Indian Railway interesting Rules: రైలు ప్రయాణీకులకు భారతీయ రైల్వే సంస్థ బోలెడు సౌకర్యాలను అందిస్తున్నది. రైలు టికెట్ కొనుగోలు చేయడం ద్వారా ప్రయాణీకులు ఉచితంగా పలు హక్కులను పొందే అవకాశం ఉంటుంది. ఫ్రీ బెడ్ రోల్స్ ల, ఫ్రీ ఫుడ్ సహా చాలా సదుపాయాలను కల్పిస్తున్నది. వీటిని రైలు ప్రయాణీకులకు ఎప్పుడు, ఎలా కల్పిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ ఉచిత బెడ్ రోల్
భారతీయ రైల్వే సంస్థ అన్ని AC1, AC2, AC3 కోచ్‌లలో తన ప్రయాణీకులకు ఒక దుప్పటి, ఒక దిండు, రెండు బెడ్ షీట్లు, ఒక హ్యాండ్ టవల్‌ను అందిస్తుంది. గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ లో ఈ సదుపాయాలకు రూ. 25 చెల్లించాలి. కొన్ని రైళ్లలో, ప్రయాణీకులు స్లీపర్ క్లాస్ లో బెడ్ రోల్‌లను కూడా పొందవచ్చు. ఒకవేళ మీకు బెడ్ రోల్ లభించకపోతే, రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసి, మీ అమౌంట్ ను రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది.
⦿ ఉచిత వైద్య సాయం
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మీకు అనారోగ్యంగా అనిపిస్తే, రైల్వే సంస్థ మీకు ఉచితంగా ప్రథమ చికిత్స అందిస్తుంది. ఒకవేళ ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉంటే, తదుపరి చికిత్స కోసం ఏర్పాట్లు చేస్తుంది. రైల్లో వైద్యసాయం కోసం టికెట్ కలెక్టర్లు, రైలు సూపరింటెండెంట్లు సహా ఇతర రైలు ఉద్యోగులకు విషయం చెప్పాలి. మీరు చేరుకునే తర్వాతి రైల్వే స్టేషన్ లో నామినల్ ఫీజుతో వైద్య చికిత్సను అందిస్తారు.
⦿ ఉచిత ఆహారం
రాజధాని, దురంతో, శతాబ్ది లాంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణిస్తున్న సమయంలో రైలు 2 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే, రైల్వే సంస్థ మీకు ఫ్రీగా ఫుడ్ అందిస్తుంది. ఇంకా రైలు ఆలస్యం అయితే RE ఇ-క్యాటరింగ్ సర్వీస్ ద్వారా రైలులో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.
⦿ లగేజీని స్టేషన్ లో నెల రోజులు ఉంచుకోవచ్చు!
దేశంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో క్లోక్ రూమ్‌లు, లాకర్ రూమ్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీ వస్తువులను ఈ లాకర్ రూమ్‌లు, క్లోక్‌రూమ్‌లలో గరిష్టంగా నెల రోజుల వరకు ఉంచుకోవచ్చు. అయితే, ఈ సదుపాయం పొందేందుకు కొంత ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
⦿ ఉచిత వెయిటింగ్ హాల్
ఒక్కోసారి ఏదైనా స్టేషన్‌లో దిగిన తర్వాత, మీరు తదుపరి రైలును ఎక్కడానికి స్టేషన్‌లో కొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. లేదంటే, ఇతర పని కోసం స్టేషన్‌లో ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో స్టేషన్ లో నిర్మించిన ఏసీ, నాన్-ఏసీ వెయిటింగ్ హాల్‌లో హాయిగా వేచి ఉండవచ్చు. ఈ సౌకర్యాన్ని పొందేందుకు రైలు టికెట్ ఉంటే సరిపోతుంది. సో ఇకపై మీరు రైలు ప్రయాణం చేసే సమయంలో ఈ సేవలు పొందేందుకు ప్రయత్నించండి.
Read Also:పెళ్లి కొడుకు ఎక్కిన రైలు లేటు.. వెంటనే రైల్వే అధికారులు ఏం చేశారో తెలుసా? మీరు ఊహించలేరు!