BigTV English

Google Mind Game: గూగుల్ కంపెనీ మైండ్ గేమ్.. ఓపెన్ ఏఐకి పెద్ద ఎదురుదెబ్బ

Google Mind Game: గూగుల్ కంపెనీ మైండ్ గేమ్.. ఓపెన్ ఏఐకి పెద్ద ఎదురుదెబ్బ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సాఫ్ట్ వేర్ కంపెనీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఏఐలో తోపులు, తురుములు అనుకున్న వారికి వివిధ కంపెనీలు బంపర్ ఆఫర్లు ఇచ్చి గద్దల్లా తన్నుకెళ్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ కంపెనీలు స్టార్టప్ లపై కన్నేశాయి. అక్కడ టాలెంట్ ఉన్నవారిని గుర్తించి వారిపై భారీ ప్యాకేజీల వల వేస్తున్నాయి. ఆమధ్య గూగుల్, ఓపెన్ ఏఐ మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. ఓపెన్ ఏఐకి సంబంధించిన సీనియర్ ఫ్యాకల్టీని భారీ ప్యాకేజీలతో గూగుల్ తీసుకెళ్లింది. దీంతో కొన్నిరోజులపాటు ఓపెన్ ఏఐ షట్ డౌన్ కి పిలుపునివ్వడం విశేషం. దీనికి కొనసాగింపుగా గూగుల్, ఓపెన్ ఏఐ మధ్య మరో చిచ్చు అంటుకుంది. అయితే ఈ టెక్నో వార్ లో గూగుల్ పైచేయి సాధించడం విశేషం.


విండ్ సర్ఫ్ ని దెబ్బకొట్టిన గూగుల్..
ఇటీవల ఏఐ టెక్నాలజీలో విండ్ సర్ఫ్ కంపెనీ పేరు మారుమోగిపోతోంది. ఈ స్టార్టప్ కంపెనీ పెద్ద పెద్ద ఎంఎన్సీలకు సైతం షాకులిస్తోంది. విండ్ సర్ఫ్ తయారు చేసిన ఏఐ టూల్స్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అయితే దీన్ని హస్తగతం చేసుకోవాలని పెద్ద కంపెనీలు వలవేసి కూర్చున్నాయి. ఆ వలకు ఆ కంపెనీ చిక్కలేదు. ఇటీవల 3 బిలియన్ డాలర్ల భారీ ఆఫర్ ఇచ్చింది ఓపెన్ ఏఐ కంపెనీ. కానీ విండ్ సర్ఫ్ ఆ డీల్ కి ఒప్పుకోలేదు. అయితే అంతలోనే గూగుల్ మరో డేంజర్ గేమ్ మొదలు పెట్టింది. కంపెనీని కాకుండా, కంపెనీలో కీలకంగా ఉండే ఉద్యోగులకు వల వేసింది. ఇంకేముంది భారీ వేతనాలు అనే వలకు ఉద్యోగులు చిక్కారు. ఆ వల ఖరీదు 2.4 బిలియన్ డాలర్లు. దీంతో ఓపెన్ ఏఐ పాచిక పారలేదు. 3 బిలియన్ డాలర్లకు కంపెనీని కొనాలని భావించింది ఓపెన్ ఏఐ. కానీ 2.4 బిలియన్ డాలర్ల ప్యాకేజీ ఆఫర్ చేసి ఆ కంపెనీకి వెన్నెముకలా ఉన్న ఉద్యోగుల్ని తీసుకెళ్లిపోయింది గూగుల్. దీంతో సాఫ్ట్ వేర్ రంగంలో, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇదో పెద్ద సంచలనంగా మారింది. విండ్ సర్ఫ్ కంపెనీ CEO వరుణ్ మోహన్, సహ వ్యవస్థాపకుడు డగ్లస్ చెన్ సహా కీలకమైన ఉద్యోగులు గూగుల్ గూటికి చేరారు. వీరంతా గూగుల్ డీప్ మైండ్ ప్రాజెక్ట్ లో పనిచేస్తారు. ప్రస్తుతం జెమినై డెవలప్మెంట్ పై ఫోకస్ పెట్టిన గూగుల్.. తర్వాతి తరం ఏఐ టూల్ గా డీప్ మైండ్ ని అభివృద్ధి చేస్తోంది. దీనికోసమే విండ్ సర్ఫ్ నుంచి కీలకమైన ఉద్యోగుల్ని తీసుకొచ్చింది గూగుల్.

ఉద్యోగులకు వల..
2.4 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టినా, విండ్ సర్ఫ్ కంపెనీలో వాటాలు తీసుకోడానికి ఇష్టపడలేదు గూగుల్. కేవలం మేథో సంపత్తిని, అంటే ఉద్యోగుల్ని మాత్రమే తమవైపు తిప్పుకుంది. గూగుల్ వేసిన ఈ ప్లాన్ కి ఓపెన్ ఏఐకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది.


ఏఐ విభాగంలో నిపుణుల కొరత..
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయని చాలామంది ఫిర్యాదు చేస్తున్నా, ఆ ఏఐ టూల్స్ డెవలప్మెంట్ కోసం నిపుణులైన ఉద్యోగులు కావాల్సి ఉంది. కొత్త తరం ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో కాస్త వెనకబడింది. తక్కువమంది నిపుణులు వివిధ కంపెనీలు మారుతున్నారు. స్టార్టప్ లతో తమ సత్తా చాటిన ఉద్యోగుల్ని బడా కంపెనీలు లాగేసుకుంటున్నాయి. ఈ టెక్నోవార్ లో గూగుల్ ఇప్పుడు ఓపెన్ ఏఐపై పైచేయి సాధించినట్టయింది.

Related News

Expensive Phones: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లు.. వీటి ధర కోట్లలోనే

7000mAh Budget Phones: రూ 20000 లోపు ధరలో 7000mAh బ్యాటరీ ఫోన్లు.. మిడ్ రేంజ్‌లో బెస్ట్ ఇవే..

Galaxy S25 FE vs iPhone 16e: రెండు బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల మధ్య గట్టి పోటీ.. విన్నర్ ఎవరు?

Moto Book 60 Pro: మోటోరోలా కొత్త ల్యాప్‌టాప్.. ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్‌తో లాంచ్

iPhone 15 Pro Max: ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఫై భారీ తగ్గింపు.. ఏకంగా ₹45,000 డిస్కౌంట్

WhatsApp Tricks: వాట్సప్‌లో కొత్త ఫీచర్స్.. తెలుసుకోకపోతే చాలా మిస్సవుతారు !

Big Stories

×