E-Paper
Advertisement

కొత్త వాషింగ్ మిషన్ కావాలా? మీకిదే గోల్డెన్ ఛాన్స్.. చౌకగా బ్రాండెడ్ మోడల్స్!

కొత్త వాషింగ్ మిషన్ కావాలా? మీకిదే గోల్డెన్ ఛాన్స్.. చౌకగా బ్రాండెడ్ మోడల్స్!
Advertisement

Washing Machine Deals: ప్రస్తుతం జరుగుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్-2026 సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలతో పాటు ప్రముఖ బ్రాండ్లకు చెందిన వాషింగ్ మిషన్లపై కూడా భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎల్‌జీ (LG), శాంసంగ్ (Samsung), బాష్ (Bosch), హైయర్ (Haier) తదితర టాప్ బ్రాండ్లకు చెందిన 5-స్టార్ రేటింగ్ కలిగిన వాషింగ్ మిషన్లు చాలా తక్కువ ధరకే అందిస్తున్నారు. ఏఐ ఫీచర్లు, స్టీమ్-వాష్ వంటి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఈ మిషన్లు.. అన్ని వర్గాల ప్రజలకు పర్ఫెక్ట్ గా సరిపోతాయి. కంపెనీల వారీగా వాషింగ్ మిషన్ల ఆఫర్లేంటో ఈ కథనంలో చూద్దాం.

ఎల్‌జీ వాషింగ్ మిషన్లు..

ఎక్కువ మంది సభ్యులు ఉండే కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ఎల్‌జీ (LG) వివిధ రకాల సామర్థ్యం కలిగిన వాషింగ్ మిషన్ మోడళ్లను అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం అమెజాన్ సేల్ లో ఎల్ జీ 5 స్టార్ వాషింగ్ మిషన్లపై భారీ రాయితీ అందుబాటులో ఉంది. రూ.87,490 ధర కలిగిన ఎల్‌జీ 12 కేజీ 5-స్టార్ వాషింగ్ మిషన్ ప్రస్తుతం రూ.62,990కే లభిస్తోంది. అలాగే మరో ఎల్‌జీ 12 కేజీ మోడల్ రూ.61,990 నుండి తగ్గింపుతో రూ.52,990 ధర వద్ద అందుబాటులో ఉంది. రూ.33,990 విలువైన ఎల్‌జీ 9 కేజీల 5-స్టార్ వాషింగ్ మిషన్ కేవలం రూ.23,990ల ప్రారంభ ధరకే సేల్ లో లభిస్తుండటం విశేషం.

బాష్, శాంసంగ్ ఆకర్షణీయమైన డీల్స్

Advertisement

క్వాలిటీకి కేరాఫ్ గా నిలిచే బాష్ (Bosch), శాంసంగ్ (Samsung) బ్రాండ్లు కూడా తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లను అందిస్తున్నాయి. ప్రస్తుతం అమెజాన్ సేల్ లో బాష్ సంస్థకు చెందిన 12 కేజీల 5-స్టార్ మిషన్ రూ.85,990 నుంచి భారీగా తగ్గి.. కేవలం రూ.46,990కే అందుబాటులో ఉంది. అదేవిధంగా బాష్ 10 కేజీ మోడల్ రూ.73,990 నుంచి తగ్గి రూ.47,290కి లభిస్తోంది. మరోవైపు శాంసంగ్ 10 కేజీల 5-స్టార్ వాషింగ్ మిషన్ రూ.46,990 నుండి దిగొచ్చి రూ.28,990కే వినియోగదారులకు అందుబాటులో ఉంది.

హైయర్, ఇతర బ్రాండ్ల ప్రత్యేక ఆఫర్లు

పెద్ద కెపాసిటీ సెగ్మెంట్‌లో హైయర్ (Haier) బ్రాండ్ కు మంచి గుడ్ విల్ ఉంది. ఈ నేపథ్యంలో హైయర్ 12 కేజీల 5-స్టార్ వాషింగ్ మిషన్ల ధరలు రూ.59,000, రూ.68,600 నుంచి తగ్గి రూ.45,990, రూ.43,990కి లభిస్తున్నాయి. అలాగే శాంసంగ్ 12 కేజీల 5-స్టార్ మోడల్ కూడా రూ.52,990 నుంచి తగ్గి రూ.44,990 ధరకే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Advertisement

Also Read: తమిళనాడు టూర్‌లో మోడీ, విజయ్‌ల ఎడముఖం పెడముఖం! పరువు పోకుండా మోడీ తండ్లాట..! మౌనంగా ఉంటూ ఇమేజీని డ్యామేజీ చేసేలా విజయ్‌..!

అదనపు బ్యాంక్ డిస్కౌంట్లు

అమెజాన్ సేల్‌లో పైన పేర్కొన్న డిస్కౌంట్లతో పాటు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై మరిన్ని రాయితీలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా శాంసంగ్, ఎల్‌జీ వాషింగ్ మిషన్లపై రూ.10,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. బాష్ మోడళ్లపై రూ.9,000 వరకు, ఐఎఫ్‌బి (IFB) మిషన్లపై రూ.9,750 వరకు, వోల్టాస్ బేకో (Voltas Beko) సెలెక్టెడ్ మోడళ్లపై రూ.3,000 వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు.

Also Read: అమెజాన్ బంపరాఫర్.. సగం ధరకే ప్రీమియం OLED టీవీలు.. ఇంటినే థియేటర్‌గా మార్చేయండి!

Tags

Related News

అమెజాన్‌లో బంపర్ సేల్.. రూ.59,000 తగ్గిన ప్రీమియం రిఫ్రిజిరేటర్ ధర!

థియేటర్లలను తలపించేలా హైసెన్స్ ఎల్ఈడీ టీవీలు..ఎగబడి కొంటున్న జనం

అమెజాన్ బంపరాఫర్.. సగం ధరకే ప్రీమియం OLED టీవీలు.. ఇంటినే థియేటర్‌గా మార్చేయండి!

ఫోన్‌లో అనవసరమైన యాడ్స్ వస్తున్నాయా?ఈ 5 పద్ధతులతో చెక్ చేయండి!

వాషింగ్ మెషీన్లపై నమ్మలేని తగ్గింపు..కొనడానికి సూపర్ టైం

సౌండ్‌బార్‌లపై అదిరిపోయే ఆఫర్లు..60శాతానికి పైగా డిస్కౌంట్ !

రీస్టార్ట్ చేస్తే ఫోన్ స్పీడ్ పెరుగుతుందా? ఇది తెలిస్తే మళ్లీ ఆ పని చేయరు!

Big Stories

Advertisement
×