E-Paper
Advertisement

తెగించిన‌ తెంబా బ‌వుమా…టాయిలెట్ కుండి ప‌గ‌ల‌గొట్టి మ‌రీ

తెగించిన‌ తెంబా బ‌వుమా…టాయిలెట్ కుండి ప‌గ‌ల‌గొట్టి మ‌రీ
Advertisement

Temba Bavuma Smashed Toilet Bowl:  దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా (South Africa vs Australia) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ (Australia tour of South Africa, 2026) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నేపథ్యంలో తొలి మ్యాచ్ సందర్భంగా 214 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై సూపర్ విక్టరీ అందుకుంది ఆస్ట్రేలియా. అయితే ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా కెప్టెన్ తెంబా బ‌వుమా ( Temba Bavuma) ఒకే ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. అయితే వికెట్ కోల్పోయిన నేపథ్యంలో డ్రెస్సింగ్ రూమ్ కు తెంబా బ‌వుమా ఆవేశంతో వెళ్ళాడు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న టాయిలెట్ కుండిని బ్యాట్ తో బద్దలు కొట్టినట్టు ఆస్ట్రేలియా మీడియాలో కథనాలు వస్తున్నాయి. కంగారుల చేతిలో ఓడిపోతున్నామని భయంతో తన కోపాన్ని టాయిలెట్ కుండిపై చూపించాడని కథనాలు ప్రచురణ అయ్యాయి. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

టాయిలెట్ కుండీని బద్దలు కొట్టిన తెంబా బ‌వుమా

ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా (South Africa vs Australia) మధ్య నిన్నటి వరకు డ‌ర్బన్ వేదికగా తొలి టెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బ‌వుమా…. మాట్ రెన్షా బౌలింగ్ లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఒకే పరుగు చేసి ఔట్ అయ్యానన్న కోపంతో తెంబా బ‌వుమా…. డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న టాయిలెట్ కుండిని బద్దలు కొట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఆస్ట్రేలియాకు చెందిన కొన్ని మీడియా పత్రికలు ప్రచురించాయి. తమ చేతిలో ఓడిపోతున్నామన్న భయంతో తెంబా బ‌వుమా తెగించాడని… అలాంటి వాళ్లపై ఐసీసీ చర్యలు తీసుకోవాలని కూడా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

తెంబా బ‌వుమాకు తొలి ఓట‌మి

డ‌ర్బ‌న్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో ఆస్ట్రేలియా చేతిలో సఫారీలు చిత్తుగా ఓడిపోయారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బ‌వుమాకు తొలి ఓటమి ఎదురైంది. అతని కెరీర్ లో ఇప్పటి వరకు 13 టెస్టులకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇందులో 11 విజయాలు నమోదు అయ్యాయి. ఒకే ఒక మ్యాచ్ డ్రా అయింది. అయితే ఆస్ట్రేలియా చేతిలో నిన్న తొలి ఓటమిని చవి చూశాడు తెంబా బ‌వుమా. 148 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓటమి లేకుండా అత్యంత వేగంగా 10 టెస్టు విజయాలను అందుకున్న ఏకైక కెప్టెన్ గా గతంలో తెంబా బ‌వుమా పేరిట రికార్డు ఉంది. అయితే ఇప్పుడు ఓటమి ఎదురు కావడంతో తెంబా బ‌వుమా కాస్త డీలా పడిపోయాడు.

Advertisement

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

Related News

కొంచెం ఉప్పు త‌క్కువైనా ధోని క్లాస్ పీకుతాడు..కానీ !

బుమ్రా మాకు రంకు మొగుడిలా త‌యార‌య్యాడు…అందుకే పాకిస్తాన్ గెల‌వ‌డం లేదు

ఒరేయ్ పొట్టోడా? పాట్ కమ్మిన్స్‌ను గెలకకు…టాప్ లేచిపోతుంది

ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

నీతులు చెబుతారు కానీ, పాకిస్తాన్ వెధవలందరూ డ్ర‌గ్స్ తీసుకుంటారు!

రాజ‌కీయ నాయ‌కుడిలా టీమిండియాపై గంభీర్ పెత్త‌నం చేలాయిస్తున్నాడు !

ఆ ఒక్క‌డు లేక‌పోతే, జింబాబ్వే చేతిలోనూ టీమిండియా ఘోరంగా ఓడిపోతుంది

Big Stories

Advertisement
×