Google Pixel Phones: గూగుల్ పిక్సెల్ ప్రియులకు గుడ్ న్యూస్. సరికొత్త ఫీచర్లతో Google Pixel 11 సిరీస్ మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. ఈ సిరీస్ ఫోన్లకు సంబంధించిన లీకులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాబోయే Pixel 11, Pixel 11 Pro మోడల్స్ ధర, ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూసేద్దాం రండి..
గూగుల్ సంస్థ పిక్సెల్ 11 సిరీస్‌ను ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో మొత్తం 4 మోడల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ధర విషయానికి వస్తే.. బేసిక్ మోడల్ అయిన పిక్సెల్ 11 ధర భారతదేశంలో రూ.79,990 నుండి రూ.84,999 వరకు ఉండవచ్చని అంచనా. ఇక ప్రీమియం ఫీచర్లతో వచ్చే పిక్సెల్ 11 ప్రో మోడల్ ప్రారంభ ధర దాదాపు రూ.1,03,999గా ఉండే అవకాశం ఉంది.
Also Read: రూ.20 వేల లోపే వన్‌ప్లస్ 5G మొబైల్.. మిలిటరీ గ్రేడ్ బాడీ, భారీ బ్యాటరీతో లాంచ్!
Pixel 11, Pixel 11 Pro రెండు ఫోన్లలోనూ 6.3 ఇంచుల ఓఎల్ఈడీ (OLED) స్క్రీన్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌తో పాటు, ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 3,100 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం గూగుల్ తన సరికొత్త ‘టెన్సర్ జి6’ (Tensor G6) చిప్‌సెట్‌ను ఈ ఫోన్లలో వాడనుంది. అలాగే, రోజంతా ఛార్జింగ్ బ్యాకప్ ఇచ్చేలా పిక్సెల్ 11 మోడల్‌లో 5,000mAh బ్యాటరీని అమర్చనున్నారు.
ఫొటోగ్రఫీ విషయంలో గూగుల్ ఫోన్లకు తిరుగుండదు. పిక్సెల్ 11 వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్ కెమెరా, 12MP టెలిఫోటో కెమెరాలను ఇచ్చే అవకాశం ఉంది. అలాగే సెల్ఫీల కోసం 12 లేదా 32MP ఫ్రంట్ కెమెరా ఉండొచ్చు. అదే సమయంలో.. Pro మోడల్‌లో కెమెరా మరింత అద్భుతంగా ఉండబోతోంది. దీనిలో 50MP మెయిన్ కెమెరాతో పాటు, 50MP అల్ట్రావైడ్, 48MP పెరిస్కోప్ లెన్స్‌ను అందించనున్నారు. ఇక సెల్ఫీల కోసం 42MP కెమెరా రానుంది.
అయితే.. ప్రస్తుతానికి ఇవన్నీ లీకుల ఆధారంగా తెలిసిన వివరాలు మాత్రమే. గూగుల్ అధికారికంగా ప్రకటించే వరకు మనం మరికొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే. ఏదేమైనా ఈసారి గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకోనుందని చెప్పొచ్చు.
Also Read: లగ్జరీ లుక్.. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు.. Samsung Flip Phoneపై అస్సలు మిస్ అవ్వకూడని క్రేజీ ఆఫర్!