E-Paper
Advertisement

మేo ఉనట్టా? లేనట్లా?.. సర్కార్ సస్పెన్స్‌తో మాజీ చైర్మన్ల మైండ్ బ్లాక్!

మేo ఉనట్టా? లేనట్లా?.. సర్కార్ సస్పెన్స్‌తో మాజీ చైర్మన్ల మైండ్ బ్లాక్!
Advertisement

Corporation Chairmen: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్ల పరిస్థితి ఇప్పుడు ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్య’లా మారింది. తమ పదవీకాలం ముగిసినా .. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదనిఊగిసలాడుతున్నారు .తమ భవిష్యత్తుపై స్పష్టత లేక తీవ్ర మానసిక మథనానికి గురవుతున్నారు. ఒకవైపు పదవీకాలాన్ని పొడిగిస్తూ రెన్యువల్ ఉత్తర్వులు రాకపోవడం, మరోవైపు ప్రభుత్వ పెద్దల నుంచి అస్పష్ట సూచనలు రావడం వారిని త్రిశంకుస్వర్గంలో పడేసింది.పదవీకాలం ముగిసిన కార్పొరేషన్ చైర్మన్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక జీవో ,రెన్యువల్ ఉత్తర్వులు గానీ ఇప్పటివరకు అందలేదు. కానీ”మీరేమీ ఆందోళన చెందవద్దు.. సాధారణంగా కార్యాలయాలకు వెళ్లి విధులు నిర్వహించండి” అంటూ సర్కార్ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు మాత్రమే వెళ్లినట్లు సమాచారం.

పదవిపై ఆశతో బాటలు..

Advertisement

అయితే, ప్రభుత్వ పరిపాలనలో మౌఖిక ఆదేశాలకు ఎటువంటి చట్టబద్ధత ఉండదన్న విషయం తెలిసినా, పార్టీ ఒత్తిడి , పదవిపై ఆశతో కొందరు చైర్మన్లు ఆఫీసుల బాట పడుతున్నారు. మరికొందరు మాత్రం జీవో లేకుండా కార్యాలయాలకు వెళ్లడం తీవ్ర అవమానకరమని భావించి ఇళ్లకే పరిమితమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ పేజ్ లో పదవులు పొందిన 37 మంది కార్పొరేషన్ చైర్మన్ ల పరిస్థితి అస్పష్టంగా మారింది.

‘లైట్’ తీసుకుంటున్న అధికారులు.. నిలిచిపోయిన ఫైళ్లు..

Advertisement

రెన్యువల్ ఆర్డర్లు లేకపోవడంతో సంబంధిత కార్పొరేషన్ల అధికారులు మాజీ చైర్మన్లను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. అధికారిక జీవో లేనిదే ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేమని,ఫైళ్లపై సంతకాలు పెట్టలేమని సీనియర్ ఐఏఎస్ అధికారులు, సీఈఓలు స్పష్టం చేస్తున్నారు.ఇక కొన్ని శాఖల్లోనీ ఆఫీసుకు వస్తున్న మాజీ చైర్మన్లకు కనీస గౌరవం ఇవ్వడానికి కూడా అధికారులువెనుకాడుతున్నారు. ప్రోటోకాల్ వర్తించకపోవడంతో వాహనాలు, సిబ్బందిని కూడా ఉపసంహరించుకునేఆలోచనలో శాఖలు ఉన్నాయి.ఈ గందరగోళం వల్ల వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు, నిధుల విడుదల పూర్తిగా నిలిచిపోయాయి.

ఫస్ట్ ఫేజ్ కార్పొరేషన్ చైర్మన్ల భవిష్యత్తు ఏమిటి..?

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి విడతలో ఎంతో ఆశతో పదవులు పొందిన కార్పొరేషన్ల చైర్మన్ల పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కొత్తముఖాలకు అవకాశం ఇచ్చేందుకు గాను పాతనేతలను పక్కన పెడుతున్నారా? లేక రాజకీయ సమీకరణాల వల్ల నిర్ణయం ఆలస్యమవుతోందా? అన్నది తేలడం లేదు.పార్టీ కోసం కష్టపడి కార్పొరేషన్ పదవులు సాధించుకున్న నాయకులు, ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందోనని కలవరపడుతున్నారు.కార్యకర్తలకు సమాధానం చెప్పుకోలేక..: నియోజకవర్గాల నుంచి వచ్చే కార్యకర్తలకు, నాయకులకు పనులు చేయించలేక,తమ పదవికి విలువ లేదని చెప్పుకోలేక మాజీ చైర్మన్లు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.

 Also Read: కీసర ORR పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు

Tags

Related News

జ్ఞానేశ్వర్ కుమార్ లేకపోతే బీజేపీకి 200 సీట్లు కూడా రావు: సత్యం శ్రీరంగం ఫైర్

కీసర ORR పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు

రాహుల్ గాంధీ.. ఒకసారి మెంటల్ డాక్టర్‌ను కలవండి: కిషన్ రెడ్డి

రైలు వెళ్లాక టికెట్ ఇస్తే ఏం లాభం? ఓటరు లిస్ట్ సవరణపై ఉత్తమ్ సెటైర్లు

10 సార్లు ఓటేసిన నా ఓటే తీసేస్తారా? నిజామాబాద్ వేదికగా టీపీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్!

ప్రకాశం జిల్లాలో జంటహత్యల కలకలం.. భార్య, అత్తల గొంతు కోసిన కిరాతకుడు!

అర్ధరాత్రి గణేశ్ శోభాయాత్రలో ఘోర ప్రమాదం.. ఐదుగురికి తీవ్ర గాయాలు.. విగ్రహం ధ్వంసం!

Big Stories

Advertisement
×