E-Paper
Advertisement

గూగుల్ సంచలన నిర్ణయం.. Pixel Watch 5లో ఆ మోడల్స్ తీసేస్తున్నారా? వివరాలు లీక్!

గూగుల్ సంచలన నిర్ణయం.. Pixel Watch 5లో ఆ మోడల్స్ తీసేస్తున్నారా? వివరాలు లీక్!
Advertisement

Google Pixel Watch 5: గూగుల్ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్ ‘పిక్సెల్ వాచ్ 5’ త్వరలోనే మార్కెట్లోకి రావడానికి సిద్ధమౌతోంది. కంపెనీ దీని గురించి అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినప్పటికీ.. అమెరికాకు చెందిన రెగ్యులేటరీ సంస్థ ఎఫ్‌సీసీ (FCC) లిస్టింగ్‌లో ఈ వాచ్‌కు సంబంధించిన కీలక వివరాలు బయటకు వచ్చాయి. ఇందులో కనెక్టివిటీ పరంగా గూగుల్ కొన్ని సంచలన మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

నాలుగు మోడల్స్ లీక్:

ఎఫ్‌సీసీ రికార్డుల ప్రకారం.. గూగుల్ సంస్థ 4 కొత్త డివైజ్‌లను రిజిస్టర్ చేసింది. వీటి మోడల్ నెంబర్లు G25QD, G1XJ6, G0F3Y, GFW3Rగా ఉన్నాయి. రికార్డుల్లో నేరుగా పిక్సెల్ వాచ్ 5 అని పేరు ప్రస్తావించనప్పటికీ.. టెస్టింగ్ కోసం వాడిన మెటల్, నాన్-మెటల్ స్ట్రాప్స్ వివరాలను బట్టి ఇవి ఖచ్చితంగా గూగుల్ నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్‌వాచ్‌లేనని నిపుణులు నిర్ధారిస్తున్నారు. ఇవే మోడల్స్ కొద్దిరోజుల క్రితం భారతదేశానికి చెందిన బీఐఎస్ (BIS) డేటాబేస్‌లో కూడా కనిపించాయి.

అద్భుతమైన కనెక్టివిటీ ఫీచర్లు:

Advertisement

ఈ సరికొత్త వాచ్‌లో కనెక్టివిటీకి గూగుల్ పెద్ద పీట వేసింది. ఈ నాలుగు మోడల్స్‌లోనూ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సీతో పాటు అల్ట్రా వైడ్‌బ్యాండ్ (UWB) సపోర్ట్‌ను కూడా అందిస్తున్నారు. అంతేకాదు.. అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే శాటిలైట్ ఎస్‌ఓఎస్ (Satellite SOS) ఫీచర్ కోసం ప్రత్యేకమైన బ్యాండ్స్ (NTN Band 23, Band 255) ఇందులో అమర్చారు. గూగుల్ గతంలో పిక్సెల్ వాచ్ 4తో ఈ శాటిలైట్ ఫీచర్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

Also Read: ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదేమో.. స్మార్ట్ ఫ్రిడ్జ్‌లపై ఏకంగా రూ.57,000 తగ్గింది.. ఎక్కడ కొనుగోలు చేయాలంటే?

వ్యూహంలో మార్పు:

Advertisement

సాధారణంగా గూగుల్ తమ స్మార్ట్‌వాచ్‌లను వైఫై-ఓన్లీ, ఎల్‌టీఈ వేరియంట్లలో 41mm, 45mm సైజుల్లో విడుదల చేస్తుంది. కానీ ఈసారి లిస్ట్ అయిన 4 మోడల్స్‌లోనూ ఎల్‌టీఈ నెట్‌వర్క్ సపోర్ట్ ఉంది. దీనిని బట్టి చూస్తే గూగుల్ ఈసారి వైఫై-ఓన్లీ మోడల్‌ను పూర్తిగా పక్కన పెట్టేసిందా లేదా రాబోయే రోజుల్లో మరికొన్ని మోడల్స్ లిస్ట్ అవుతాయా అనేది ఆసక్తికరంగా మారింది.

లాంచ్ ఎప్పుడు ఉండొచ్చు?

గూగుల్ తమ సరికొత్త పిక్సెల్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను ఈ ఏడాది ఆగస్టులో లాంచ్ చేయవచ్చనే అంచనాలు ఉన్నాయి. వాటితో పాటే ఈ పిక్సెల్ వాచ్ 5 కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్లలో నెక్స్ట్ జనరేషన్ ‘టెన్సర్ జీ6’ చిప్‌సెట్‌ను వాడబోతున్నట్లు సమాచారం. అయితే గూగుల్ అధికారికంగా స్పందిస్తేనే ఈ సరికొత్త వాచ్ ఫీచర్లు, ధర మరియు లాంచ్ తేదీపై పూర్తి స్పష్టత వస్తుంది.

Also Read: ఈ సరికొత్త Xiaomi TV అడ్వాన్స్‌డ్ ఫీచర్లు చూసాక.. సాధారణ LED TV కొనాలనిపించదు.. ఎందుకంటే?

Related News

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర

రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×