E-Paper
Advertisement

Honor 400 Sales: రికార్డులు బద్దలు కొట్టిన హానర్ 400 సిరీస్.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా 60 లక్షల మొబైల్స్ సేల్

Honor 400 Sales: రికార్డులు బద్దలు కొట్టిన హానర్ 400 సిరీస్.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా 60 లక్షల మొబైల్స్ సేల్
Advertisement

Honor 400 Sales| చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్‌ ఒక అనూహ్య రికార్డ్ సాధించింది. ఈ సంవత్సరం లాంచ్ అయిన హానర్ 400 సిరీస్ సేల్స్ అద్భుతంగా జరుగుతున్నాయి. మే 2025 లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన ఈ సిరీస్ మార్కెట్‌లో అద్భుతమైన స్పందన పొందింది. ఇప్పుడు కంపెనీ హానర్ 500 సిరీస్‌ త్వరలోనే లాంచ్ చేయనుంది. ఇది ఇటీవల విడుదలైన ఆపిల్ ఐఫోన్ ఎయిర్ డిజైన్ పోలికలతో తక్కువ బరువుతో ఉంటుందని సమాచారం.

రికార్డ్ సేల్స్

హానర్ 400 సిరీస్ లో భాగంగా విడుదలైన హానర్ 400, హానర్ 400 ప్రో సేల్స్ గురించి కంపెనీ ప్రెసిడెంట్ వాంగ్ బాన్ ఆసక్తికరమైన గణాంకాలు షేర్ చేశారు. హానర్ 400 సిరీస్ ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల కంటే ఎక్కువ యూనిట్లు వేగంగా షిప్ అయ్యాయి. చైనాలో హానర్ 300 సిరీస్‌తో పోలిస్తే 195 శాతం, హానర్ 200 సిరీస్‌తో పోలిస్తే 138 శాతం అమ్మకాలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో (చైనా యేతర దేశాల్లో) రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ అమ్ముడైంది. ఇది హానర్ బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను చూపిస్తోంది.

హానర్ 400 సిరీస్ ఫీచర్లు

Advertisement

ఈ సిరీస్‌లో హానర్ 400, హానర్ 400 ప్రో మోడళ్లు ఉండగా.. రెండింటిలోనూ 6.55 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లే ఉంది. ఫ్లాట్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ప్రధాన 200 మెగాపిక్సెల్ కెమెరా చాలా స్పష్టమైన ఫొటోలు తీస్తుంది. ముందు కెమెరా 50 మెగాపిక్సెల్ – సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు బాగుంటుంది. రెండు ఫోన్లలోనూ 7,200mAh భారీ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలా రోజులు పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15, మ్యాజిక్ OS 9.0 సాఫ్ట్‌వేర్‌తో వస్తుంది.

ప్రాసెసర్ పవర్

సాధారణ హానర్ 400లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్ ఉంది. మిడ్ రేంజ్ యూజర్ల కోసం బాగుంటుంది. అదే హానర్ 400 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఉంది – e646 ఫ్లాగ్‌షిప్ లెవెల్ ప్రాసెసర్ తో వస్తుంది. భారీ గేమ్స్, యాప్స్ సులభంగా రన్ అవుతాయి.

కొత్త మోడల్

Advertisement

ఇదే సిరీస్‌లో మరో కొత్త మోడల్ హానర్ 400 స్మార్ట్ 5G కూడా రావచ్చు. ఇది ఆరెంజ్ టెలికాం వెబ్‌సైట్‌లో కనిపించింది. వెనుకవైపు నాలుగు యాంగిల్స్ ఆకారంలో కెమెరా మాడ్యూల్ ఉంటుంది – మిగతా మోడళ్ల నుంచి భిన్నంగా కనిపిస్తుంది.

త్వరలో హానర్ 500 సిరీస్ విడుదల

హానర్ 500 సిరీస్‌ను కంపెనీ టీజ్ చేస్తోంది. ఇది 400 సిరీస్ కు అప్‌గ్రేడ్. హానర్ 500, 500 ప్రో మోడళ్లు ఉండవచ్చు. సాధారణ 500లో 6.5 అంగుళాల డిస్‌ప్లే, 200 మెగాపిక్సెల్ కెమెరా ఉండవచ్చు.

మార్కెట్ షేర్

400 సిరీస్ విజయం హానర్‌కు మంచి జోష్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ మార్కెట్ షేర్ పెరుగుతోంది. మంచి ఫీచర్లు, తక్కువ ధరలో ఫోన్లు ఇవ్వడంతో కస్టమర్లు ఆకర్షితులవుతున్నారు. హానర్ 400 సిరీస్ ఇంత వరకు భారత్ లో అధికారికంగా విడుదల కాలేదు. కానీ థర్డ్ పార్టీ వెబ్ సైట్ల ద్వారా అందుబాటులో ఉంది.

Also Read: ఆస్పత్రిలో రూ.1.6 కోటి బిల్లు చూసి షాకైన యువకుడు.. అసలు బిల్లు రూ.29 లక్షలే.. మోసం ఎలా కనిపెట్టాడంటే

Related News

ఖరీదైన గ్యాడ్జెట్లు అక్కర్లేదు.. 3D ప్రింటర్‌తో మీ హోమ్ థియేటర్‌ను ఇలా అప్‌గ్రేడ్ చేసుకోండి!

సుప్రీంకోర్టులో Vi కి భారీ ఊరట.. రూ.363 కోట్ల జీఎస్టీ వివాదంలో కేంద్రానికి షాక్!

ఐఫోన్ నీళ్లలో పడిందా? సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా.. ఈ ఒక్క షార్ట్‌కట్‌తో నీటిని బయటకు పంపండి!

బడ్జెట్‌లో బిగ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ చూస్తే వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది!

Sony vs Bose.. ఈ రెండింటిలో ఏ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ కొంటే మీ డబ్బులు వృధా కావు?

రూ.27,000కే ఇంత స్ట్రాంగ్ ఫోనా? 7200mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో అద్భుతమైన ఫీచర్లు!

మడతపెడితే క్రీజు కూడా కనిపించదు.. టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న హువావే కొత్త ఫోన్!

ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఈ 5 గ్యాడ్జెట్స్ పక్కా ఉండాలి.. బ్యాగ్‌లో ఇట్టే పట్టేస్తాయి!

Big Stories

Advertisement
×