E-Paper
Advertisement

సరిగమపలో అదరగొడుతున్న దైవిక్.. అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే!

సరిగమపలో అదరగొడుతున్న దైవిక్.. అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే!
Advertisement

Daiwik Singer: దైవిక్ ..దైవిక్ ..దైవిక్ ..ఇపుడు సింగింగ్ రియాలిటీ షో ‘సరిగమప – ది నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్’ప్రోగ్రాం చూస్తున్న ప్రతివారి నోట వినిపిస్తున్న పేరిదే.ఈ టాలెంటెడ్ సింగర్ గొంతు తెరిచి పాట పాడితే చాలు లక్షలాది సంగీత ప్రియులు అలా టీవీలకి అతుక్కుపోతున్నారు.

కారణం ఏంటో తెలుసా ..ఈ కుర్రాడు గొంతు తెరిచి పాట పాడాడంటే అచ్చం స్వర్గంలో ఉన్న బాలుగారే కళ్ళ ముందుకు వచ్చి పాట పాడుతున్నారా అని అనిపించేంతగా అదరగొడుతుండటమే.అంతలా బాలు గారి గొంతుని తన గొంతులో రీక్రియేట్ చేస్తున్నాడు దైవిక్.ఒక రకంగా రీ క్రియేట్ అనడం కన్నా బాలు గారి గొంతును పోలిన గొంతు ఆ అబ్బాయికి దక్కిందనే చెప్పాలి.

Advertisement

విశాఖపట్నంకి చెందిన దైవిక్

మరి సరిగమపలో అదరగొడుతున్న దైవిక్ ఎక్కడి నుండి వచ్చాడు,అసలు అతడికి సంగీతంపై ఇంతటి ఆసక్తి ఎలా కలిగింది ?అంటూ ఆరాలు తీస్తున్నారు మ్యూజిక్ లవర్స్.టాలెంటెడ్ సింగర్ దైవిక్ స్వస్థలం వైజాగ్. అవును..విశాఖపట్నంకి చెందిన దైవిక్ కి చిన్నప్పటి నుండే సంగీతం అంటే చాల ఇష్టం. ఇక తన గొంతు అచ్చం బాలు గారి గొంతుని పోలి ఉందని అందరూ అంటుండటంతో సంగీతం అంటే మరింత మక్కువ పెంచుకుని ఎన్నో పాటల పోటీలలో పాల్గొని అవార్డులని సొంతం చేసుకున్నాడు.

Advertisement

అలా మెల్లిగా మెల్లిగా తన పాటల ప్రయాణాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూ ఎట్టకేలకి జీ తెలుగులో ప్రసారం అవుతున్న సింగింగ్ రియాలిటీ షో ‘సరిగమప – ది నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్’లో అవకాశం దక్కించుకున్నాడు.

బాలు గారు పాడినట్టే

ఇక ఈ సింగింగ్ రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చిన దైవిక్ ఒక్కసారిగా తన గొంతుతో అటు సంగీత అభిమానులతో పాటు,ఇటు జడ్జ్ లని కూడా మెస్మరైజ్ చేశాడు. మాములుగా ఇలాంటి సింగింగ్ రియాల్టీ షోలకి వచ్చే కంటెస్టెంట్లకు పెద్ద టాస్క్ ఏమైనా తమ గొంతుని ఆడియన్స్ కి పరిచయం చేయడమై.అదిగో అక్కడ సక్సెస్ అయ్యాడు దైవిక్. దైవిక్ కళ్ళు మూసుకుని పాడుతుంటే బాలు గారు పాడినట్టే ఉండటంతో ఈజీగా కనెక్ట్ అయ్యారు అంతా.

ఆకాశానికి ఎత్తేసిన sp శైలజ

ముఖ్యంగా ఎస్.పి. బాలు గారు పాడిన ‘శంకరాభరణం’ సినిమాలోని “ఓంకార నాదానుసంధానమౌగానమే” ‘సాగర సంగమం’ మూవీలోని “తకిట తధిమి తకిట తధిమి తంధాన” అలాగే ‘స్వాతిముత్యం’ లోని “సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ” ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చిత్రంలోని “అబ్బనీ తీయని దెబ్బ”, ‘ప్రేమ’ సినిమాలోని “ప్రియతమా నా హృదయమా” వంటి సాంగ్స్ ని పాడి మెప్పించాడు.ఇది చూసిన జడ్జ్ sp శైలజ దైవిక్ పాట విని అచ్చం బాలు గారు తన కెరీర్ తొలినాళ్ళలో ఎలా పాడేవారో అలాగే పాడారంటూ ఆకాశానికి ఎత్తేసింది.

భావం అర్థమయ్యేవిధంగా పాడటంపైనే  ఫోకస్

దైవిక్ పాట పాడుతున్న విధానం చూస్తే పాటని కేవలం పాడేశాం అని కాకుండా ,ఆ పాటలో ఉన్న భావాన్ని ఆడియన్స్ కి చేరే విధంగా పాడటంపైనే ఎక్కువగా ఫోకస్ చేశాడని అర్థం అవుతుంది. స్మూతీగా పాడటంతో పాటు,అవసరమైన చోట గొంతులో సరైన ఎమోషన్ తీసుకురావడం అతని స్పెషాలిటీ అని చెప్పాలి.ఇక షో లో పాడే పాటలలో ఒకసారి క్లాసికల్ సాంగ్స్ తో ఆకట్టుకుంటే,మరోసారి మెలోడీతో మెస్మరైజ్ చేస్తున్నాడు

మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం

ఇక దైవిక్ స్వస్థలం వైజాగ్‌కు తెలుగు సంగీత ప్రపంచంలో ఎంత ప్రత్యేకమైన స్థానం ఉందో చెప్పక్కర్లేదు. ఈ నగరం నుండే ఎంతో మంది కళాకారులు తమదైన టాలెంట్ తో ఆడియన్స్ మనసుల్ని దోచేశారు. ఇప్పుడు అదే నగరం నుంచి వచ్చిన దైవిక్ సింగింగ్ రియాలిటీ షో ‘సరిగమప – ది నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్’ప్రోగ్రాంలో సత్తా చాటుతుండటంతో వైజాగ్ ఆడియన్స్ లోనూ అతనిపై ఆసక్తి పెరుగుతోంది.

మరి తనదైన గొంతుతో అలరిస్తున్న ఈ జూనియర్ బాలుకి వచ్చే రోజుల్లో సంగీత దర్శకుల నుండి మంచి మంచి అవకాశాలు రావాలని, ప్లే బ్యాక్ సింగర్ గా సత్తా చాటాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

Tags

Related News

గణేష్ నిమజ్జనం స్పెషల్ ఈవెంట్.. సందడి చేసిన సెలబ్రిటీస్!

బిగ్ బాస్ 10: మారిన ఓటింగ్.. ఎలిమినేషన్ దిశగా మరో లేడీ?

బిగ్ బాస్ 10లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న భల్లాల దేవ?

బిగ్ బాస్ త్రిగుణ్ సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారా? ఈయన భార్య ఎవరంటే?

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు మైండ్ బ్లాక్.. పార్వతి మాటతో షాక్.. పాపం ప్రభా..

Karthika Deepam 2 Serial Today Episode September 23rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన దీప, కార్తీక్           

Big Stories

Advertisement
×