E-Paper
Advertisement

40 ఏళ్ల పెళ్లి బంధం… ఒక్క ట్రిప్‌తో బయటపడ్డ షాకింగ్ నిజం

40 ఏళ్ల పెళ్లి బంధం… ఒక్క ట్రిప్‌తో బయటపడ్డ షాకింగ్ నిజం
Advertisement

Emotional Drama on OTT: నలభై ఏళ్ల వైవాహిక జీవితంలో ఎన్నో సంతోషాలు, కష్టాలు, జ్ఞాపకాలు కలిసి పంచుకున్న దంపతులు… ఒక అందమైన వెకేషన్‌కు వెళ్తే, ఆ ప్రయాణం వారి బంధంలో దాచిన నిజాలన్నింటినీ బయటకు తీసుకొస్తే ? ఇన్నేళ్లుగా ప్రేమగా కలిసి ఉన్న ఇద్దరి మధ్య చిన్న చిన్న అలవాట్లు, అభిప్రాయ భేదాలు, గతంలో జరిగిన సంఘటనలు ఎంతటి దూరాన్ని సృష్టించగలవు ? అలాంటి సున్నితమైన భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించిన ఎమోషనల్ డ్రామానే ‘మిడ్‌వింటర్ బ్రేక్’ (Midwinter Break). బెర్నార్డ్ మాక్‌లావర్టి రాసిన నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో లెస్లీ మ్యాన్‌విల్లే, కియారన్ హిండ్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఐర్లాండ్‌కు చెందిన స్టెల్లా, గెర్రీ దంపతులు దాదాపు 40 ఏళ్లుగా కలిసి జీవిస్తుంటారు. ఇన్నేళ్ల ప్రయాణంలో మంచి లైఫ్ ను లీడ్ చేసిన ఈ జంట… కొన్ని కష్టాలను కూడా కలిసి ఎదుర్కొంది. వయసు పెరిగే కొద్దీ జీవితంలో వచ్చిన మార్పులను అంగీకరిస్తూ ముందుకు సాగుతున్న వీరిద్దరూ, తమ బంధానికి మరోసారి కొత్త అనుభూతిని తీసుకురావాలని నిర్ణయించుకుంటారు.

Advertisement

అందులో భాగంగానే ఆమ్‌స్టర్‌డామ్‌కు విహారయాత్ర కోసం బయలుదేరతారు. ప్రశాంతమైన వాతావరణంలో ఇద్దరూ కలిసి సమయం గడపాలని, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తమ జీవితాన్ని మరోసారి ఆస్వాదించాలని భావిస్తారు. కానీ అక్కడికి చేరుకున్న తర్వాత ఈ ప్రయాణం అనుకున్నట్టుగా వెకేషన్ కాదని వారికి అర్థమవుతుంది.

కొత్త ప్రదేశంలో గడుపుతున్న కొద్దీ… ఇన్నేళ్లుగా వారి మధ్య దాగి ఉన్న కొన్ని విషయాలు మెల్లగా బయటపడటం మొదలవుతాయి. ముఖ్యంగా గెర్రీకి ఉన్న మద్యం అలవాటు వారి కుటుంబ జీవితంపై చూపించిన ప్రభావం స్టెల్లాను మరోసారి ఆలోచనలో పడేస్తుంది. తాను ఎన్నో సంవత్సరాలుగా మౌనంగా భరించిన కొన్ని విషయాలను ఆమె మనసులో తిరిగి గుర్తు చేసుకుంటుంది.

Advertisement

మరోవైపు ఇద్దరి మధ్య ఉన్న మతపరమైన భేదాలు కూడా వారి బంధంలో కీలకమైన అంశంగా మారతాయి. ఇన్నేళ్లు కలిసి జీవించినప్పటికీ… జీవితాన్ని చూసే విధానంలో, నమ్మకాల విషయంలో ఇద్దరి మధ్య ఎంత తేడా ఉందో ఈ ప్రయాణంలో బయటపడుతుంది. స్వదేశంలోని గత జీవితానికి సంబంధించిన కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా కళ్ల ముందు తిరుగుతాయి. ఒకరినొకరు ప్రేమించుకున్నప్పటికీ, కొన్ని బాధలను ఇద్దరూ తమలోనే దాచుకున్నారని క్రమంగా తెలుస్తుంది. బయటకు చెప్పని మాటలు, మరిచిపోయామని అనుకున్న జ్ఞాపకాలు… ఈ ప్రయాణంలో ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి.

దీంతో ఆమ్‌స్టర్‌డామ్ ట్రిప్ కాస్తా… స్టెల్లా, గెర్రీ తమ 40 ఏళ్ల వైవాహిక జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకునే ప్రయాణంగా మారుతుంది. ఇన్నేళ్లుగా కలిసి నడిచిన ఇద్దరి మధ్య నిజంగా ఉన్న బంధం ఏమిటి ? ప్రేమ పేరుతో కప్పేసిన అసంతృప్తులు వాళ్ళ జీవితాలను ఎంతవరకు ప్రభావితం చేశాయి ? అన్నది తెలియాలంటే మూవీపై ఓ లుక్కేయండి.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

40 ఏళ్లుగా కలిసి జీవించిన ఇద్దరు వ్యక్తులు.. ఒక చిన్న ప్రయాణంలో తమ గతాన్ని, తమ బంధాన్ని మరోసారి ప్రశ్నించుకోవాల్సి వస్తే ఏం జరుగుతుంది? ప్రేమ ఉన్నంత మాత్రాన ప్రతి బంధం సాఫీగా సాగుతుందా? లేక చెప్పుకోని బాధలు కూడా ఒక సంబంధంలో భాగమేనా? అనే ఆలోచనలను రేకెత్తించే ‘మిడ్‌వింటర్ బ్రేక్’ ఒక సున్నితమైన ఎమోషనల్ డ్రామా. ప్రస్తుతం ఈ మూవీ Netflix, Peacockఓటీటీలలో అందుబాటులో ఉంది.

ఇది భారీ ట్విస్టులు, యాక్షన్ సన్నివేశాలతో నడిచే సినిమా కాదు. భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న సంభాషణలు, మౌనం, ఒకరి మాటలకు మరొకరు ఇచ్చే స్పందనల ద్వారా వారి మనసుల్లో దాగి ఉన్న భావాలను ఆవిష్కరించే సినిమా. లెస్లీ మ్యాన్‌విల్లే, కియారన్ హిండ్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. వైవాహిక జీవితంలో ప్రేమతో పాటు వచ్చే అభిప్రాయ భేదాలు, వయసు పెరిగేకొద్దీ మారే మనస్తత్వాలు, గత జ్ఞాపకాల ప్రభావం వంటి సున్నితమైన అంశాలను ‘మిడ్‌వింటర్ బ్రేక్’ మనసుకు హత్తుకునే విధంగా చూపించారు. పెద్ద ట్విస్టుల కంటే పాత్రల భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చే నెమ్మదైన కథనాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా మరింతగా కనెక్ట్ అవుతుంది.

Read Also: హాలీవుడ్‌ను ఏలిన మినియన్స్… రాక్షసులను దించి ప్రపంచాన్నే డేంజర్లో పడేసే బొమ్మలు

Tags

Related News

నమ్మినవాడే వెన్నుపోటు.. డ్రాగన్లతో రణరంగం.. చివర్లో ఊహించని విషాదం

హీరో సిద్ధార్థ్ కి భారీ షాక్.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్!

ప్రియురాలికి ప్రపోజ్ చేయడానికి వెళ్తుంటే యాక్సిడెంట్… రెండు ప్రేమకథల ఎమోషనల్ జర్నీ

హిందీలో స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న మా ఇంటి బంగారం.. ఎప్పుడంటే?

ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న రోజా రీ ఎంట్రీ మూవీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే?

రైతు కొడుకు నుంచి పూణే డాన్‌గా… షాకింగ్ క్రైమ్ డ్రామా

నైట్ డ్యూటీలో నర్సు… లగ్జరీ వృద్ధాశ్రమంలో రాత్రిపూట జరిగే షాకింగ్ వ్యవహారం

Big Stories

Advertisement
×