E-Paper
Advertisement

అబ్బో ఇవేం ఆఫర్లు బాబోయ్.. సేల్ కంటే ముందే 6 స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా డౌన్!

అబ్బో ఇవేం ఆఫర్లు బాబోయ్.. సేల్ కంటే ముందే 6 స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా డౌన్!
Advertisement

Flipkart Big Billion Days 2026: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్ కోసం ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ముందే గుడ్ న్యూస్ వచ్చేసింది. సేల్ అధికారికంగా ప్రారంభం కాకముందే ఫ్లిప్‌కార్ట్ ‘ఎర్లీ బర్డ్ డీల్స్’ పేరుతో 6 స్మార్ట్‌ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇందులో రూ.8,999కే లభించే బడ్జెట్ ఫోన్ నుంచి భారీ బ్యాటరీ, 144Hz డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో వచ్చే మోడల్స్ వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏయే ఫోన్ల మీద ఎంత ధర తగ్గింది? ఏ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో తెలుసుకుందాం.

బడ్జెట్ ఫోన్లు..

తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరుకునేవారికి Boltt Evo రూ.8,999కే లభిస్తోంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్, 6,000mAh బ్యాటరీ ఉన్నాయి. ఇక Oppo K14 Lite రూ.15,999 ధరతో వస్తోంది. ఈ ఫోన్‌లో 7,000mAh భారీ బ్యాటరీ ఉండటం ప్రధాన ఆకర్షణ.

మిడ్‌రేంజ్ ఫోన్లు..

Advertisement

మిడ్‌రేంజ్‌లో AI+ Nova 2 Ultra 5G రూ.18,999కే అందుబాటులో ఉంది. ఇందులో డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉంది. మరోవైపు
Infinix Note Edge రూ.23,999 ధరతో లభిస్తోంది. 1.5K అమోలెడ్ డిస్‌ప్లే దీని ప్రత్యేకతల్లో ఒకటి.

Also Read:

రియల్‌మీ డీల్స్..

Advertisement

Realme P4 5G రూ.29,999 ధరతో లభించనుంది. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఇక Realme P4s 5Gధర రూ.31,999గా ఉంది. ఈ ఫోన్‌లో 8,000mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు.

సేల్ ఎప్పటి నుంచి?

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 9న ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్లకు అక్టోబర్ 8 నుంచే ముందస్తు యాక్సెస్ ఉంటుంది. యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై ప్రత్యేక డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.

కొనేముందు చేయాల్సినవి..

ఎర్లీ బర్డ్ ధరలు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను బట్టి మారవచ్చు. ఆర్డర్ చేసే ముందు వర్తించే ఆఫర్లను తప్పకుండా పరిశీలించాలి. అలాగే స్టాక్ పరిమితంగా ఉండే అవకాశం ఉన్నందున నచ్చిన ఫోన్ అందుబాటులో ఉన్నప్పుడే కొనుగోలు చేయడం మంచిది.

Also Read:

Tags

Related News

రూ.3,000 బడ్జెట్‌లో వావ్ అనిపించే ANC ఇయర్‌బడ్స్.. సౌండ్ క్వాలిటీ, బ్యాటరీ నెక్ట్స్ లెవెల్!

కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలా? టాప్-5 డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు ఇవే!

జియో బంపర్ ఆఫర్.. ఈ ఒక్క రీఛార్జ్‌తో 200 రోజులు టెన్షన్ ఫ్రీ.. రూ.35,000 విలువైన ఏఐ టూల్స్ ఫ్రీ!

మీ ఫోన్ కెమెరా హ్యాకర్ల కంట్రోల్లోకి వెళ్లిందా? వెంటనే ఇలా కనిపెట్టండి.. లేదంటే డేంజరే!

వాక్యూమ్ క్లీనర్లపై 86% ఆఫర్..కొనడానికి ఇంతకంటే మంచి టైం ఉంటుందా?

రూ.1,059కే టైప్-సి ఛార్జింగ్ ఫోనా? పెద్దలకు అదిరిపోయే గిఫ్ట్.. ఐటెల్ కొత్త మోడల్ వచ్చేసింది!

యూట్యూబ్‌లో షాపింగ్ హంగామా.. ఇక వీడియోలు చూస్తూనే కొనేయొచ్చు, క్రియేటర్లకు కొత్త ఆదాయ అవకాశాలు!

Big Stories

Advertisement
×