E-Paper
Advertisement

సూపర్ రేంజ్, అదిరిపోయే ఫీచర్లు.. ఆంపియర్ మాగ్నస్ జి మ్యాక్స్ కొత్త వెర్షన్ వచ్చేసింది!

సూపర్ రేంజ్, అదిరిపోయే ఫీచర్లు.. ఆంపియర్ మాగ్నస్ జి మ్యాక్స్ కొత్త వెర్షన్ వచ్చేసింది!
Advertisement

Ampere Magnus G Max 2026 Updated: ఎలక్ట్రిక్ స్కూటర్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్న సమయంలో ఆంపియర్ తన మాగ్నస్ జి మ్యాక్స్‌ ను మరింత అప్ డేటెడ్ ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త కనెక్టెడ్ ఫీచర్లు, పెద్ద డిస్‌ ప్లే, రైడింగ్‌ ను ఈజీగా మార్చే టెక్నాలజీతో ఈ స్కూటర్‌ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అప్‌ డేట్ చేసిన మాగ్నస్ జి మ్యాక్స్ ధర రూ.1.10 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

కొత్త సాఫ్ట్‌ వేర్‌తో మరిన్ని ఫీచర్లు

ఆంపియర్ కొత్తగా తీసుకొచ్చిన NxG.io సాఫ్ట్‌ వేర్ ప్లాట్‌ ఫామ్ ద్వారా మాగ్నస్ జి మ్యాక్స్‌ లో కీలక మార్పులు చేసింది. ఈ అప్‌డేట్‌తో స్కూటర్‌కు 30కి పైగా కనెక్టెడ్, IoT ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. స్కూటర్‌ లో ఇప్పుడు కొత్త 5 అంగుళాల డిస్‌ ప్లే ఉంది. ఇందులో టర్న్ బై టర్న్ నావిగేషన్ సదుపాయం కూడా ఉంటుంది. రోజువారీ ప్రయాణాల్లో కొత్త మార్గాలను ఈజీగా గుర్తించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్

Advertisement

అప్‌ డేట్‌ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఫీచర్లలో క్రూయిజ్ కంట్రోల్ ఒకటి. ఎక్కువ దూరం ప్రయాణించే సమయంలో నిరంతరం యాక్సిలరేటర్‌ ను ఉపయోగించాల్సిన అవసరాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. హిల్ హోల్డ్ అసిస్ట్‌ ను కూడా స్కూటర్‌ కు జోడించారు. వాలుగా ఉన్న రోడ్లపై స్కూటర్ ఆపినప్పుడు వెనక్కి వెళ్లిపోకుండా ఈ ఫీచర్ సాయపడుతుంది. ట్రాఫిక్‌ లో, ఎత్తైన ప్రాంతాల్లో రైడర్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

ఫోన్‌ తో స్కూటర్‌ ను గుర్తించొచ్చు

పార్కింగ్ చేసిన తర్వాత స్కూటర్ ఎక్కడ ఉందో మర్చిపోయే సందర్భాల్లో కూడా కొత్త ఫీచర్లు ఉపయోగపడతాయి. ఫోన్ యాప్ ద్వారా స్కూటర్‌ ను పింగ్ చేసి సులభంగా గుర్తించవచ్చు. దీంతో పెద్ద పార్కింగ్ ప్రాంతాల్లో స్కూటర్‌ ను వెతకడం ఈజీ అవుతుంది. ఇవే కాకుండా రియల్‌ టైమ్ ఛార్జింగ్ స్టేటస్, లైవ్ ట్రాకింగ్, జియోఫెన్సింగ్, దొంగతనం, టోయింగ్ అలర్ట్‌లు కూడా ఉన్నాయి. రిమోట్ డయాగ్నోస్టిక్స్, సర్వీస్ బుకింగ్, ఛార్జింగ్ హిస్టరీ, బ్యాటరీ హెల్త్ వివరాలు కూడా యాప్‌లో చూడొచ్చు.

OTA అప్‌ డేట్స్ కూడా

Advertisement

స్కూటర్ సాఫ్ట్‌ వేర్‌ ను భవిష్యత్తులో మరింత మెరుగుపరిచేందుకు OTA అప్‌ డేట్ సదుపాయం ఇచ్చారు. అంటే సర్వీస్ సెంటర్‌ కు వెళ్లకుండానే కొన్ని సాఫ్ట్‌ వేర్ అప్‌ డేట్స్ పొందే అవకాశం ఉంటుంది. ఈ కనెక్టెడ్ ఫీచర్లన్నీ ఆంపియర్ కనెక్ట్ యాప్ ద్వారా ఉపయోగించుకోవచ్చు.

బ్యాటరీ, రేంజ్ గురించి..

మాగ్నస్ జి మ్యాక్స్‌ లో మెకానికల్‌గా మాత్రం ఎలాంటి పెద్ద మార్పులు చేయలేదు. ఇందులో 3kWh LFP బ్యాటరీని ఉపయోగించారు. దీనికి 2.4kW పీక్ పవర్ అందించే హబ్ మౌంటెడ్ మోటార్‌ ను యాడ్ చేశారు. ఈ స్కూటర్ 142 కిలోమీటర్ల IDC రేంజ్‌ ను అందిస్తుంది. గరిష్ట వేగం గంటకు 65 కిలోమీటర్లు. బ్యాటరీకి 5 సంవత్సరాలు లేదంటే 75,000 కిలోమీటర్ల వారంటీ అందిస్తున్నారు. బ్యాటరీ జీవితకాలం 2 లక్షల కిలోమీటర్ల వరకు ఉంటుందని కంపెనీ చెబుతోంది.

కొత్త కలర్ ఆప్షన్

మాగ్నస్ జి మ్యాక్స్‌ ను డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందిస్తున్నారు. ఇప్పటికే ఉన్న మాన్‌ సూన్ బ్లూ, మచ్చా గ్రీన్ రంగులతో పాటు కొత్తగా సిన్నమోన్ కాపర్ కలర్‌ను యాడ్ చేశారు.

Read Also: విన్ ఫాస్ట్ మ్యాక్సీ స్కూటర్ కు పేటెంట్.. స్టన్నింగ్ లుక్ తో మెస్మరైజ్!

Tags

Related News

30 కిలో మీటర్లకు మించి మైలేజ్.. త్వరలో రాబోతున్న 4 సూపర్ హైబ్రిడ్ SUVలు ఇవే!

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అక్టోబర్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న 11 క్రేజీ కార్లు ఇవే!

ట్రైబర్‌ కు ఇక టర్బో పవర్.. కొత్త వేరియంట్ అదిరింది భయ్యా!

కారుపై కనిపించే చిన్న ఫిన్.. దీని ఉపయోగాలేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఈ కార్లు ఒకప్పుడు భారత్‌లో తిరిగేవని తెలుసా? ఇప్పుడు రోడ్లపై కనిపిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రపంచంలోని ఐదు వింతైన బైక్‌లు.. వీటి డిజైన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

అక్టోబర్‌లో దుమ్మురేపనున్న కొత్త ఈవీలు.. స్కూటర్లు, బైక్స్ లిస్ట్ ఇదే!

కారుపై ఏకంగా 20 టన్నుల రాళ్లు.. టాటా ఏరిస్ బలం చూపించేందుకు మైండ్ బ్లోయింగ్ టెస్ట్!

Big Stories

Advertisement
×