E-Paper
Advertisement

భారతీయ పైలట్‌పై దాడి.. విచారణ ముమ్మరం చేసిన ఎన్ఐఏ.. యూఏఈకి ప్రత్యేక బృందం!

భారతీయ పైలట్‌పై దాడి.. విచారణ ముమ్మరం చేసిన ఎన్ఐఏ.. యూఏఈకి ప్రత్యేక బృందం!
Advertisement

NIA Investigation: దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన హైజాక్ యత్నం, భారతీయ పైలెట్ పై దాడి ఘటనకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ఘటనలో బాధితుడైన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ (Smit Machchhar) స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసేందుకు, అలాగే యూఏఈ అధికారులతో కలిసి దర్యాప్తు జరిపేందుకు వీలుగా ఆ దేశానికి వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరాలని ఎన్ఐఏ నిర్ణయించింది.

అరెస్టైన కో-పైలట్‌ను విచారించే ఛాన్స్

కెప్టెన్ స్మిత్ మచ్చార్ పై దాడి కేసులో అరెస్టైన ఒమన్ దేశ కో-పైలట్ హమామ్ అల్-హమ్మామిని (Hamam al-Hammami) కూడా విచారించేందుకు ఎన్ఐఏ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సెప్టెంబర్ 30న జరిగిన ఈ దాడి వెనుక ఉన్న అసలు కుట్ర కోణాన్ని ఛేదించేందుకు ఈ విచారణ అత్యంత కీలకమని భావిస్తున్నారు. విదేశీ గడ్డపై ఈ ఘటన జరగడంతో యూఏఈ దర్యాప్తు బృందాలు సేకరించిన కీలక వివరాలను కూడా ఎన్ఐఏ రాబట్టనుంది.

కేంద్రం ఆదేశాలతో ఎన్ఐఏ ఎంట్రీ

Advertisement

సెప్టెంబర్ 30 నాటి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (MHA) ఆదేశించడంతో అక్టోబర్ 9న ఎన్ఐఏ అధికారికంగా కేసు నమోదు చేసింది. యాంటీ హైజాకింగ్ చట్టం-2016లోని సెక్షన్ 3, ఉగ్రవాద నిరోధక చట్టం (UAPA) లోని సంబంధిత నిబంధనల కింద ఈ కేసు నమోదైంది. ఈ దాడి భారతీయ పౌరుడిని లక్ష్యంగా చేసుకుని జరగడం, విమానాన్ని కూల్చేసే లేదా హైజాక్ చేసే కుట్ర దాగి ఉండటంతో ఈ కేసును ఎన్ఐఏ సీరియస్‌గా తీసుకుంది. దీనికి అంతర్జాతీయంగా ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని లోతైన దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎన్ఐఏ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.

సెప్టెంబర్ 30న అసలేం జరిగింది?

సెప్టెంబర్ 30న ఉదయం 7.05 గంటలకు (గల్ఫ్ కాలమానం ప్రకారం) 174 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బందితో దుబాయ్ నుంచి బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానం (FZ-1073)… జోర్డాన్-సౌదీ అరేబియా సరిహద్దు ప్రాంతంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా పైలెట్ స్మిత్ మచ్చార్ పై దాడి జరిగింది. కాక్‌పిట్‌లో ఉన్న ఓమనీ కో-పైలట్ సదరు భారతీయ కెప్టెన్‌పై దాడి చేసి విమానాన్ని హైజాక్ చేసేందుకు లేదా కూల్చేసేందుకు యత్నించినట్లు ప్రయాణికులు తెలిపారు. ఈ దాడిలో కెప్టెన్ తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు, ఇతర సిబ్బంది.. కో-పైలట్‌ను అదుపులోకి తీసుకుని కట్టడి చేశారు. ఆ తర్వాత విమానంలోని ఇతర పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.

Advertisement

Also Read: ఎయిరిండియా విమానానికి హైజాక్ ముప్పు.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్, అసలు ఏం జరిగింది?

ఉగ్ర కుట్రగా తేల్చిన యూఏఈ దర్యాప్తు

అయితే ఈ దాడిని యూఏఈ దర్యాప్తు సంస్థ ఉగ్రకుట్రగా తేల్చింది. టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంపైకి విమానాన్ని దూసుకెళ్లేలా చేసి భారీ ప్రాణనష్టం కలిగించాలని ఓమనీ కో-పైలట్ పథకం పన్నినట్లు యూఏఈ అటార్నీ జనరల్ కౌన్సిలర్ డాక్టర్ హమద్ సైఫ్ షమ్సీ తెలిపారు. 2017లో ఆస్ట్రేలియాలో చదువుతున్న కాలంలోనే నిందితుడు తీవ్రవాద భావజాలానికి ఆకర్షితుడైనట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టేందుకు భారతీయ దర్యాప్తు బృందాలు త్వరలోనే యూఏఈకి పయనం కానున్నాయి.

Also Read: జోగులాంబ దర్శనానికి వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నుంచి బస్సులు!

Tags

Related News

గోల్డ్ షాపు ఓపెనింగ్‌కు ముందే బిగ్ షాక్.. 12 నిమిషాల్లో రూ.8 కోట్ల బంగారం చోరీ..!

గంగానదిలో పడవ బోల్తా.. మహిళలు-పిల్లలతో సహా 14 మంది మృతి, బీహార్‌లో ఘటన

ఢిల్లీ నిరసనలను అడ్డంపెట్టుకుని పాక్ డ్రామాలు.. 200లకు పైగా ఫేక్ పోస్టులు డిలీట్!

ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఊహించని షాక్.. ఇంటికి భారీగా క్యాష్ ఆన్ డెలివరీలు.. దెబ్బకు ఊరు వదిలి జంప్!

‘లద్దాఖ్ మాది.. మీ వాదన చెల్లదు’.. చైనా అభ్యంతరాలను తిప్పికొట్టిన కేంద్రం!

సీఈసీ జ్ఞానేష్ కుమార్ వివాదం.. సీజేఐకి రాసిన లేఖలో రాహుల్ గాంధీ షాకింగ్ అంశాల ప్రస్తావన!

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీరియస్‌.. మంత్రులకు వార్నింగ్‌!

Big Stories

Advertisement
×