E-Paper
Advertisement

రూ.799కే బోట్ ఇయర్‌బడ్స్.. మ్యూజిక్ లవర్స్‌కు అదిరిపోయే ఆఫర్!

రూ.799కే బోట్ ఇయర్‌బడ్స్.. మ్యూజిక్ లవర్స్‌కు అదిరిపోయే ఆఫర్!
Advertisement

boAt Airdopes 161/163:  వైర్ల గొడవ లేకుండా ప్రశాంతంగా పాటలు వినాలనుకుంటున్నారా? అయితే మార్కెట్లో.. తక్కువ ధరలో అదరగొట్టే.. ఇయర్‌బడ్స్ మీకోసమే ఉన్నాయి. యూత్ ఆల్ టైమ్ ఫేవరెట్ బ్రాండ్ బోట్ (boAt)నుంచి వస్తున్న ‘boAt Airdopes 161/163’ ఇయర్‌బడ్స్ ఇప్పుడు కేవలం రూ.799 ధరకే లభిస్తున్నాయి. అదిరిపోయే బేస్, సూపర్ బ్యాటరీ లైఫ్, స్టైలిష్ లుక్‌తో వస్తున్న ఈ గ్యాడ్జెట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. తక్కువ బడ్జెట్‌లో.. నెంబర్ వన్ క్వాలిటీ కోరుకునే మ్యూజిక్ లవర్స్ కోసం ఈ ఇయర్‌బడ్స్ పర్ఫెక్ట్ ఛాయిస్!

boAt Airdopes 161/163 ఫీచర్లు:

1.స్టైలిష్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ :

Advertisement

రూ.800 లోపు ధరలో వస్తున్నప్పటికీ.. ఈ ఇయర్‌బడ్స్ డిజైన్ మాత్రం చాలా ప్రీమియర్‌గా ఉంటుంది. ఛార్జింగ్ కేస్ చాలా కాంపాక్ట్‌గా, లైట్‌వెయిట్‌గా ఉండటం వల్ల దీన్ని పాకెట్‌లో లేదా హ్యాండ్‌ బ్యాగ్‌లో చాలా ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. చెవుల్లో పెట్టుకున్నప్పుడు ఎలాంటి.. నొప్పి కలగకుండా ఇయర్ టిప్స్ చాలా సాఫ్ట్‌గా డిజైన్ చేయబడ్డాయి. కాలేజీ స్టూడెంట్స్, ఆఫీస్ ఉద్యోగులు రోజంతా దీన్ని వాడినప్పటికీ ఎలాంటి అసౌకర్యం అనిపించదు.

2.సౌండ్ క్వాలిటీ, బేస్:

బోట్ బ్రాండ్ అంటేనే దానికి ఉండే ప్రసిద్ధ ‘సిగ్నేచర్ సౌండ్ ప్రత్యేకత. ఈ బడ్జెట్ ఇయర్‌బడ్స్‌లోనూ ఆ పవర్ ఫుల్ బాస్‌ను అందిస్తున్నారు. మీరు మ్యూజిక్ వింటున్నప్పుడు బీట్స్ చాలా స్పష్టంగా, క్రిస్టల్ క్లియర్‌గా వినిపిస్తాయి. అలాగే సినిమాలు చూసేటప్పుడు లేదా గేమింగ్ ఆడేటప్పుడు మంచి ఆడియో ఫీల్ ఇస్తుంది. తక్కువ ధరలో ఇలాంటి సౌండ్ క్వాలిటీ దొరకడం నిజంగా అద్భుతమనే చెప్పాలి.

Advertisement

3.బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్:

బడ్జెట్ గ్యాడ్జెట్లలో బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంటుందనే టెన్షన్ అందరికీ ఉంటుంది. కానీ.. ఈ మోడల్స్ ఈ విషయంలో అస్సలు నిరాశపరచవు. ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి ఇవి చాలా గంటల పాటు నిరంతరం పనిచేస్తాయి. అంతే కాకుండా ఇందులో ‘ASAP Fast Charging’ టెక్నాలజీ ఉంది. కేవలం కొన్ని నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు, గంటల తరబడి మ్యూజిక్ ఎంజాయ్ చేసేలా ..బ్యాకప్ ఇస్తుంది. టైప్-సి పోర్ట్ సపోర్ట్ ఉండటం వల్ల ఛార్జింగ్ చేయడం కూడా చాలా ఈజీ.

Also Read: ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షనా? బడ్జెట్‌లోనే.. పాకెట్ ఫ్రెండ్లీ పవర్ బ్యాంక్

4.టచ్ కంట్రోల్స్, కనెక్టివిటీ :

బ్లూటూత్ లేటెస్ట్ వెర్షన్ సపోర్ట్ ఉండటం వల్ల మీ స్మార్ట్‌ ఫోన్‌తో ఇవి క్షణాల్లో కనెక్ట్ అయిపోతాయి. మధ్యలో.. సిగ్నల్ కట్ అవ్వడం లేదా డిస్‌కనెక్ట్ అయ్యే సమస్యలు ఉండవు. ఇయర్‌ బడ్స్‌పై ఉండే స్మార్ట్ టచ్ కంట్రోల్స్ ద్వారా కాల్స్ లిఫ్ట్ చేయడం,మ్యూజిక్ పాజ్/ప్లే చేయడం, వాల్యూమ్ పెంచడం వంటి పనులను చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉండటం వల్ల వర్షంలో.. నడిచేటప్పుడు లేదా జిమ్‌లో వర్కౌట్లు చేసేటప్పుడు చెమట పట్టినా ఇవి పాడవకుండా ఉంటాయి.

మీరు తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్, మంచి సౌండ్ క్వాలిటీ ఉండే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కోసం చూస్తున్నట్లయితే.. కేవలం రూ.799 ధరలో.. లభించే ఈ మోడల్స్ మీకు బెస్ట్ ఆప్షన్ అవుతాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ బడ్జెట్ డీల్‌ను అస్సలు మిస్ అవ్వకండి.

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×