Honor 200 Lite 5G: స్మార్ట్‌ఫోన్స్ వాడేవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ప్రముఖ కంపెనీలు సైతం కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. తక్కువ ధరలో రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ హానర్ తాజాగా తన లైనప్‌లో ఉన్న Honor 200 Lite 5G ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌లో 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ అందించారు.
అదే సమయంలో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కలిగి ఉంది. ఇక ప్రాసెసింగ్ విషయానికొస్తే.. ఇది MediaTek Dimensity 6080 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా ఇది 35W వైర్డు ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్‌తో 4500mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే ఈ ఫోన్ Android 14 ఆధారిత MagicOS 8.0పై నడుస్తుంది. అంతేకాదండోయ్ అనేక AI ఫీచర్లతో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో జూలైలో లాంచ్ అయిన హానర్ 200 5G, హానర్ 200 ప్రో 5G లకు సక్సెసర్‌గా వచ్చింది.
Honor 200 Lite 5G Specifications
Honor 200 Lite 5G స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల పూర్తి HD+ (2,412 x 1,080 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 2,000నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వచ్చింది. 8GB RAM + 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వచ్చింది. ప్రాససర్ విషయానికొస్తే.. ఇది MediaTek Dimensity 6080 SoC చిప్‌సెట్‌ను పొందింది. RAMని వర్చువల్‌గా 8GB వరకు పెంచుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 14-ఆధారిత MagicOS 8.0 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో నడుస్తుంది. మ్యాజిక్‌ఎల్‌ఎమ్, మ్యాజిక్ పోర్టల్, మ్యాజిక్ క్యాప్సూల్, మ్యాజిక్ లాక్ స్క్రీన్, పారలల్ స్పేసెస్ వంటి అనేక AI ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. కాగా హానర్ ఈ ఏడాది జనవరిలో నాలుగు-లేయర్డ్ AI ఆర్కిటెక్చర్‌తో కూడిన కొత్త OSని తీసుకొచ్చింది. ఇక కెమెరా విషయానికొస్తే.. Honor 200 Lite 5G ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది.
Also Read: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!
ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మద్దతుతో కూడిన 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఇక ఫోన్ ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇక ఫోన్ సామర్థ్యం విషయానికొస్తే.. హానర్ 35W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4500mAh బ్యాటరీని ప్యాక్ చేసింది. ఇక కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికొస్తే.. ఇది 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.1, OTG, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఇక సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అమర్చబడింది.
Honor 200 Lite 5G Price
భారతదేశంలో లాంచ్ అయిన Honor 200 Lite 5G ధర విషయానికొస్తే.. ఇది 8GB + 256GB వేరియంట్ 17,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. అమెజాన్, హానర్ వెబ్‌సైట్, ఎంపిక చేసిన స్టోర్‌ల ద్వారా సెప్టెంబర్ 27 నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అలాగే Honor 200 Lite 5G కొనుగోలు సమయంలో SBI ఖాతాదారులు రూ.2,000 తక్షణ తగ్గింపు పొందుతారు.
దీంతో ఈ ఫోన్ మరింత తక్కువకే లభిస్తుంది. అంతేకాకుండా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024లో భాగంగా సెప్టెంబర్ 26వ తేదీన ప్రారంభమయ్యే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌లకు 24 గంటల ముందస్తు యాక్సెస్‌ను హానర్ అందిస్తోంది. కాగా ఈ Honor 200 Lite 5G మూడు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. అవి సియాన్ లేక్, మిడ్నైట్ బ్లాక్, స్టార్రి బ్లూ వంటివి ఉన్నాయి.