E-Paper
Advertisement

టీవీలకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? చాలా మందికి తెలియని షాకింగ్ నిజం ఇదే!

టీవీలకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? చాలా మందికి తెలియని షాకింగ్ నిజం ఇదే!
Advertisement

Smart TV lifespan: మనం ఏదైనా ఎలక్ట్రానిక్ గాడ్జెట్ కొనేటప్పుడు.. దాని వారంటీ ఎంత అని చూస్తాం తప్ప, దాని అసలు ఆయుష్షు ఎంత అని ఎప్పుడూ ఆలోచించము. ముఖ్యంగా .. స్మార్ట్ టీవీల విషయానికి వస్తే, ఒకసారి కొంటే అది పదేళ్లు లేదా పదిహేనేళ్లు పాడవకుండా ఉంటుందని  సగానికి పైగా జనాలు భావిస్తుంటారు. అయితే.. టెక్ నిపుణుల విశ్లేషణల ప్రకారం, టీవీలకు కూడా ఒక ఖచ్చితమైన గడువు తేదీ లేదా జీవితకాలం ఉంటుంది. అదేంటో ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిద్దాం.

సాధారణంగా ఎల్ఈడీ , క్యూఎల్ఈడీ లేదా ఓఎల్ఈడీ టీవీలలో వాడే డిస్‌ప్లే ప్యానెల్స్‌కు ఒక నిర్దిష్ట గంటల పరిమితి ఉంటుంది. మార్కెట్లో లభించే.. మంచి బ్రాండ్ టీవీల బ్యాక్‌లైట్.. లైఫ్‌టైమ్ సాధారణంగా 40,000 నుంచి 60,000 గంటల వరకు ఉంటుంది. అంటే మీరు రోజుకు సుమారు 6 నుంచి 8 గంటలు టీవీ చూసినట్లయితే.. దాని హార్డ్‌వేర్ సుమారు 7 నుంచి 10 సంవత్సరాల పాటు  పని చేస్తుంది. ఆ తర్వాత స్క్రీన్ బ్రైట్‌నెస్ క్రమంగా తగ్గిపోవడం లేదా డిస్‌ప్లేలో గీతలు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ రిపేర్ల కోసం అయ్యే ఖర్చు సుమారు రూ. 8,000 నుంచి రూ. 25,000 వరకు ఉండొచ్చు. కొత్త టీవీల ధరలతో.. పోలిస్తే ఈ రిపేర్ చేయించుకోవడం దండగ అనిపిస్తుంది.

సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పైరీ:

Advertisement

హార్డ్‌వేర్ కంటే ముందుగా.. స్మార్ట్ టీవీలను దెబ్బతీసేది సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు నిలిచిపోవడం. ప్రస్తుతం మనం వాడేది కేవలం సాధారణ టీవీలు కాదు, అన్నీ గూగుల్ టీవీలు లేదా స్మార్ట్ ఓఎస్  డివైజెస్‌. టీవీ తయారీ.. సంస్థలు ఏ ఐదేళ్లకో ఆయా మోడళ్లకు సెక్యూరిటీ ప్యాచ్‌లు , ఆండ్రాయిడ్ అప్‌డేట్లను ఆపేస్తుంటాయి. దీని వల్ల నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో లేదా యూట్యూబ్ వంటి ప్రముఖ ఓటీటీ యాప్స్ పాత సాఫ్ట్‌వేర్‌లో రన్ కావడం ఆగిపోతాయి. టీవీ స్క్రీన్ బాగానే.. ఉన్నప్పటికీ, యాప్స్ ఓపెన్ కాకపోవడంతో అది కేవలం ఒక సాధారణ డబ్బాలా మారి పోతుంది.

ప్రాసెసర్, మెమరీ :

మనం మొబైల్ వాడినట్టే.. టీవీని కూడా విపరీతంగా వాడతాం. కాలం గడిచే.. కొద్దీ యాప్స్ సైజ్ పెరిగిపోతుండటం, టీవీలోని ప్రాసెసర్ , ఇంటర్నల్ ర్యామ్ పాత బడిపోవడంతో టీవీ చాలా స్లో అయిపోతుంది. ఛానెల్.. మారాలన్నా లేదా రిమోట్ పని చేయాలన్నా కొన్ని సెకన్ల పాటు లాగ్ అవుతుంటుంది. ప్రాసెసర్ వేడెక్కడం వల్ల మదర్‌ బోర్డు కాలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. దీనిని రిపేర్ చేయించాలంటే.. సుమారు రూ.5,000 నుంచి రూ. 12,000 వరకు ఖర్చు అవుతుంది.

Advertisement

Also Read: ఏఐ మ్యాజిక్‌తో సామ్‌సంగ్ 75 ఇంచుల టీవీ.. విజువల్స్ వేరే లెవెల్ అంతే!

టీవీ ఆయుష్షు పెంచడానికి కొన్ని సింపుల్ టిప్స్:

మీ టీవీ ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఈ టీవీని.. ఎప్పుడూ సరైన వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఉంచాలి, తద్వారా వేడెక్కకుండా.. ఉంటుంది. వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ నుంచి రక్షించడానికి మంచి స్టెబిలైజర్ లేదా వోల్టేజ్ ప్రొటెక్టర్ వాడాలి. అలాగే అనవసరమైన యాప్స్‌ను ఎప్పటికప్పుడు అన్‌ఇన్‌స్టాల్ చేయడం ద్వారా టీవీ పనితీరు మెరుగ్గా ఉంటుంది.

టీవీలకు కాలం చెల్లే సమయం వస్తుందనే నిజాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. సుమారు 7 నుంచి 8 సంవత్సరాలు గడిచాక టీవీలలో సమస్యలు రావడం సహజం. సరైన మెయింటెనెన్స్ ద్వారా దాని ఆయుష్షును కొంత వరకు పొడిగించవచ్చు, టెక్నాలజీ మారుతున్న కొద్దీ ముందుగానే మార్పులు చేసుకోవడం మంచిది.

Related News

చేతికి అదిరిపోయే లుక్.. బెస్ట్ అమోలెడ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్!

రూ.వెయ్యిలోపు అద్భుతమైన ఇయర్‌బడ్స్.. 40గంటల బ్యాటరీ బ్యాకప్‌!

అన్-నోన్ యాప్స్‌కు ఈ పర్మిషన్లు ఇస్తున్నారా? మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం!

కళ్లు చెదిరే ఫీచర్లతో..హైయర్ నుంచి ఎల్ఈడీ టీవీలు లాంచ్!

ఈ చిన్నట్రిక్ తెలిస్తే.. జెప్టో,బ్లింకిట్‌లో ఏ వస్తువైనా సగం ధరకే !

రూ.20వేలలోపే డిష్ వాషర్‌..ఇక గిన్నెలు తోమే టెన్షన్‌కు ఎండ్‌కార్డ్!

రూ.26,790 ధరకే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్, డోంట్ మిస్

Big Stories

Advertisement
×