Nandi Film Awards: ఏపీ ప్రభుత్వం ఇటీవల నంది అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే .ఈ నేపథ్యంలోనే ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ విషయంపై ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా 2017 నుంచి 24 సంవత్సరాలకు గాను నిలిచిపోయిన నంది ఫిలిం అవార్డులను(Nandi Film Award) తిరిగి పునరుద్ధరించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారికి, గౌరవ ఎమ్మెల్యేలు ప్రముఖ సినీ నటులు బాలకృష్ణ వంటి తదితరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు..
ఏపీ ప్రభుత్వానికి 24.09.26 వ తేదీ సమర్పించిన లేఖలో భాగంగా వారి అభ్యర్థనను పరిశీలించి బంగారు, వెండి అలాగే కంస్య నందులు మూడు కేటగిరీలలో ఈ అవార్డులను పునరుద్ధరించడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇకపోతే 2017 నుంచి 24 వ సంవత్సరాలకు గాను ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు(NTR National Film Award)ను పునరుద్ధరించడం పై ఏపీ ప్రభుత్వానికి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
1964 సంవత్సరం నుంచి ఏర్పాటు చేసిన ఈ నంది ఫిలిం అవార్డులు అనేక తెలుగు చిత్ర పరిశ్రమకు తెలుగు ప్రజల సంస్కృతికి ఒక భావోద్వేగంతో కూడుకున్న విషయమని, మన సంస్కృతిని గౌరవించడం ఎల్లప్పుడు ప్రకృతిని కాపాడుతుంది అది తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. అందువల్ల నంది ఫిలిం అవార్డుల ద్వారా కళాకారులను సాంకేతిక నిపుణులను సత్కరించడాన్ని అందరూ అభినందిస్తున్నారు. కావున తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన కళాకారులను సాంకేతిక నిపుణులను గౌరవించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి పార్టీలను మేము హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నామని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రెస్ నోట్ ఫైనల్ అవుతుంది
ఇలా ప్రొడ్యూసర్ కౌన్సిల్ విడుదల చేసిన ప్రెస్ నోట్ అనంతరం మరోక డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. 2017 నుంచి 24 వరకు ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్స్ సంతోషం వ్యక్తం చేసినప్పటికీ ఈ అవార్డులతో సరిపెట్టుకోకుండా రఘుపతి వెంకయ్య, బి.యన్.రెడ్డి, నాగిరెడ్డి చక్రపాణి అవార్డులను కూడా ప్రభుత్వం ప్రకటించాలని మరికొందరు కోరుతున్నారు. అయితే ఈ 8 సంవత్సరాలకు ఐదు అవార్డులతో సరిపెట్టుకోవడం సభబుకాదని ప్రభుత్వం కాస్తంత సమయం తీసుకుని అయినా అన్ని కేటగిరీల వారికి అవార్డులు ఇస్తే న్యాయం చేసినట్లు అవుతుందని కూడా వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు . మరి ఈ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది తెలియాలసి ఉంది.
Also Read: ట్రోల్ చేయడం కోసం నెలకు రూ. 30 వేలు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన కృష్ణుడు!