E-Paper
Advertisement

Google Cloud Outage: ఢిల్లీ డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం.. భారత్‌‌లో క్లౌడ్ సేవలకు అంతరాయం

Google Cloud Outage: ఢిల్లీ డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం.. భారత్‌‌లో క్లౌడ్ సేవలకు అంతరాయం
Advertisement

Google Cloud Outage:  రాజధాని ఢిల్లీలో ఓ డేటా సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫలితంగా దేశంలోని ప్రధాన నగరాల్లో గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. సేవలను కొనసాగించడానికి ఆ కంపెనీ ప్రభావిత ప్రాంతం నుండి ట్రాఫిక్‌ను మళ్లించింది. ఈ మార్పుల వల్ల మెట్రో నగరాలు, ప్రాంతీయ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లపై అదనపు ఒత్తిడిని పెరిగింది.

ఢిల్లీ డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం

Advertisement

ఢిల్లీలో ఓ డేటా సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన కారణంగా దేశవ్యాప్తంగా గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను గూగుల్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. డేటా సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడి నెట్‌వర్క్ పరికరాలకు విద్యుత్ సరఫరాను అత్యవసరంగా నిలిపి వేశారు.

ఫలితంగా ఢిల్లీలోని లోకల్ పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ పూర్తిగా ఐసోలేట్ అయ్యింది. కేవలం ఢిల్లీ, ముంబై, చెన్నై, ఇతర ప్రధాన నగరాల్లో గూగుల్ క్లౌడ్ ఆధారిత సేవలు నిలిచిపోయాయి. దీనివల్ల ఐటీ కంపెనీలు, డిజిటల్ సర్వీసు వినియోగదారులకు సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నారు.

Advertisement

భారత్‌‌లోని ప్రధాన నగరాల్లో క్లౌడ్ సేవలకు అంతరాయం

గూగుల్ క్లౌడ్ టీమ్ ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించి సేవలు పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమైంది. అగ్నిప్రమాదం ఎప్పుడు సంభవించిందో, ఎంత నష్టం అనే వివరాలను గూగుల్ క్లౌడ్ వెల్లడించలేదు. పునరుద్ధరణ పనులు కొనసాగడంతో ప్రత్యామ్నాయ మార్గం ఏదీ లేదని తెలిపింది.

ప్రభావాన్ని పరిమితం చేయడానికి అదనపు ట్రాఫిక్ నివారణ చర్యలను అన్వేషిస్తున్నామని వెల్లడించింది. అంతరాయం కారణంగా వ్యాపారాలు, వినియోగదారులు ఉపయోగించే యాప్‌లు, వెబ్‌సైట్‌లు, కంపెనీ అంతర్గత వ్యవస్థలపై నెమ్మదిగా ప్రభావం చూపుతోంది.

ALSO READ: జియో బంపరాఫర్.. రూ.448 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ.. మరెన్నో బెనిఫిట్స్!

ప్రపంచంలోని అతిపెద్ద క్లౌడ్ ప్రొవైడర్లలో గూగుల్ క్లౌడ్ ఒకటి. అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్‌లతో పోటీ పడుతుంటాయి. డేటా వాల్యూమ్‌లను ప్రాసెస్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నాయి కంపెనీలు.

Related News

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Big Stories

Advertisement
×