Google Pixel 11a: గూగుల్ పిక్సెల్ సిరీస్‌కు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా తక్కువ ధరలో మంచి కెమెరా, క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవం కోరుకునే వారిని a సిరీస్ ఫోన్లు ఆకట్టుకుంటున్నాయి. పిక్సెల్ 10a తర్వాత ఇప్పుడు గూగుల్ పిక్సెల్ 11aపై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఫోన్‌కు సంబంధించిన డిజైన్, స్పెసిఫికేషన్ల వివరాలు ఇప్పటికే లీక్ అవుతున్నాయి. దీంతో పిక్సెల్ 11aలో గూగుల్ ఎలాంటి మార్పులు తీసుకురానుందనే ఆసక్తి నెలకొంది.
తాజాగా బయటికొచ్చిన లీక్స్ ప్రకారం.. పిక్సెల్ 11a డిజైన్‌లో గూగుల్ పెద్దగా మార్పులేమీ చేయడం లేదు. పాత మోడల్స్‌లాగే ఫ్లాట్ రియర్ ప్యానెల్, పైన హారిజాంటల్ పిల్ షేప్ కెమెరా మాడ్యూల్ రానుంది. కాకపోతే ఈసారి కెమెరా మాడ్యూల్ పరిమాణం కాస్త పెద్దదిగా కనిపిస్తోంది. ఫోన్ ముందర భాగంలో కాస్త మందపాటి బెజెల్స్‌తో కూడిన ఫ్లాట్ డిస్ప్లే, పంచ్ హోల్ కెమెరా ఉంటాయి. సిల్వర్, పర్పుల్, గ్రే, బ్లాక్ రంగుల్లో ఇది లభ్యమయ్యే అవకాశం ఉంది.
Also Read: మోటో, ఒప్పో, ఐఫోన్ లవర్స్‌కి పండగే పండగ.. ఏ ఫోన్ ఎంత తక్కువకొస్తుందో తెలిస్తే షాకే!
ఈ కొత్త ఫోన్‌లో 6.3 అంగుళాల డిస్ప్లే రానుంది. ఇది 1080×2424 పిక్సెల్స్ రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా 2250 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో రానుండటం విశేషం. ఇక పనితీరు పరంగా చూసుకుంటే.. ఇందులో గూగుల్ కొత్తగా తయారుచేసిన టెన్సర్ G6 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారని సమాచారం. దీనివల్ల ఫోన్ వేగం, మల్టీటాస్కింగ్, గేమింగ్ అనుభవం గత మోడల్ కంటే చాలా మెరుగ్గా ఉంటుంది.
గూగుల్ పిక్సెల్ ఫోన్ల ప్రధాన బలమే కెమెరా. పిక్సెల్ 11aలో కూడా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కొనసాగనుంది. కెమెరా సైజ్ పెరిగినందున, హార్డ్‌వేర్ పరంగా కొన్ని కీలక మార్పులు ఉండవచ్చని భావిస్తున్నారు. పాత మోడల్ పిక్సెల్ 10aలో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చారు. కాబట్టి.. కొత్త మోడల్‌లో అంతకంటే మెరుగైన సెన్సార్లు, AI ఫోటోగ్రఫీ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
మునుపటి పిక్సెల్ 10a ఫోన్ Titan M2 సెక్యూరిటీ చిప్, 5100mAh బ్యాటరీ, 30W వైర్డ్, 10W వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్లతో వచ్చింది. ఇప్పుడు రాబోయే పిక్సెల్ 11aలో కూడా ఇవే బ్యాటరీ, ఛార్జింగ్ ఫీచర్లు కొనసాగుతూనే.. ప్రాసెసర్ పరంగా పెద్ద అప్‌గ్రేడ్ లభించనుంది. గూగుల్ అధికారికంగా లీక్స్‌ను ధృవీకరించనప్పటికీ, సరసమైన ధరలోనే శక్తివంతమైన ఫీచర్లతో ఈ ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి రానున్నట్లు కనిపిస్తోంది.
Also Read: యాపిల్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు వచ్చేసింది.. iPhone Duo సేల్ డేట్ ఇదే!