E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Neethu : నీతూ ఇన్ని రోజులు ఏమైంది..? అసలు మ్యాటర్ ఇదేనా..?

Gundeninda Gudigantalu Neethu : నీతూ ఇన్ని రోజులు ఏమైంది..? అసలు మ్యాటర్ ఇదేనా..?
Advertisement

Gundeninda Gudigantalu Neethu : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలు సీరియల్ కూడా ఒకటి. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది. ఇటీవల కాలంలో ఈ సీరియల్ లోకి కొత్త యాక్టర్స్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో జనాలు సీరియల్ చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతిరోజు ప్రసారమవుతున్న ఈ సీరియల్ డిఫరెంట్ స్టోరీ తో ఆకట్టుకుంటూ వస్తుంది. ఇందులో కొత్తగా వచ్చిన క్యారెక్టర్లలో నీతూ క్యారెక్టర్ ఒకటి. బండోడు రవికి శృతికి మధ్య చిచ్చుపెట్టేలా ఈ క్యారెక్టర్ ని డిజైన్ చేశారు డైరెక్టర్. అయితే ఈమె వల్ల శృతిరవిల మధ్య మనస్పర్ధలు వచ్చిన విషయం కూడా తెలిసిందే. గత కొన్ని రోజులుగా నీతూ సీరియల్లో కనిపించలేదు అన్న విషయం చెప్పనక్కర్లేదు. ఈ మ్యాచ్ చేసేది తక్కువ నిడివి అయినా కూడా అప్పుడప్పుడు కనిపించేది కానీ గత కొద్ది రోజులుగా ఈ క్యారెక్టర్ ఎక్కడ కనిపించలేదు. అసలు ఎందుకు నీతును తీసేసారు.? నీతు వల్ల ఏదైనా సమస్య వచ్చిందా? ఇటీవల కాలంలో ఈమె ఎక్కువగా కనిపించకపోవడానికి అసలు కారణం ఏంటి అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

నీతూ క్యారక్టర్ అందుకే కనిపించలేదా..?

గుండెనిండా గుడిగంటలు నీతూ క్యారెక్టర్ సీరియల్ కి హైలైట్ నిలిచిన విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో ఈ అమ్మడు పెద్దగా సీరియల్స్ లో కనిపించకపోవడంతో సీరియల్ కి గుడ్ బై చెప్పేస్తుందా అన్న అభిప్రాయానికి అభిమానులు వచ్చేసారు. గత కొన్ని రోజుల క్రితం ప్రతి ఒక్క సీన్లో కూడా ఈమె కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఎన్ని రోజుల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం పై అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. అయితే ఈ క్యారెక్టర్ ఇప్పటి వరకు కనిపించకపోవడానికి కారణం వేరే సీరియల్ లో మంచి అవకాశం రావడం అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే నెట్టింట హాట్ చర్చగా మారింది. మరోవైపు ఈమెకు పెళ్లి ఫిక్స్ అయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఈ అమ్మడు రియాక్ట్ అయ్యే వరకు ఈ రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి.

యామిని రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Advertisement

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో నీతో క్యారెక్టర్ లో నటిస్తున్న అమ్మాయి పేరు యామిని. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ ముద్దుగుమ్మ అనేక సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికే ఎన్నో సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.. ఈమె నటించిన సీరియస్లలో సత్యభామ సీరియల్ జనాలను బాగా ఆకట్టుకుంది. రౌడీ పిల్ల పాత్రలో నటించి అందరిని మెప్పించింది. పేరుకు తెలుగు అమ్మాయి అయిన వేరే ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. సీరియల్స్ కన్నా ముందు యూట్యూబ్లో పలు వెబ్ సిరీస్ లలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్య సినిమాల్లో కూడా నటిస్తుందని ఓ వార్త సోషల్ మీడియాలో బాగా షికారు చేస్తుంది. మరి ఈ వార్తల పై ఈమె త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ అమ్మడు ఒక్క రోజుకు దాదాపుగా 35 వేలకు పై రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.. ఈ లెక్కన ఈమె నెలకు బాగానే సంపాదిస్తుంది..

Also Read :Podarillu Today Episode : శేఖర్ ను రెచ్చగొట్టిన చక్రీ.. పెద్దోడి పెళ్లికి గ్రీన్ సిగ్నల్.. చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్..

Related News

సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

దేబ్జానీ.. ముఖేష్ తో ప్రేమ నిజమేనా?

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. కానీ- ఉదయభాను

బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న చరణ్, చైత్ర.. వీడియో వైరల్!

పెద్దోడి డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. వీడియో వైరల్..

Nindu Noorella Saavasam Serial Today Episode September 16th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మలో ప్రవేశించనున్న ఆరు ఆత్మ..?  

Gundeninda GudiGantalu Today episode: సుమతి హెల్ఫ్ తో మీనా హ్యాపీ.. భర్తకు సేవలు చేసిన రోహిణి.. ప్రభా దెబ్బకు షాక్..

Big Stories

Advertisement
×