How to reset net banking password: ఈ రోజుల్లో క్యాష్ క్యారీ చేసే రోజులు పోయాయి. ప్రతి ఒక్కరూ డిజిటల్ ట్రాక్సాక్షన్ కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ యాప్‌లను గుడ్డిగా నమ్ముతున్నారు. అయితే తరచూ.. వాడకపోవడం వల్ల కొన్నిసార్లు నెట్ బ్యాంకింగ్ లాగిన్ పాస్ వర్డ్ మర్చిపోతుంటాం. దీంతో.. మనీ ట్రాన్స్‌ఫర్ చేయడం లేదా ఆన్‌లైన్ పేమెంట్లు చేయడం.. ఆగిపోయి టెన్షన్ పెరుగుతుంది. అయితే.. దీని కోసం మీరు టెన్షన్ పడుతూ.. బ్రాంచ్‌కి పరిగెత్తాల్సిన అసలు అవసరమే లేదు! మీ ఫోన్ ద్వారానే.. ఈజీగా కొత్త పాస్‌వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం.
ప్రస్తుత ఫాస్ట్ ఫార్వర్డ్ డిజిటల్ యుగంలో .. బ్యాంక్ బ్రాంచ్ క్యూ లైన్లలో నిలబడకుండా.. ఇంట్లో బెడ్‌పై కూర్చుని అన్ని రకాల ట్రాన్సాక్షపన్స్ చక్కబెట్టుకోవడానికి నెట్ బ్యాంకింగ్ ఎంతో హెల్ప్ చేస్తుంది. కానీ.. కొన్నిసార్లు చాలా కాలం పాటు పాస్‌వర్డ్ ఎంటర్ చేయకపోవడం వల్ల.. అది పూర్తిగా స్కిప్ అయిపోతుంది. లాగిన్ అయ్యేటప్పుడు వరుసగా తప్పు పాస్‌వర్డ్స్ కొట్టారంటే.. మీ అకౌంట్ తాత్కాలికంగా లాక్ అయ్యే రిస్క్ కూడా ఉంది.
ఒకవేళ మీరు మీ నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ మర్చిపోయి కంగారు పడుతున్నట్లయితే.. అస్సలు టెన్షన్ పడకండి! దేశంలోని.. ఏ బ్యాంక్ ఖాతా అయినప్పటికీ, ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో మీ పాస్ వర్డ్‌ను ఎలా రీసెట్ చేసుకోవాలో.. ఇక్కడ ఉన్న సింపుల్ స్టెప్స్ ద్వారా తెలుసుకుందాం.
మొదట మీ స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్ టాప్‌లో మీ బ్యాంక్ (ఉదాహరణకు: ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ మొదలైనవి) అధికారిక నెట్ బ్యాంకింగ్ లాగిన్ పేజీకి వెళ్లండి. అక్కడ కనిపించే.. ‘Login’ బటన్‌పై క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీకి రీడైరెక్ట్ అవుతారు.
లాగిన్ పేజీలో యూజర్ నేమ్ కింద చిన్న అక్షరాలతో ‘Forgot Password / Forgot Login Password’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై మీ వేలితో లేదా మౌస్‌తో క్లిక్ చేయాలి. కొన్ని బ్యాంకింగ్ యాప్స్‌లో దీన్ని ‘Trouble Logging In?’ అని కూడా ట్యాగ్ చేసి ఉంటారు.
ఆ తర్వాత స్క్రీన్‌పై ఒక కొత్త రికవరీ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ బ్యాంక్ యూజర్ ఐడీ, అకౌంట్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, దేశం , మీ పుట్టిన తేదీ వంటి కొన్ని ప్రాథమిక వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా ఫిల్ చేయాలి. కొన్ని బ్యాంకులు మీ పాన్ కార్డ్ నంబర్ లేదా క్యాప్చా కోడ్‌ను కూడా ఎంటర్ చేయమని అడుగుతాయి.
Also Read: ఫ్రిజ్ దగ్గర గ్యాస్ సిలిండర్ ఉందా? వెంటనే ఈ తప్పు సరిదిద్దుకోండి!
మీరు ఎంటర్ చేసిన వివరాలు.. పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయితే.. మీ బ్యాంకు అకౌంట్ లింక్ అయి ఉన్న యాక్టివ్ మొబైల్ నంబర్‌కు ఒక వన్-టైమ్ పాస్‌వర్డ్ టెక్స్ట్ మెసేజ్‌లా వస్తుంది. ఆ ఓటీపీ నంబర్‌ను స్క్రీన్‌పై ఉన్న బాక్స్‌లో ఎంటర్ చేసి ‘Submit’ లేదా ‘Confirm’ బటన్‌పై ట్యాప్ చేయాలి.
వెరిఫికేషన్ సక్సెస్ అయిన తర్వాత.. కొత్త పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకునే.. ఆప్షన్ మీ ముందుకు వస్తుంది. ఇక్కడ మీరు ఎవరికీ అంతు చిక్కని ఒక స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవాలి. పాస్ వర్డ్‌లో కనీసం.. ఒక క్యాపిటల్ లెటర్ (A-Z), ఒక స్మాల్ లెటర్ (a-z), ఒక నంబర్ (0-9), ఒక స్పెషల్ క్యారెక్టర్ (ఉదాహరణకు: @, #, $) కచ్చితంగా ఉండేలా చూసుకోండి. అదే పాస్ వర్డ్‌ను మరో సారి కన్ఫర్మ్ బాక్స్‌లో.. టైప్ చేసి సబ్మిట్ చేయండి.దీంతో మీ కొత్త నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ సక్సెస్‌ఫుల్‌గా జనరేట్ అయిపోయినట్లే.