E-Paper
Advertisement

గోల్డ్ షాపు ఓపెనింగ్‌కు ముందే బిగ్ షాక్.. 12 నిమిషాల్లో రూ.8 కోట్ల బంగారం చోరీ..!

గోల్డ్ షాపు ఓపెనింగ్‌కు ముందే బిగ్ షాక్.. 12 నిమిషాల్లో రూ.8 కోట్ల బంగారం చోరీ..!
Advertisement

Vadodara Gold Theft: గుజరాత్ లోని వడోదరలో దసరా పండుగను పురస్కరించుకుని ప్రారంభం కానున్న ఒక నగల దుకాణంలో భారీ చోరీ కలకలం రేపింది. ప్రారంభోత్సవానికి కొద్ది రోజులు ఉందనగా ఏకంగా 5.5 కిలోల బంగారం అపహరణకు గురైంది. దీని విలువ సుమారు రూ. 8.28 కోట్లు ఉంటుందని అంచనా.

అసలేం జరిగిందంటే?

ముంబైకి చెందిన ‘యుగన్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ గుజరాత్ వ్యాప్తంగా నగల వ్యాపారులకు బంగారు ఆభరణాలను సరఫరా చేస్తుంటుంది. ఈ సంస్థలో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్న హిమాన్షు జైన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాపోడ్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. దాకోర్ కి చెందిన భావిక్ కుమార్ సోని అనే నగల దుకాణం యజమానితో హిమాన్షు జైన్ కు 2017 నుంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. వడోదరలోని వాఘోడియా రోడ్డులో జవేర్‌నగర్ సమీపంలోని సాయి గణేష్ కాంప్లెక్స్ లో ‘శ్రీ అంబికా జ్యువెలర్స్’ పేరుతో కొత్త షోరూమ్ ప్రారంభించినట్లు సోని తెలిపారు. దసరా సందర్భంగా నిర్వహించబోయే ప్రారంభోత్సవం కోసం ఆభరణాలు సరఫరా చేయాలని ఆయన కోరారు.

ప్రదర్శనకు 5.5 కిలోల బంగారం

Advertisement

దీంతో హిమాన్షు జైన్ సుమారు 5.5 కిలోల బంగారు ఆభరణాలతో వడోదర చేరుకున్నారు. కొత్త షోరూమ్ లో ఈ ఆభరణాలను ప్రదర్శన కోసం ఉంచారు. ఫిర్యాదు ప్రకారం.. సోని, జైన్ సోదరుడు నీల్ భోజనం చేయడానికి షోరూమ్ నుంచి బయటకు వెళ్లారు. బ్యాగులు సురక్షితంగానే ఉంటాయని సోని వారికి హామీ ఇచ్చారు. వారు వెళ్లేటప్పుడు షాపునకు బయటి నుంచి తాళం కూడా వేశారు. ఈ సమయంలో సేల్స్ మేనేజర్ హిమాన్షు జైన్ వాష్ రూమ్ కి వెళ్లారు. కేవలం 12 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి చూసేసరికి షోరూమ్ తాళం తీసి ఉంది. లోపల పరిశీలించగా.. మిగతా ఆభరణాలు అలాగే ఉన్నాయి కానీ బంగారం ఉన్న రెండు బ్యాగులు మాత్రం మాయమయ్యాయి.

సీసీటీవీ ఆధారంగా పోలీసుల గాలింపు

ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నీలిరంగు టూ-వీలర్ పై వచ్చి ఆ బ్యాగులతో పరారైనట్లు తేలింది. దుకాణంలోకి వారు ఎలా ప్రవేశించారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటన జరిగిన తర్వాత తనకు కళ్లు తిరుగుతున్నట్లు చెప్పి అక్కడి నుంచి సోనీ వెళ్లిపోయాడని, ఆ తర్వాత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని జైన్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

Also Read: భారతీయ పైలట్‌పై దాడి.. విచారణ ముమ్మరం చేసిన ఎన్ఐఏ.. యూఏఈకి ప్రత్యేక బృందం!

పథకం ప్రకారమే చోరీ చేశారా?

కొత్త షోరూమ్ ప్రారంభోత్సవం కోసం భారీగా బంగారం ఆర్డర్ ఇవ్వడం చూస్తుంటే ఈ ఘటన ముందస్తు పథకం ప్రకారమే జరిగి ఉంటుందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి.బి. బాభానియా అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకోవడానికి నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు పేర్కొన్నారు. సీసీటీవీల సాయంతో పరారీలో ఉన్న సోని, ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

Tags

Related News

భారతీయ పైలట్‌పై దాడి.. విచారణ ముమ్మరం చేసిన ఎన్ఐఏ.. యూఏఈకి ప్రత్యేక బృందం!

గంగానదిలో పడవ బోల్తా.. మహిళలు-పిల్లలతో సహా 14 మంది మృతి, బీహార్‌లో ఘటన

ఢిల్లీ నిరసనలను అడ్డంపెట్టుకుని పాక్ డ్రామాలు.. 200లకు పైగా ఫేక్ పోస్టులు డిలీట్!

ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఊహించని షాక్.. ఇంటికి భారీగా క్యాష్ ఆన్ డెలివరీలు.. దెబ్బకు ఊరు వదిలి జంప్!

‘లద్దాఖ్ మాది.. మీ వాదన చెల్లదు’.. చైనా అభ్యంతరాలను తిప్పికొట్టిన కేంద్రం!

సీఈసీ జ్ఞానేష్ కుమార్ వివాదం.. సీజేఐకి రాసిన లేఖలో రాహుల్ గాంధీ షాకింగ్ అంశాల ప్రస్తావన!

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీరియస్‌.. మంత్రులకు వార్నింగ్‌!

Big Stories

Advertisement
×