E-Paper
Advertisement

యూట్యూబ్ మోనిటైజేషన్ నిబంధనలు మార్పు.. కొత్త క్రియేటర్లకు మరిన్ని సవాళ్లు!

యూట్యూబ్ మోనిటైజేషన్ నిబంధనలు మార్పు.. కొత్త క్రియేటర్లకు మరిన్ని సవాళ్లు!
Advertisement

YouTube Monetization: పాపులర్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ తమ మోనిటైజేషన్ నిబంధనల్లో కీలక మార్పులు ప్రకటించింది. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP) అర్హత ప్రమాణాలను పెంచుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. యాడ్స్, యూట్యూబ్ ప్రీమియం ద్వారా ఆదాయం పొందాలనుకునే కొత్త క్రియేటర్లకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. రాబోయే 2027 ఫిబ్రవరి 1 నుంచి ఈ మార్పులు అమలులోకి రానున్నాయి.

వారికి మారనున్న అర్హత ప్రమాణాలు:

ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం 1,000 సబ్‌స్క్రైబర్లతో పాటు 4,000 వాచ్ అవర్స్ ఉంటే మోనిటైజేషన్ వచ్చేది. అయితే 2027 ఫిబ్రవరి నుంచి కొత్తగా చేరేవారు ఏడాది కాలంలో కనీసం 8,000 గంటల వాచ్ టైమ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదా 90 రోజుల్లో 20 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ సాధించాల్సి ఉంటుంది.

Advertisement

అయితే యూట్యూబ్‌లో ఇప్పటికే సంపాదిస్తున్న పాత క్రియేటర్లకు ఈ పెంపుతో ఎలాంటి ఇబ్బంది ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. అభిమానుల ద్వారా లభించే ఫ్యాన్ ఫండింగ్, షాపింగ్ ప్రాడక్ట్స్ నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదు.

Also Read: ఈ చిన్న లక్షణం కనిపిస్తే జాగ్రత్త.. 40 దాటాక మీ కళ్లు మీకు ఇస్తున్న వార్నింగ్ కావచ్చు!

షార్ట్స్ వ్యూస్‌పై కూడా ప్రత్యేక నిబంధన:

Advertisement

యూట్యూబ్ షార్ట్స్ ద్వారా వచ్చే రాబడి పంచే విధానంలో కూడా యాజమాన్యం మార్పులు చేసింది. పాత క్రియేటర్లు కూడా షార్ట్స్ ద్వారా నిరంతరం ఆదాయం పొందాలంటే గత 90 రోజుల్లో కనీసం 10 మిలియన్ల వ్యూస్ సాధించాల్సి ఉంటుంది.

ఒకవేళ ఏ సమయంలోనైనా వ్యూస్ తగ్గితే, షార్ట్స్ రాబడి మాత్రమే ఆగుతుంది కానీ లాంగ్ వీడియోల ఆదాయానికి ఎలాంటి ఢోకా ఉండదు. మళ్లీ ఆ వ్యూస్ మైలురాయి దాటగానే షార్ట్స్ ఆదాయం యథావిధిగా ప్రారంభమవుతుంది.

క్రియేటర్ల కోసం అదనపు ప్రోత్సాహకాలు:

క్రియేటర్ల సంపాదనను మరింత పెంచేందుకు యూట్యూబ్ కొత్త బోనస్ ప్రోగ్రామ్‌లను తీసుకురాబోతోంది. షార్ట్స్ వ్యూస్ తగ్గినా కూడా బ్రాండ్ డీల్స్, షాపింగ్ ఆధారిత బోనస్‌లు, కొత్త ట్రెండ్స్ క్రియేట్ చేయడం ద్వారా అదనంగా సంపాదించే అవకాశాలను అందించనుంది.

దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా తక్కువ ధరకే లభించే ‘ప్రీమియం లైట్’ సబ్‌స్క్రిప్షన్‌ను అన్ని దేశాలకూ విస్తరిస్తోంది. దీనివల్ల కూడా క్రియేటర్ల ఆదాయం పెరుగుతుందని యూట్యూబ్ ఆశిస్తోంది. సోషల్ మీడియా పోటీ వాతావరణంలో ప్రతిభ కలిగిన వారిని ఆకట్టుకోవడానికే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: రూ.41,000 తగ్గింపు గురూ.. Amazon Freedom Saleలో మునుపెన్నడూ చూడని షాకింగ్ ఆఫర్లు!

Tags

Related News

డెస్క్‌టాప్ vs ల్యాప్‌టాప్.. ఇంటి నుంచి వర్క్ చేయడానికి.. రెండింట్లో ఏది బెస్ట్?

నెట్ స్లోగా ఉందా? మీ ఏరియాలో 5G ఉందో లేదో ఇలా చెక్ చేయండి!

రూ.41,000 తగ్గింపు గురూ.. Amazon Freedom Saleలో మునుపెన్నడూ చూడని షాకింగ్ ఆఫర్లు!

ఏఐ టెక్నాలజీతో హైయర్ సరికొత్త వాషింగ్ మెషీన్.. బట్టలపై నూనె, టీ మరకలు క్షణాల్లో మాయం!

పాత ఫోన్ మార్చేయడానికి ఇదే సరైన టైమ్.. అమెజాన్ ఫ్రీడమ్ సేల్ టాప్ 5G డీల్స్!

రూ.1.66 లక్షల HP గేమింగ్ ల్యాప్‌టాప్‌ను.. అమెజాన్ సేల్‌లో రూ.99 వేలకే ఇచ్చేస్తున్నారు!

రూ.8,500 లోపు అదిరిపోయే లావా కొత్త ఫోన్.. ఫ్రీ డోర్‌స్టెప్ సర్వీస్, మిలిటరీ బిల్డ్ బాడీ!

Big Stories

Advertisement
×