనసాగనుంది. ఇది హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ, వోక్స్‌ వ్యాగన్ వర్టస్ లాంటి కార్లకు పోటీగా ఉంటుంది.

Read Also: 326 కి.మీ రేంజ్, అదిరిపోయే ఫీచర్లు.. ఇండియన్ మార్కెట్ లోకి విన్‌ఫాస్ట్ VF5 ఎంట్రీ!

Tags

Related News

326 కి.మీ రేంజ్, అదిరిపోయే ఫీచర్లు.. ఇండియన్ మార్కెట్ లోకి విన్‌ఫాస్ట్ VF5 ఎంట్రీ!

25 కి.మీ మైలేజ్, 6 ఎయిర్‌ బ్యాగ్స్ సేఫ్టీ.. రూ.10 లక్షల్లోపు బెస్ట్ ఆటోమేటిక్ కార్లు ఇవే!

145 కి.మీ రేంజ్ తో కొత్త స్కూటర్.. ధర కూడా తక్కువేనండోయ్!

కొత్త లుక్.. సరికొత్త ఫీచర్లు.. కొత్త బాలెనో వచ్చేస్తోంది!

సూపర్ రేంజ్, అదిరిపోయే ఫీచర్లు.. ఆంపియర్ మాగ్నస్ జి మ్యాక్స్ కొత్త వెర్షన్ వచ్చేసింది!

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఉబెర్, రాపిడోల్లో ముందే టిప్ అడగటం కుదరదు.. కేంద్రం కొత్త రూల్స్!

ట్రక్కుల వెనుక ‘Horn OK Please’ అని ఎందుకు రాస్తారో తెలుసా? ఆ ‘OK’ వెనుక పెద్ద చరిత్రే ఉంది!

Big Stories

Advertisement
×