E-Paper
Advertisement

షాకింగ్.. Google Pixel 10పై రూ.15 వేలకు పైగా తగ్గింపు.. ఈ ప్రైస్‌కి ఇప్పుడు కొనడం వర్తా?

షాకింగ్.. Google Pixel 10పై రూ.15 వేలకు పైగా తగ్గింపు.. ఈ ప్రైస్‌కి ఇప్పుడు కొనడం వర్తా?
Advertisement

Google Pixel 10 Price Drop: గూగుల్ పిక్సెల్ సిరీస్‌లో ఒక మంచి ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకొక మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ లాంచ్ అయినప్పటి నుంచి చాలా మందిని ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ఫోన్‌పై అమెజాన్‌లో ఏకంగా రూ.15,000 కంటే ఎక్కువ తగ్గింపు లభిస్తోంది. క్లీన్ సాఫ్ట్‌వేర్, అదిరిపోయే కెమెరాలను ఇష్టపడే వారికి ఈ ఫోన్ ఇప్పుడు మరింత తక్కువ ధరకే దొరుకుతోంది.

రూ.15 వేలకు పైగా తగ్గిన ధర:

భారతదేశంలో గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ ప్రారంభ ధర రూ.79,999గా ఉండేది. కానీ ప్రస్తుతం అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.64,649కే అందుబాటులో ఉంది. అంటే నేరుగా రూ.15,350 వరకు ధర తగ్గింది. దీనికి తోడు హెచ్‌ఎస్‌బీసీ క్రెడిట్ కార్డ్ వాడే వారికి అదనంగా రూ.3,000 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఒకేసారి అంత డబ్బు పెట్టలేని వారి కోసం నెలకు కేవలం రూ.2,273 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. అలాగే పాత ఫోన్ కండిషన్‌ను బట్టి రూ.39,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందే అవకాశం ఉంది.

Advertisement

Also Read: ఫోన్ వెనుక లైటింగ్ ఎఫెక్ట్స్.. 8000mAh బ్యాటరీ.. Tecno Pova 8 5G ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు!

మెప్పించే ఫీచర్లు, కెమెరా:

ఈ ఫోన్ గూగుల్ సొంత టెన్సార్ జీ5 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 12GB RAM, 256GB స్టోరేజ్ ఉన్నాయి. ఇక స్క్రీన్ విషయానికి వస్తే.. 6.3 ఇంచుల డిస్‌ప్లేతో పాటు 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ బ్రైట్‌నెస్ దీని సొంతం. ఇక కెమెరాల పరంగా చూస్తే.. వెనుక వైపు 48MP ప్రధాన కెమెరాతో పాటు 13MP అల్ట్రావైడ్, 10.8MP టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం 10.5MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 4,970 ఎంఏహెచ్ బ్యాటరీ, 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

కొన్ని చిన్న చిన్న లోపాలు:

Advertisement

ఈ ఫోన్‌లో కొన్ని చిన్న లోపాలు కూడా ఉన్నాయి. దీని ఛార్జింగ్ స్పీడ్ ఇతర పోటీ ఫోన్లతో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే గేమింగ్ పరంగా ఇది టాప్ పెర్ఫార్మెన్స్ ఇవ్వకపోవచ్చు. ఇందులో ఎల్‌టీపీఓ డిస్‌ప్లే లేకపోవడం కూడా ఒక మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు.

ఈ ఫోన్ కొనడం బెటరేనా?

అత్యుత్తమ కెమెరా, గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, ఎలాంటి యాడ్స్ లేని క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని కోరుకునే వారికి పిక్సెల్ 10 ఒక అద్భుతమైన ఎంపిక. భారీ గేమింగ్ అవసరం లేని వారికి, రోజువారీ పనుల కోసం ఒక ప్రీమియం ఫోన్ కావాలనుకునే వారికి ఈ ఆఫర్ చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై ఇలాంటి డిస్కౌంట్లు ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి.. ఆసక్తి ఉన్నవారు త్వరగా నిర్ణయం తీసుకోవడం మంచిది.

Also Read: iQOO షాకింగ్ నిర్ణయం.. భారీగా తగ్గిన ఫ్లాగ్‌షిప్ ఫోన్ల ధరలు.. ఎగబడుతున్న జనాలు!

Related News

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

Big Stories

Advertisement
×