Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా మోటరోలా తమ స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. రూ.13,999 బడ్జెట్ ఫోన్ నుంచి రూ.50,000కు పైగా ఉన్న ప్రీమియం మోడల్స్ వరకు మొత్తం ఏడు ఫోన్లు ఈ సేల్‌లో అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉండటంతో అర్హత ఉన్న కొనుగోలుదారులు మరింత తక్కువ ధరకే ఫోన్లను సొంతం చేసుకోవచ్చు.
తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునేవారికి మోటో జి06 పవర్, మోటో జి37 పవర్ మోడల్స్ ఉన్నాయి. మోటో జి06 పవర్ ధర రూ.13,999. ఇందులో 7,000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే ఉన్నాయి. మోటో జి37 పవర్ 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999 నుంచి ప్రారంభమవుతుంది. 8GB RAM, 128GB వేరియంట్ ధర రూ.24,999. ఇందులో 50MP కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్ లభిస్తాయి.
Also Read: డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!
మంచి కెమెరా, పనితీరు కోరుకునేవారికి ఎడ్జ్ 70 ఫ్యూజన్, ఎడ్జ్ 70 ప్రో మోడల్స్ ఉన్నాయి. ఎడ్జ్ 70 ఫ్యూజన్ ధర రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 50MP సోనీ కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. ఎడ్జ్ 70 ప్రో 8GB RAM వేరియంట్ రూ.36,999 కాగా.. 12GB RAM మోడల్ రూ.39,999. ఈ ఫోన్‌లో ముందు, వెనుక 50MP కెమెరాలు ఉన్నాయి.
ఫోటోగ్రఫీపై ఎక్కువ ఆసక్తి ఉన్నవారికి ఎడ్జ్ 70 ప్రో ప్లస్ ప్రత్యేకంగా నిలుస్తుంది. 12GB RAM, 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.44,999. ఇందులో 3.5x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ కెమెరా, 90W వైర్డ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ ఉన్నాయి. ఇక మోటరోలా సిగ్నేచర్ ధర రూ.57,499 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 8K వీడియో రికార్డింగ్, 100x జూమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎడ్జ్ 70 మ్యాక్స్ ధర రూ.51,999 నుంచి మొదలవుతుంది. బ్యాంక్, ఎక్స్చేంజ్ ఆఫర్లను బట్టి తుది ధర మరింత తగ్గే అవకాశం ఉంది.
Also Read: ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?