Cadlec MultiChef Pro 3 in 1 Breakfast Maker: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో.. ఉదయాన్నే హడావుడిగా ఆఫీసులకు,కాలేజీలకు వెళ్లేవారికి రుచి కరమైన బ్రేక్ ఫాస్ట్ తయారు చేయడం ఒక పెద్ద సవాల్‌గా మారుతుంది. అంతే కాకుండా వేర్వేరు వంట పాత్రలను ఉపయోగించి బ్రేక్ ఫాస్ట్ తయారు చేయడం వల్ల టైం వృథా కావడంతో పాటు వంటగది కూడా చిందర వందరగా మారుతుంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేలా ప్రముఖ బ్రాండ్ ‘క్యాడ్లెక్'(Cadlec) సంస్థ మార్కెట్లోకి ‘మల్టీషెఫ్ ప్రో 3 ఇన్ 1 బ్రేక్‌ఫాస్ట్ మేకర్’ను తీసుకు వచ్చింది. ఇది కేవలం ఒక పరికరం మాత్రమే కాదు, మీ వంట గదిలోని కిచెన్ కౌంటర్ స్పేస్‌ను ఆదా చేస్తూ అనేక రకాల వంటలను ఈజీ చేసుకునేలా సహాయ పడుతుంది.
ఈ మల్టీ-ఫంక్షనల్ బ్రేక్‌ఫాస్ట్ స్టేషన్‌లో.. టోస్టర్ ఓవెన్, కాఫీ మేకర్, పెద్ద నాన్-స్టిక్ గ్రిడిల్ (ఫ్రైయింగ్ పాన్) అన్నీ ఒకే యూనిట్‌లో ఉంటాయి. దీని వల్ల మీరు ఒకే సారి వేడి వేడి కాఫీని తయారు చేసుకుంటూనే..మరో వైపు గుడ్లు, సాసేజ్‌లు, పాన్‌కేక్‌లు లేదా బ్రెడ్ టోస్ట్ చేసుకోవచ్చు. ఉదయం పూట ఎలాంటి హడావుడి లేకుండా అతి తక్కువ సమయంలో..పూర్తి స్థాయి బ్రేక్ ఫాస్ట్‌ను తయారు చేసుకోవడానికి ఇది అత్యంత అద్భుతంగా పని చేస్తుంది.
ఓవెన్ టోస్టర్ గ్రిల్లర్: దీనిలో ఉండే విశాలమైన ఓవెన్ ట్రే సహాయంతో బేకింగ్,గ్రిల్లింగ్, టోస్టింగ్ పనులను చాలా ఈజీగా పూర్తి చేసుకోవచ్చు.
కాఫీ మేకర్: ఉదయాన్నే రిఫ్రెష్ అయ్యేందుకు.. వీలుగా సుమారు 4 కప్పుల సామర్థ్యం గల కాఫీ మేకర్ దీనిలో లభిస్తుంది.
నాన్-స్టిక్ ఫ్రైయింగ్ పాన్: పైన అందించిన పెద్ద నాన్-స్టిక్ గ్రిడిల్ గ్లాస్ మూతతో వస్తుంది. కాబట్టి దీనిపై తక్కువ నూనెతో బ్రేక్ ఫాస్ట్ వేయించుకోవచ్చు.
అడ్జస్టబుల్ టెంపరేచర్ , టైమర్: వంటకం రకాన్ని బట్టి ఉష్ణోగ్రతను నియంత్రించడానికి అంతే కాకుండా .. టైం సెట్ చేయడానికి ఈజీగా కంట్రోల్ ప్యానెల్, ఇండికేటర్ లైట్లు ఇందులో ఉన్నాయి.
Also Read: అమెజాన్ ఫ్రీడమ్ సేల్ 2026..సీసీ కెమెరాలపై భారీ డిస్కౌంట్లు!
డిజైన్:
ఈ పరికరం అత్యంత నాణ్యమైన అల్యూమినియం అలాయ్ మెటీరియల్‌తో రూపొందించబడింది. దీని వల్ల ఇది తుప్పు పట్టకుండా.. ఎక్కువ వేడిని తట్టుకునేలా ఉంటుంది. దీని ఆకర్షణీయమైన సిల్వర్ లేదా బ్లాక్ ఫినిషింగ్ మోడరన్ కిచెన్‌లకు మరింత అందాన్ని తెస్తుంది. అలాగే దీన్ని శుభ్రం చేయడం కూడా చాలా ఈజీ.
ధర :
వివిధ ఆన్‌లైన్ స్టోర్లలో లభిస్తున్న ఈ క్యాడ్లెక్ మల్టీషెఫ్ ప్రో అసలు ధర సుమారు రూ. 7,999 వరకు ఉండగా, ప్రస్తుతం వివిధ డిస్కౌంట్లు , ఆఫర్ల ద్వారా ఇది సుమారు రూ. 2,999 నుంచి రూ.3,599 ధరలోపే అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో మల్టీ-పర్పస్ కిచెన్ అప్లయన్స్ కోరుకునే మధ్యతరహా కుటుంబాలకు ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్! కంపెనీ దీనిపై స్టాండర్డ్ వారంటీని కూడా అందిస్తోంది. అంతే కాకుండా ఇది ట్రెండీ లుక్ మీ కిచెన్ కు అందిస్తుంది.