E-Paper
Advertisement

సౌదీ అరేబియాకు వెళ్లొద్దు.. హౌతీ దాడులతో పలు దేశాల హెచ్చరికలు!

సౌదీ అరేబియాకు వెళ్లొద్దు.. హౌతీ దాడులతో పలు దేశాల హెచ్చరికలు!
Advertisement

Saudi Arabia Airport Attacks: మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఈ  నేపథ్యంలో పలు దేశాలు తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేశాయి. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్ సహా పలు దేశాలు సౌదీ అరేబియా పర్యటనలను వాయిదా వేసుకోవాలని లేదంటే ప్రయాణానికి ముందు పరిస్థితులను సమీక్షించుకోవాలని సూచించాయి. ఈ పరిణామాలతో అంతర్జాతీయ విమానయాన రంగంలోనూ ఆందోళన నెలకొంది.

సౌదీ ప్రయాణాలపై పలు దేశాల ఆంక్షలు!

సౌదీ అరేబియాలో భద్రతాపరమైన ముప్పు పెరుగుతోందంటూ అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులను అప్రమత్తం చేసింది. ఇరాన్, ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ గ్రూపుల నుంచి దాడులు జరిగే అవకాశం ఉందని, సౌదీ అరేబియా పర్యటనలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలని సూచించింది. కెనడా కూడా అత్యవసరం కాని ప్రయాణాలకు దూరంగా ఉండాలని తమ పౌరులకు తెలిపింది. దక్షిణ కొరియా, సౌదీలో ఉన్న తమ పౌరులు అత్యవసర పరిస్థితులు మినహా అక్కడి నుంచి వెళ్లిపోవడాన్ని పరిశీలించాలని, కొత్తగా వెళ్లాలనుకునేవారు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలన్నది.

Advertisement

ఆస్ట్రేలియా పౌరులు రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లవద్దని సూచించింది. ఇతర విమానాశ్రయాలకు వెళ్లాలా? వద్దా? అనే విషయాన్ని కూడా పునఃపరిశీలించాలని పేర్కొంది. న్యూజిలాండ్ సైతం కొన్ని ప్రాంతాలకు వెళ్లవద్దని, అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరింది. యూకే కూడా జెడ్డా, దమ్మామ్ సహా పలు ప్రాంతాలకు ప్రయాణాల విషయంలో హెచ్చరికలు జారీ చేసింది.

వరుస దాడులతో విమానాశ్రయాల్లో కలకలం!

వారంలోపే సౌదీ విమానాశ్రయాలపై ఐదు దాడులు జరిగాయి. కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఆదివారం క్షిపణి దాడి జరగడంతో ఒకరు మరణించగా, మరో 11 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. అంతకుముందు శనివారం జరిగిన మరో దాడిలో 13 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఆదివారం జరిగిన దాడికి ఇప్పటివరకు ఏ గ్రూపు బాధ్యత ప్రకటించలేదు.

విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం

Advertisement

దాడుల ప్రభావంతో సౌదీ అరేబియాలోని కొన్ని ప్రధాన విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే, అక్కడి నుంచి వెళ్లే విమానాలపైనా ప్రభావం పడింది. ఫ్లైట్‌ రాడార్24 వివరాల ప్రకారం, ఆదివారం జెడ్డా విమానాశ్రయంలో 150కి పైగా విమానాలు రద్దు కాగా, 374 విమానాలు ఆలస్యమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంక్షోభం ఎంతకాలం?

ఈ పరిణామాలు విమానయాన రంగంపై ఎంతకాలం ప్రభావం చూపుతాయో ఇప్పుడే అంచనా వేయడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విమానాశ్రయాలు ఎప్పుడు తిరిగి పూర్తిస్థాయిలో పనిచేస్తాయి? ప్రయాణాలపై ఆంక్షలు ఎంతకాలం కొనసాగుతాయి? అనే అంశాలపైనే పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. సౌదీ అరేబియాకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకునే ముందు సంబంధిత ఎయిర్‌లైన్స్ సమాచారం, అధికారిక ట్రావెల్ అడ్వైజరీలను తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also: ఇప్పుడు స్మిత్.. అప్పుడు నీర్జా.. తూటాలకు ఎదురొడ్డి వందల మంది ప్రాణాలు కాపాడిన వీరవనిత!

Tags

Related News

ఏపీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. గుంటూరు నుంచి స్పెషల్ రైలు!

వందే భారత్ సరికొత్త రికార్డు.. 180 కిలోమీటర్ల వేగంతో ట్రయల్ సక్సెస్!

పెంగ్విన్ల మలంతో కరుగుతున్న మంచు.. అంటార్కిటికాలో వింత పరిణామం!

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 25 గంటల తర్వాత అన్ని స్టేషన్లు ఓపెన్!

రైళ్ల రద్దుపై కీలక అప్‌డేట్.. ఇండియన్ రైల్వే ఏం చెప్పిందంటే!

రన్నింగ్ ట్రైన్ లోనూ కన్ఫార్మ్ టికెట్ పొందొచ్చు, IRCTCలో ఈ సింపుల్ ట్రిక్ ఫాలోకండి!

బ్లింకిట్ గా మారిపోయిన ఇండియన్ రైల్వే.. రిక్వెస్ట్ పెట్టిన 10 నిమిషాల్లోనే డైపర్లు వచ్చేశాయ్!

Big Stories

Advertisement
×