E-Paper
Advertisement

ఆన్ లైన్‌లో బట్టలు కొనక ముందే.. ఫిట్టింగ్ సరిపోతుందో లేదో ముందే చూసుకోవచ్చు!

ఆన్ లైన్‌లో బట్టలు కొనక ముందే.. ఫిట్టింగ్ సరిపోతుందో లేదో ముందే చూసుకోవచ్చు!
Advertisement

ChatGPT virtual try on: ఆన్‌ లైన్‌లో బట్టలు కొనేప్పుడు మనకు సరిపోతాయా లేదా అనే టెన్షన్ , ఫిట్టింగ్ అనుమానాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ సమస్యకు చాట్‌జీపీటీ అద్భుతమైన పరిష్కారం చూపింది. టెక్నాలజీ మారుతున్న కొద్దీ మన డైలీ లైఫ్ స్టైల్ మరింత ఈజీ అయిపోయింది. ముఖ్యంగా ఏఐ సృష్టిస్తున్న విప్లవం అంతా ఇంతా కాదు. తాజాగా ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌‌ఫారమ్ ‘ఓపెన్‌ఏఐ’ తన చాట్‌జిపిటిలో ఒక సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. అదే వర్చువల్ అవుట్‌ఫిట్ ట్రై-అన్ (Virtual Try-On) ఫీచర్. దీని సహాయంతో బట్టలు కొనే ముందే మనం వర్చువల్‌గా వేసుకుని చూసుకోవచ్చు. ఆన్‌లైన్ షాపింగ్ అనుభవాన్నే.. పూర్తిగా మార్చేయబోతున్న ఈ ట్రెండింగ్ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుంది?

సాధారణంగా మనం ఆన్‌లైన్ షాపింగ్ యాప్‌లలో.. బట్టలు చూసేటప్పుడు అవి మనపై ఎలా కనిపిస్తాయో ఊహించుకోవడం కష్టంగా ఉంటుంది. కానీ చాట్‌జిపిటి ద్వారా ఈ సమస్య ఇక ఉండదు.

Advertisement

ఫోటో అప్‌లోడ్: యూజర్లు తమ శరీర ఆకృతికి తగిన ఫోటోను లేదా బేసిక్ బాడీ మెజర్మెంట్లను చాట్‌జిపిటిలో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

డ్రెస్ సెలక్షన్: మీరు కొనాలనుకుంటున్న డ్రెస్ లేదా అవుట్‌ఫిట్ ఫోటోను లేదా దాని లింక్‌ను ఏఐకి అందించాలి.

Advertisement

వర్చువల్ మ్యాచింగ్: చాట్‌‌జిపిటి తన లేటెస్ట్ ఇమేజ్ జనరేషన్ , కంప్యూటర్ విజన్ టెక్నాలజీ సహాయంతో ఆ డ్రెస్‌ను మీపై వర్చువల్‌గా ఉంచి ఎలా ఉంటుందో కచ్చితంగా చూపిస్తుంది. దీనివల్ల కలర్, ఫిట్టింగ్, లుక్ ఎలా ఉందో ముందే స్పష్టంగా మీకు తెలిసిపోతుంది.

ఆన్‌లైన్ షాపింగ్‌లో పెను మార్పులు:

ఈ ఫీచర్ రాకతో రిటర్న్స్ , ఎక్స్ఛేంజ్ సమస్యలు చాలా వరకు తగ్గుతాయని నిపుణులు భావిస్తున్నారు. చాలా సార్లు బట్టలు సరి పోకపోవడం వల్ల వాటిని రిటర్న్ ఇవ్వడం జరుగుతుంటుంది.వర్చువల్ ట్రై-అన్ ద్వారా ఏ బట్టలు మనకు సూట్ అవుతాయో ముందే తెలిసిపోవడం వల్ల సమయం , డబ్బు ఆదా అవుతుంది.

Also Read: ఈ ప్రైస్‌కి ఈ లుక్ వేరే లెవెల్ అంతే! మార్కెట్‌లో అదరగొడుతున్న స్మార్ట్ వాచ్

ధరలు:

ప్రస్తుతం ఈ లేటెస్ట్ ఏఐ ఫీచర్లు ఎక్కువగా చాట్‌జిపిటి ప్రీమియం లేదా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ యూజర్లకు అందుబాటులో ఉంటున్నాయి.

చాట్‌జిపిటి ప్లస్ సబ్‌స్క్రిప్షన్ నెలవారీ ధర సుమారు $20 (మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.1,600 నుంచి రూ.1,700) వరకు ఉంటుంది.

కొన్ని బేసిక్ ఫీచర్లు ఫ్రీ అయినప్పటికీ, ఈ రకమైన అడ్వాన్స్‌డ్ ఇమేజ్ , వర్చువల్ ఫిట్టింగ్ టూల్స్ మాత్రం పెయిడ్ ప్లాన్‌లలో లేదా పార్టనర్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అందుబాటులోకి వస్తున్నాయి.

భవిష్యత్తులో షాపింగ్ ఫీల్ పూర్తిగా మార్చేయగల శక్తి ఈ చాట్‌జిపిటి వర్చువల్ ట్రై-అన్ ఫీచర్‌కు ఉంది. టెక్నాలజీని ఇష్ట పడే వారికి, ఆన్‌లైన్ షాపింగ్ లవర్స్‌కు ఇది నిజంగా ఒక సూపర్ అప్‌డేట్ అని చెప్పొచ్చు. మీరు కూడా ఈ ట్రెండింగ్ ఫీచర్‌ను ట్రై చేసి మీ షాపింగ్‌‌ను మరింత ఈజీ చేసుకోండి!

Related News

రూ.5,999కే వాషింగ్ మెషీన్..ఆఫర్ అంటే ఇలా ఉండాలి!

భూమికి దగ్గరగా శని గ్రహం, 15 ఏళ్లకు ఒక్కసారే వచ్చే అద్భుతం.. ఈ తేదీ మిస్ కావద్దు!

ల్యాప్‌టాప్ ఫీచర్లతో బెస్ట్ ట్యాబ్ విడుదల..ధర కూడా చాలా తక్కువ తెలుసా?

జియో vs వొడాఫోన్ ఐడియా.. రూ.299కే అదిరిపోయే ప్లాన్లు.. ఏది రీఛార్జ్ చేస్తే బెస్ట్?

రూ. 699లకే Airtel, Jio బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు.. రెండింటిలో ఏది బెస్ట్? దేని వల్ల ఎక్కువ లాభం!

ఈ ప్రైస్‌కి ఈ లుక్ వేరే లెవెల్ అంతే! మార్కెట్‌లో అదరగొడుతున్న స్మార్ట్ వాచ్

మీ ఆధార్‌కు ఏ మొబైల్ నంబర్ లింక్ అయిందో..క్షణాల్లో తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×