E-Paper
Advertisement

జియో, ఎయిర్‌టెల్‌కు చుక్కలు చూపిస్తున్న BSNL.. తక్కువ ధరకే నెలకు 75GB డేటా, ఫ్రీ కాల్స్!

జియో, ఎయిర్‌టెల్‌కు చుక్కలు చూపిస్తున్న BSNL.. తక్కువ ధరకే నెలకు 75GB డేటా, ఫ్రీ కాల్స్!
Advertisement

BSNL Cheapest Data Plans: ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ వినియోగదారుల కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ టెలికాం కంపెనీల ధరల పెంపుతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు ఊరటనిస్తూ, కేవలం రూ.225కే అదిరిపోయే బెనిఫిట్స్ ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా ఈ కొత్త ప్లాన్ వివరాలను వెల్లడించింది.

రూ.225 ప్లాన్ ప్రత్యేకతలు:

ఈ సరికొత్త రూ.225 ప్లాన్ ద్వారా వినియోగదారులకు పూర్తి 30 రోజుల వాలిడిటీ లభిస్తుంది. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితంగా ఉచిత వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. రోమింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఈ ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని వాడుకునే వీలుంది. మధ్యతరగతి ప్రజలకు, తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ వాలిడిటీ కోరుకునే వారికి ఇది చక్కటి ఆప్షన్ అని చెప్పవచ్చు.

Advertisement

Also Read: ఇకపై వాట్సప్ చాట్ ఓపెన్ చేయకుండానే.. ఆన్‌లైన్ స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?

ప్రతిరోజూ 2.5GB డేటా:

ఇక డేటా విషయానికి వస్తే.. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు ప్రతిరోజూ 2.5GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే నెల మొత్తంలో దాదాపు 75GB డేటాను వాడుకోవచ్చు. ఇంటర్నెట్ ఎక్కువగా వాడేవారికి, రీల్స్ చూసేవారికి ఈ డేటా ఎంతో ఉపయోగపడుతుంది. దీనికి తోడు రోజుకు 100 ఉచిత SMSలు కూడా లభిస్తాయి. మెసేజ్‌లు ఎక్కువగా పంపే వారికి కూడా ఇది మంచి టాప్‌అప్ కానుంది.

కొత్త యూజర్ల కోసం రూ.51 ప్లాన్:

Advertisement

కొత్తగా BSNL నెట్‌వర్క్‌లోకి వచ్చే కస్టమర్ల కోసం సంస్థ మరో సూపర్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. కేవలం రూ.51కే 28 రోజుల వాలిడిటీతో కూడిన ప్రత్యేక ప్లాన్‌ను ప్రకటించింది. ఇందులో కూడా ప్రతిరోజూ 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అయితే ఈ ఆఫర్ జూన్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పైగా ఈ ఆఫర్ కింద కొత్త కస్టమర్లు ఉచితంగా సిమ్ కార్డును కూడా పొందవచ్చు.

యూజర్లను ఆకర్షించే వ్యూహం:

ప్రస్తుతం భారత టెలికాం రంగంలో ఉన్న విపరీతమైన పోటీని తట్టుకునేందుకు BSNL ఈ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఒకవైపు దేశవ్యాప్తంగా తమ నెట్‌వర్క్ కనెక్టివిటీని మెరుగుపరుస్తూనే, మరోవైపు ఇలాంటి సరసమైన ప్లాన్లతో ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను అందిస్తూ కస్టమర్లను తమ వైపు తిప్పుకోవడానికి BSNL గట్టిగానే ప్రయత్నిస్తోంది.

Also Read: నథింగ్ నుంచి అత్యంత చౌకైన ఫోన్.. ఆ లుక్ చూసి టెక్ ప్రియులంతా ఫిదా, లాంచ్ ఎప్పుడంటే?

Related News

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

ఏఐ మోసాలకు చెక్ పెట్టే టెక్నాలజీ..గూగుల్,ఆపిల్ ఫోన్లలోని అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు!

వాట్సాప్‌లో.. ఈ 5 సెట్టింగ్‌లను పొరపాటున కూడా మరవొద్దు!

Big Stories

Advertisement
×