Nominated Posts: ఎన్నికల సమయంలో పార్టీ కోసం కస్టపడి పనిచేసిన అప్పటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్యమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు 80 శాతం నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకే రాజకీయ వ్యవహారాల ( పి ఎ సి) కమిటి సమావేశం ముఖ్య ఉద్దేశమని పి సి సి అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలో నీ వినాయక ఫంక్షన్ హాల్ లో మెదక్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ పి ఎ సి సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి, మైనంపల్లి,రోహిత్ రావు,మాజీ ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,ఆంజనేయులు గౌడ్,ఆంక్షరెడ్డి,ఆవుల రాజిరెడ్డి,చెరుకు శ్రీనివాసరెడ్డి,లు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల్లో కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకుల కు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని తాను, సీఎం రేవంత్ రెడ్డి డిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గాన్ని ఒప్పించి సహకార సంఘాల అధ్యక్షు లు,డైరెక్టర్ పోస్టుల ను నామినేట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పి సి సి అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు.బి ఆర్ ఎస్ పార్టీ కి వ్యతిరేకంగా పోరాటం చేసిన అప్పటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,ఇతర ముఖ్య నాయకులకు 80 శాతం నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నట్లు వేదికపై ప్రకటించారు.
Also read: అదృష్టం కొద్ది తొలి టెస్ట్ లో బంగ్లా గెలిచింది..అంతే తప్ప వాళ్లు పీకిందేమీ లేదు
నామినేటెడ్ పదవులు ఎమ్మెల్యేలు సూచించిన కార్యకర్తలకు 20% 80% పదవులు అప్పటి కష్టపడ్డ కార్యకర్తలకే దక్కే విధంగా చర్యలు తీసుకుంటామని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. మార్కెట్ కమిటీలు,దేవాలయ కమిటీలు, సహకార సంఘాల అధ్యక్షు పదవి తో పాటు,డైరెక్టర్ పోస్టుల ను త్వరలో నియమిస్తామని ప్రకటించారు. 60 రాష్ట్రస్థాయి చైర్మన్ పదవులు భర్తీ చేశామని త్వరలోనే సంస్థ చైర్మన్ పోస్టులు డైరెక్టర్ పోస్టులు ఇతర ప్రభుత్వపరంగా నామినేట్ చేసే పదవులను 8 శాతం పదవులు పాత కార్యకర్తలకు ఇస్తామని ప్రకటించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల పాలనలో ఏం చేశారో మాజీ మంత్రి హరీశ్‌రావు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూకబ్జాలు, అవినీతి ప్రజలకు ఇంకా గుర్తున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు, మార్ఫింగ్ వీడియోలు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మవద్దని సూచించారు.
ఉద్యోగులకు గత ప్రభుత్వ హయాంలో నెలలో 20వ తేదీ వరకు కూడా జీతాలు అందని పరిస్థితి ఉండేదని, తమ ప్రభుత్వం ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తోందని తెలిపారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో రైతులపై కేసులు పెట్టిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదన్నారు.
Also read: సీజేపీ సంచలన ప్రకటన.. మళ్లీ దిల్లీలో నిరసనలు.. కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్!
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్ని ఉద్యోగాలు కల్పించారో బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్త ఉద్యోగాలు కల్పించకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగించారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఏర్పాటైన పలు కంపెనీలను అదానీ, అంబానీలకు అప్పగించారని విమర్శించారు.
తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నామని, అర్హులైన పేదలు ఇల్లు లేకుండా ఉండకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద పిల్లల కోసం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామని, విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.
Also Read:సరస్సు దగ్గర దొరికిన డబ్బు బ్యాగ్… కట్ చేస్తే జాంబీ ప్రపంచంలో… తెలుగులోనే ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్