E-Paper
Advertisement

సెప్టెంబర్ 4 నుంచి గూగుల్ అసిస్టెంట్ బంద్.. ఇకపై అంతా Gemini మయం!

సెప్టెంబర్ 4 నుంచి గూగుల్ అసిస్టెంట్ బంద్.. ఇకపై అంతా Gemini మయం!
Advertisement

Google Assistant: సాధారణంగా మన స్మార్ట్‌ఫోన్‌లో ‘ఓకే గూగుల్’ అని పిలవగానే క్షణాల్లో స్పందించే గూగుల్ అసిస్టెంట్ ఇక చరిత్ర పుటల్లోకి వెళ్లబోతోంది. అవును.. ఇన్నాళ్లూ మన చిన్న చిన్న పనులన్నింటినీ చక్కబెట్టిన ఆ పరిచితమైన గొంతు త్వరలోనే శాశ్వతంగా మూగబోనుంది. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి గూగుల్ అసిస్టెంట్‌కు శుభం కార్డు వేస్తూ గూగుల్ అత్యంత సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.

అయితే ఇక్కడో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది.. ఆ స్థానంలోకి మన ఊహకందని తెలివితేటలతో, మనుషులతో మాట్లాడినట్లే మాట్లాడే ‘జెమిని’ అనే ఒక పవర్‌ఫుల్ AI అసిస్టెంట్ రాబోతోంది. అసలు గూగుల్ హఠాత్తుగా ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఈ మార్పుతో మన ఫోన్‌లో ఏమేం మారిపోబోతున్నాయో తెలుసుకుంటే నిజంగా షాక్ అవుతారు.

విడతలవారీగా మార్పులు:

Advertisement

సెప్టెంబర్ 4 నుంచి ఈ సేవలు ఆగిపోతాయని ప్రకటించినప్పటికీ.. అందరి ఫోన్లలో ఒకేసారి మారవు. గూగుల్ దీనిని విడతలవారీగా అందుబాటులోకి తెస్తోంది. కాబట్టి మన ఫోన్ మోడల్, మనం ఉండే ప్రాంతాన్ని బట్టి ఈ మార్పు జరగడానికి కొన్ని వారాల సమయం పట్టవచ్చు. ఇప్పటికే Geminiని వాడుతున్న వారికి ఈ మార్పు పెద్దగా తేడా అనిపించకపోవచ్చు.

Also Read: రూ.1.66 లక్షల HP గేమింగ్ ల్యాప్‌టాప్‌ను.. అమెజాన్ సేల్‌లో రూ.99 వేలకే ఇచ్చేస్తున్నారు!

Gemini వల్ల మనకేంటి ప్రయోజనం?

Advertisement

2016 నుంచి మనకు సేవలు అందిస్తున్న గూగుల్ అసిస్టెంట్ కంటే జెమిని చాలా తెలివైంది. మన స్క్రీన్ మీద ఏముందో చూసి దానికి తగినట్లుగా సమాధానాలు చెప్పగలదు. పెద్ద పెద్ద ప్రశ్నలను కూడా సులువుగా అర్థం చేసుకుని, సహజంగా సంభాషిస్తుంది. అలారాలు పెట్టడం, మెసేజ్‌లు పంపడం, పాటలు ప్లే చేయడం వంటి పనులన్నీ ఇది మరింత సులువుగా చేస్తుంది.

వాచ్‌లు, హెడ్‌ఫోన్లలోనూ ఇదే హవా:

ఈ మార్పు కేవలం స్మార్ట్‌ఫోన్లకే పరిమితం కాలేదు. మన ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్లు, ఆటో డ్రైవింగ్ సిస్టమ్‌లలోకి కూడా జెమిని రాబోతోంది. కార్లలో ప్రయాణించేటప్పుడు నావిగేషన్, కాల్స్, మ్యూజిక్ వంటి వాటిని జెమిని ద్వారా చాలా సులభంగా కంట్రోల్ చేయవచ్చు. గూగుల్ తమ స్మార్ట్ హోమ్ ఉత్పత్తులలోకి కూడా దీనిని తీసుకొస్తోంది.

ఈ పరికరాలకు మినహాయింపు:

అన్ని పరికరాల్లోనూ ఇప్పుడే గూగుల్ అసిస్టెంట్ పోదు. ఆండ్రాయిడ్ టీవీలు, సెట్‌టాప్ బాక్స్‌లు, కొన్ని ప్రత్యేక వాహనాల్లో ప్రస్తుతానికి కొనసాగుతుంది. అలాగే పాత మోడల్ ఫోన్లు, జెమిని సపోర్ట్ లేని ప్రాంతాలలో ఉన్న యూజర్లు కూడా మరికొంత కాలం పాత అసిస్టెంట్‌నే వాడుకోవచ్చు. మొత్తానికి మన దైనందిన పనులను మరింత వేగంగా, తేలికగా మార్చేందుకు గూగుల్ ఈ కొత్త అసిస్టెంట్‌ను మన ముందుకు తెస్తోంది.

Also Read: యూట్యూబ్ మోనిటైజేషన్ నిబంధనలు మార్పు.. కొత్త క్రియేటర్లకు మరిన్ని సవాళ్లు!

Tags

Related News

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

వాషింగ్ మెషీన్ వాడుతున్నారా? మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే!

Big Stories

Advertisement
×