E-Paper
Advertisement

రూ.999కే ..బోట్ ఇయర్ బడ్స్, ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు

రూ.999కే ..బోట్ ఇయర్ బడ్స్, ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు
Advertisement

BoAt Airdopes 300: ప్రస్తుత ట్రెండ్‌లో వైర్‌లెస్ ఇయర్‌ బడ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రయాణాల్లో ఉన్నా.. ఆఫీసు పని చేస్తున్నా లేదా జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్నా చెవుల్లో.. చిన్న ఇయర్‌ బడ్స్ ఉంటేనే మ్యూజిక్ మజా ఉంటుంది. అయితే తక్కువ బడ్జెట్‌లో.. సినిమా థియేటర్ లాంటి.. సౌండ్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి ప్రముఖ ఆడియో బ్రాండ్ ‘బోట్’ మార్కెట్లోకి తెచ్చిన అద్భుతమైన గ్యాడ్జెట్ ‘బోట్ ఎయిర్‌డోప్స్ 300’. సినిమాటిక్ స్పేషియల్ ఆడియో , పవర్‌ఫుల్ బ్యాటరీ బ్యాకప్‌తో వస్తున్న ఈ ఇయర్‌బడ్స్ కేవలం రూ.999 ధరకే కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.

మార్కెట్లో ఎన్నో రకాల ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు అందించడంలో బోట్ బ్రాండ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా ఆడియో లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘బోట్ ఎయిర్‌డోప్స్ 300’ మోడల్ ట్రెండింగ్ గ్యాడ్జెట్‌గా నిలిచింది. చూడటానికి ఎంతో స్టైలిష్‌గా ఉండటమే కాకుండా.. ఇది చెవులకు సౌకర్యంగా ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. తక్కువ ధరలో.. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

1.సినిమాటిక్ స్పేషియల్ ఆడియో:

Advertisement

ఈ ఇయర్‌బడ్స్ ప్రధాన ఆకర్షణ వీటిలో ఉండే ‘సినిమాటిక్ స్పేషియల్ ఆడియో టెక్నాలజీ. దీని వల్ల మనం పాటలు వింటున్నప్పుడు.. లేదా సినిమాలు చూస్తున్నప్పుడు సౌండ్ కేవలం చెవులకే పరిమితం కాకుండా.. చుట్టు పక్కల నుంచి వస్తున్న రియలిస్టిక్ ఫీల్ ఇస్తుంది. అలాగే ఇందులో.. ఉండే 10 మిమీ డ్రైవర్లు డీప్ బేస్, క్రిస్టల్ క్లియర్ వాయిస్‌ను అందిస్తాయి. దీని వల్ల ప్రతీ బీట్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది.

2.50 గంటల నాన్‌స్టాప్ బ్యాటరీ బ్యాకప్:

Advertisement

ఎక్కువ సేపు ప్రయాణాలు చేసే.. వారికి లేదా తరచూ ఛార్జ్ చేసే ఇబ్బంది పడకూడదనుకునే వారికి ఈ ఇయర్‌ బడ్స్ చక్కటి పరిష్కారం. బోట్ ఎయిర్‌డోప్స్ 300 ఛార్జింగ్ కేసుతో.. కలిపి మొత్తం 50 గంటల వరకు నిరంతరం బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. అంటే.. ఒక్క సారి ఛార్జ్ చేస్తే.. రోజుల తరబడి ఎలాంటి టెన్షన్ లేకుండా వాడవచ్చు. అంతేకాకుండా.. ఇందులో ఉండే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా కేవలం కొన్ని నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు, గంటల తరబడి మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయవచ్చు.

3.ఏఐ-ఎన్‌ఎక్స్ టెక్నాలజీ, గేమింగ్ మోడ్:

ఫోన్ కాల్స్ మాట్లాడుకునేటప్పుడు చుట్టు పక్కల వచ్చే అవాంఛిత శబ్దాలను అడ్డుకోవడానికి ఇందులో ‘Ai-ENx టెక్నాలజీ’ని ఉపయోగించారు. దీని వల్ల రద్దీ రోడ్లపై ఉన్నా కూడా అవతలి వారికి మన గొంతు స్పష్టంగా వినిపిస్తుంది. అలాగే మొబైల్ గేమింగ్ ఆడేవారి కోసం ప్రత్యేకంగా ‘బీస్ట్ మోడ్ ఇవ్వబడింది. ఇది లో-లేటెన్సీని అందించడం ద్వారా గేమ్‌లో సౌండ్ సింక్ కరెక్ట్‌గా ఉండేలా చూస్తుంది. టచ్ కంట్రోల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు దీన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి.

Also Read: రూ.896 ధరకే.. స్మార్ట్ వాచ్, ఫిట్‌నెస్ లవర్స్‌కి పర్ఫెక్ట్ !

ధర:

boAt Airdopes 300 Wireless Earbuds.. మార్కెట్లో వీటి అసలు ధర చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ప్రత్యేక ఆఫర్ల ద్వారా కేవలం రూ.999 ధరకే లభిస్తోంది.

తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు, సినిమాటిక్ స్పేషియల్ ఆడియో , లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ కోరుకునే ప్రతి ఒక్కరికీ బోట్ ఎయిర్‌డోప్స్ 300 ఒక అద్భుతమైన ఆప్షన్. రూ. 999 ధరలో ఇన్ని లేటెస్ట్ ఫీచర్లు లభించడం నిజంగా గొప్ప విషయమే. మీరు కూడా మీ పాత ఇయర్‌ బడ్స్‌ను మార్చాలనుకుంటే .. వీటిని ధైర్యంగా కొనొచ్చు.

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×