E-Paper
Advertisement

ఏఐ మ్యాజిక్‌తో సామ్‌సంగ్ 75 ఇంచుల టీవీ.. విజువల్స్ వేరే లెవెల్ అంతే!

ఏఐ మ్యాజిక్‌తో సామ్‌సంగ్ 75 ఇంచుల టీవీ.. విజువల్స్ వేరే లెవెల్ అంతే!
Advertisement

Samsung Vision AI 75 inch TV 2026: ఇంట్లోనే హాలీవుడ్ రేంజ్ సినిమా థియేటర్ ఫీల్ పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే పెద్ద స్క్రీన్ అనగానే మరకు భారీ ధరలు గుర్తుకొస్తాయి. ఈ టెన్షన్‌ను పూర్తిగా దూరం చేయడానికి ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ మార్కెట్లోకి ఒక అద్భుతమైన టీవీని అందుబాటులోకి తెచ్చింది. అదే శాంసంగ్ విజన్ AI 75 ఇంచ్‌ల అల్ట్రా హెచ్‌డీ మినీ ఎల్ఈడీ స్మార్ట్ టైజెన్ టీవీ. కేవలం రూ.1,02,990 ధరకే ఈ టీవీ లభిస్తోంది. అయితే బడ్జెట్ లో బెస్ట్ ఫీచర్లు ఉన్న ఈ స్మార్ట్ టీవీ ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో ఏఐ ప్రతి గాడ్జెట్‌లోనూ విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఈ కోవలోనే సామ్‌సంగ్ సంస్థ మార్కెట్లోకి తీసుకొచ్చిన లేటెస్ట్ ఎడిషన్ ‘సామ్‌సంగ్ విజన్ AI 75 ఇంచ్‌ల అల్ట్రా హెచ్‌డీ మినీ ఎల్ఈడీ స్మార్ట్ టైజెన్ టీవీ’ ప్రస్తుతం టెక్కీలు, మూవీ లవర్స్ మధ్య ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది. బెస్ట్ ఫీచర్లతో వస్తున్న ఈ టీవీ గురించిన పూర్తి వివరాలు..

Advertisement

75 ఇంచుల మినీ ఎల్ఈడీ డిస్‌ప్లే :

ఈ టీవీ మెయిన్ హైలైట్ దాని డిస్‌ప్లే సైజ్ , టెక్నాలజీ. ఏకంగా 189 సెం.మీ అనగా 75 ఇంచ్‌ల అతిపెద్ద స్క్రీన్‌తో ఇది వస్తుంది. ఇందులో సాధారణ ఎల్ఈడీల కంటే చాలా మెరుగైన మినీ ఎల్ఈడీ టెక్నాలజీని వాడారు. దీని వల్ల స్క్రీన్‌పై డీటెయిలింగ్ అద్భుతంగా ఉంటుంది. చీకటి సీన్లలో.. కూడా స్పష్టమైన నలుపు రంగు, కాంతివంతమైన వెలుతురు కనిపిస్తాయి. మీరు ఎలాంటి యాక్షన్ మూవీ చూసినా స్క్రీన్ నుంచి కళ్లు తిప్పుకోలేరు.

Advertisement

విజన్ AI మ్యాజిక్, 4K అప్లిఫ్ట్మెంట్:

ఈ టీవీకి ప్రత్యేకత తెచ్చింది దీని లోని ‘విజన్ ఏఐ’ టెక్నాలజీ. మీరు చూస్తున్న కంటెంట్ క్వాలిటీని ఈ ఏఐ సిస్టమ్ క్షణాల్లో విశ్లేషించి, దానిని ఆటోమేటిక్‌గా అల్ట్రా హెచ్‌డీ క్వాలిటీకి అప్‌గ్రేడ్ చేస్తుంది. మీరు.. పాత యూట్యూబ్ వీడియోలు లేదా సాధారణ రిజల్యూషన్ ఉన్న ఛానెళ్లు చూస్తున్నప్పటికీ, వాటిని కూడా హై-డెఫినిషన్ విజువల్స్‌లా మార్చి కంటికి మంచి విజువల్ ట్రీట్ ఇస్తుంది. కలర్ కరెక్షన్ , బ్రైట్‌నెస్ వాటంతట అవే ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతాయి.

టైజెన్ ఓఎస్, స్మార్ట్ ఫీచర్లు:

శాంసంగ్ సొంత ఆపరేటింగ్ సిస్టమ్ అయిన టైజెన్ ఓఎస్ పై ఈ టీవీ రన్ అవుతుంది. నెట్‌ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి అన్ని ప్రముఖ ఓటీటీ యాప్స్ ఇందులో.. ఇన్‌బిల్ట్‌గా లభిస్తాయి. యూజర్ ఇంటర్‌ఫేస్ చాలా స్మూత్‌గా, ఎలాంటి లాగ్ లేకుండా పని చేస్తుంది. వాయిస్ కంట్రోల్ సపోర్ట్ ఉండటం వల్ల రిమోట్‌తో.. పని లేకుండా కేవలం మీ మాటలతోనే టీవీని ఆపరేట్ చేయొచ్చు. గేమింగ్ లవర్స్ కోసం ప్రత్యేకమైన గేమింగ్ హబ్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.

Also Read:  పాకెట్ సైజ్ పవర్ బ్యాంక్.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు!

రూ. 1,02,990 ధర:

75 ఇంచుల స్క్రీన్, మినీ ఎల్ఈడీ టెక్నాలజీ, విజన్ ఏఐ ప్రాసెసర్‌తో వస్తున్న ఈ టీవీ ధర మార్కెట్లో కేవలం రూ. 1,02,990 మాత్రమే ఉండటం విశేషం. సాధారణంగా ఈ సైజ్ , స్పెసిఫికేషన్లు ఉన్న ప్రీమియం టీవీల ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ శాంసంగ్ ఈ ప్రైస్ ట్యాగ్‌తో సాధారణ మధ్యతరగతి, ప్రీమియం కస్టమర్లను ఒకేలా ఆకట్టుకుంటోంది.

మీ ఇంటి లివింగ్ రూమ్‌ను ఒక సినిమా హాల్‌లా మార్చుకోవాలనుకుంటే.. సామ్‌సంగ్ విజన్ AI 75 ఇంచుల మినీ ఎల్ఈడీ టీవీ ఒక బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ ఛాయిస్. లేటెస్ట్ ఏఐ ఫీచర్లు, అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ కోరుకునేవారు నిస్సందేహంగా ఈ ఎడిషన్ మోడల్‌ను ఎంచుకోవచ్చు.

Related News

రూ.26,790 ధరకే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్, డోంట్ మిస్

పాకెట్ సైజ్ పవర్ బ్యాంక్.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు!

జేబులో ఇమిడిపోయే పవర్ బ్యాంక్‌తో.. ఫాస్ట్ ఛార్జింగ్ మజా!

ఈ ఎయిర్ ఫ్రైయర్లతో.. కరెంట్ బిల్లు, టైమ్ సగం ఆదా!

బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ వాచ్ కావాలా? అయితే..ఈ మోడల్ మీ కోసమే!

75 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో..గోబౌల్ట్ ఇయర్‌ బడ్స్!

ఇల్లు దద్దరిల్లే సౌండ్‌తో సోనీ సౌండ్‌బార్..మ్యూజిక్ లవర్స్‌కి పండగే!

Big Stories

Advertisement
×