Dual sim: ఫోన్ ఫుల్ ఛార్జ్ ..చేసినా సాయంత్రం అయ్యే సరికి బ్యాటరీ డెడ్ అయిపోతోందా? దీనికి మీ డ్యూయల్ సిమ్ వాడకం లేదా 5G నెట్‌వర్కే కారణం కావచ్చని మీకు తెలుసా? ఈ రోజుల్లో.. చాలా మంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఫోన్ బ్యాటరీ వేగంగా డిశ్చార్జ్ కావడమే. అయితే.. రెండు సిమ్‌లు ఒకే ఫోన్‌లో యాక్టివ్‌గా ఉండటం, అలాగే ఎప్పుడూ ఆన్‌లో ఉండే.. 5G నెట్‌వర్క్ బ్యాటరీని నిజంగానే వేగంగా పీల్చేస్తాయా? దీని వెనక ఉన్న టెక్నికల్ నిజాలేంటో ఇప్పుడు చూద్దాం!
1. రెండు సిమ్‌లు:
మీ ఫోన్‌లో ఒకే సమయంలో రెండు సిమ్ కార్డ్‌లు యాక్టివ్‌గా ఉన్నప్పుడు, ఫోన్‌లోని సెల్యులర్ మోడెమ్ ఎల్లప్పుడూ రెండు వేర్వేరు టవర్లతో సిగ్నల్స్ మార్పిడి చేసుకుంటూ ఉండాలి. ఒక సిమ్‌లో సిగ్నల్స్ తక్కువగా ఉంటే.. ఆ సిమ్ టవర్ కోసం ఎక్కువ పవర్‌ను ఖర్చు చేస్తుంది. దీని వల్ల ప్రాసెసర్‌పై భారం పడి స్టాండ్‌బై మోడ్‌లో కూడా బ్యాటరీ నిరంతరం ఖర్చవుతుంది. సింగిల్ సిమ్‌తో పోలిస్తే.. డ్యూయల్ సిమ్ వాడేటప్పుడు సుమారు 10 నుంచి 15 శాతం వరకు బ్యాటరీ ఎక్కువ ఖర్చయ్యే అవకాశం ఉంది.
ఇక రెండో అతిపెద్ద విలన్ ‘5G నెట్‌వర్క్’. 4Gతో పోలిస్తే.. 5G ఇంటర్నెట్ స్పీడ్ చాలా ఎక్కువ. కానీ ఈ హై-స్పీడ్ డేటాను అందించడానికి ఫోన్ యాంటెన్నా , మోడెమ్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ ప్రాంతంలో 5G సిగ్నల్స్ సరిగ్గా రాకపోతే.. ఫోన్ ఎల్లప్పుడూ 4G నుంచి 5Gకి, 5G నుంచి 4Gకి మారుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ బ్యాటరీని అత్యంత వేగంగా పీల్చేస్తుంది. అంతేకాకుండా.. హెవీ డేటా స్ట్రీమింగ్ లేదా ఆన్ లైన్ గేమింగ్ చేసేటప్పుడు.. 5G మోడెమ్ వేడెక్కడంతో పాటు బ్యాటరీ క్షణాల్లో డ్రైన్ అయిపోతుంది.
Also Read: ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే అందే అద్భుతమైన లాభాలు!
ప్రస్తుత టెక్నాలజీ ట్రెండ్ ప్రకారం.. ఫోన్ బ్యాటరీని కాపాడుకోవడానికి కొన్ని స్మార్ట్ చిట్కాలు పాటించడం చాలా ముఖ్యం.
నెట్‌వర్క్ సెట్టింగ్స్ మార్చండి: మీకు ఎప్పుడైతే హై-స్పీడ్ ఇంటర్నెట్ అవసరమో.. అప్పుడే 5G ఆన్ చేసుకోండి. సాధారణ బ్రౌజింగ్ లేదా కాల్స్ కోసం ‘5G ఆటో’ లేదా ‘4G’ మోడ్‌ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా చాలా వరకు బ్యాటరీని సేవ్ చేయెచ్చు.
రెండో సిమ్‌ను అవసరమైనప్పుడు వాడండి: వ్యక్తిగత , ఆఫీస్ నంబర్ల కోసం డ్యూయల్ సిమ్ తప్పనిసరి అయితే.. రెండవ సిమ్‌ను డేటా కోసం వాడకుండా కేవలం కాల్స్ వరకే పరిమితం చేయండి.
సిగ్నల్ వీక్‌గా ఉన్నప్పుడు: ప్రయాణాల్లో లేదా సిగ్నల్స్ సరిగ్గా.. లేని ప్రాంతాల్లో ఫోన్ నెట్‌వర్క్ వెతికే క్రమంలో .. బ్యాటరీ త్వరగా ఖర్చవుతుంది. అలాంటి సమయంలో.. అవసరమైతే ‘ఫ్లైట్ మోడ్’ ఆన్ చేయడం మంచిది.
మొత్తానికి చూస్తే, డ్యూయల్ సిమ్ , 5G టెక్నాలజీలు మన పనులను వేగవంతం చేస్తున్నప్పటికీ.. బ్యాటరీ పరంగా కొద్దిగా భారాన్ని మోపుతున్నాయి. చిన్న చిన్న సెట్టింగ్స్ .. మార్పులు చేసుకోవడం ద్వారా బ్యాటరీ తొందరగా అయిపోకుండా ఈజీగా కాపాడుకోవచ్చు!