E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

రూ.20 వేల లోపే వన్‌ప్లస్ 5G మొబైల్.. మిలిటరీ గ్రేడ్ బాడీ, భారీ బ్యాటరీతో లాంచ్!

రూ.20 వేల లోపే వన్‌ప్లస్ 5G మొబైల్.. మిలిటరీ గ్రేడ్ బాడీ, భారీ బ్యాటరీతో లాంచ్!
Advertisement

OnePlus N6 5G: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్.. భారత మార్కెట్లోకి మరో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. అదే ‘వన్ ప్లస్ N6 5G’. భారీ బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్.. తక్కువ బడ్జెట్‌లో మంచి 5G మొబైల్ కొనాలనుకునే వారికి మంచి ఆప్షన్ అనే చెప్పవచ్చు.

ఈ సరికొత్త వన్ ప్లస్ N6 5G స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉంటుంది. త్వరలో జరగబోయే ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’లో భాగంగా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ధరల విషయానికి వస్తే.. 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.22,999 కాగా, సేల్ ఆఫర్ కింద రూ.3,000 తగ్గింపుతో రూ.19,999కే లభిస్తుంది.

Advertisement

అలాగే 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 కాగా, ఆఫర్‌లో దీనిని రూ.21,999కే సొంతం చేసుకోవచ్చు. దీనికి తోడు సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్స్ వాడితే అదనపు డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. ఈ ఫోన్ మిడ్‌నైట్ గ్రీన్, ఫ్రెష్ మింట్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.

Also Read: లగ్జరీ లుక్.. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు.. Samsung Flip Phoneపై అస్సలు మిస్ అవ్వకూడని క్రేజీ ఆఫర్!

Advertisement

ఈ ఫోన్ 6.8 అంగుళాల పెద్ద HD+ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయడం వల్ల స్క్రీన్ వాడకం చాలా స్మూత్‌గా ఉంటుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. కేవలం 8.88 మిమీ మందం ఉండే ఈ ఫోన్‌కు మిలిటరీ గ్రేడ్ (MIL-STD-810H) సర్టిఫికేషన్ ఉంది. అంటే కిందపడినా.. చిన్న చిన్న దెబ్బలు తగిలినా ఫోన్ అంత సులువుగా పగలదు.

OnePlus N6 5G ఫోన్ ప్రత్యేకత ఏంటంటే.. దీనిలో ఏకంగా 8,000mAh బ్యాటరీని అందించారు. ఈ బడ్జెట్‌లో ఇంత పెద్ద బ్యాటరీ రావడం నిజంగా విశేషం. దీనివల్ల ఛార్జింగ్ గురించిన చింత లేకుండా ప్రశాంతంగా ఫోన్ వాడుకోవచ్చు. అలాగే ఫోన్ త్వరగా ఛార్జ్ అవ్వడానికి 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 16తో పనిచేస్తుంది. దీనికి తోడు కంపెనీ ఏకంగా ఏడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లను ఇస్తామని ప్రామిస్ చేసింది.

మెరుగైన పనితీరు కోసం ఈ మొబైల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. కెమెరాల విషయానికి వస్తే.. ఫోన్ వెనుక భాగంలో 10x డిజిటల్ జూమ్ సపోర్ట్ ఉన్న 50MP ప్రధాన కెమెరాతో పాటు పోర్ట్రెయిట్ షాట్స్ కోసం మరో సెకండరీ కెమెరాను ఇచ్చారు.

సెల్ఫీల కోసం ముందు భాగంలో 8MP కెమెరా ఉంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ 5G సిమ్ స్లాట్లు, వైఫై, బ్లూటూత్, యూఎస్‌బీ టైప్-సి వంటి అన్ని కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Also Read: భారీగా పడిపోయిన iPhone 17 సిరీస్ ధరలు.. ఇంత తక్కువకు అస్సలు ఊహించి ఉండరు!

Related News

లగ్జరీ లుక్.. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు.. Samsung Flip Phoneపై అస్సలు మిస్ అవ్వకూడని క్రేజీ ఆఫర్!

భారీగా పడిపోయిన iPhone 17 సిరీస్ ధరలు.. ఇంత తక్కువకు అస్సలు ఊహించి ఉండరు!

బయట వర్షం.. ఇంట్లో ఏసీ లీకేజీ.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!

ధరలు పెరుగుతున్న వేళ.. Lava Agni 4పై ఊహించని డిస్కౌంట్.. ఆఫర్ కొద్దిరోజులే!

సూర్యుడితో స్నేహం.. మొబైల్‌కు ప్రాణం.. అదరగొడుతున్న స్మార్ట్ బెంచీలు!

యాపిల్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. మార్కెట్లోకి ఫస్ట్ Foldable iPhone, డిజైన్ చూస్తే ఫ్లాట్ అయిపోతారు!

స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ షేక్.. ఏకంగా మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో వన్‌ప్లస్ N6 లాంచ్!

Big Stories

×