E-Paper
Advertisement

IND VS SA 1st Test: రేప‌టి నుంచే ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌..ఇండియాను వ‌ణికిస్తున్న రికార్డులు..ఉచితంగా ఎలా చూడాలంటే

IND VS SA 1st Test: రేప‌టి నుంచే ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌..ఇండియాను వ‌ణికిస్తున్న రికార్డులు..ఉచితంగా ఎలా చూడాలంటే

IND VS SA 1st Test: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రేపటి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. మొన్నటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై టి20 లు ఆడిన టీమిండియా, ఇప్పుడు ఫార్మాట్ మార్చబోతోంది. టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్టులు జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. స్వదేశంలోనే ఈ సిరీస్ నిర్వహించనున్నారు.

Also Read: PAK vs SL 2nd ODI: ఇస్లామాబాద్ లో బ్లాస్టింగ్‌..పాకిస్తాన్ నుంచి పారిపోయిన 16 మంది శ్రీలంక ప్లేయ‌ర్లు, వ‌న్డే సిరీస్ ర‌ద్దు ?

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య టెస్టులు

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 1st Test) మధ్య రేపటి నుంచి టెస్ట్ సిరీస్ జరగనుంది. కోల్ క‌త్తాలోని ఈడెన్ గార్డెన్స్ ( Eden Gardens, Kolkata ) వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ నిర్వహించనున్నారు. మనదేశంలోనే ఈ మ్యాచ్ జరుగుతోంది కాబట్టి ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. 9 గంటల సమయంలో టాస్ ప్రక్రియ ఉంటుంది. ఇక దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరగబోయే టెస్ట్ సిరీస్ ను జియో హాట్ స్టార్‌ లో ఉచితంగానే చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్ లు వస్తాయి.

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రికార్డులు

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ ల రికార్డ్ ఒకసారి పరిశీలిస్తే, ఇందులో సఫారీలు పై చేయి సాధించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు జ‌ట్ల‌ మధ్య 44 టెస్టు మ్యాచ్ లు జరిగాయి. ఇందులో టీమిండియా కేవలం 16 మ్యాచ్ లు మాత్రమే విజయం సాధించింది. అటు దక్షిణాఫ్రికా ఏకంగా 18 మ్యాచ్ లు విక్టరీ సాధించి లీడ్ లో ఉంది. ఇక హోమ్ టౌన్ లో దక్షిణాఫ్రికా పై 11 మ్యాచ్ ల‌లో టీమిండియా విజయం సాధించింది. అంటే విదేశాల్లో కేవలం ఐదు మ్యాచ్ ల‌లో టీమిండియా గెలవడం గ‌మ‌నార్హం. ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో నితీష్ కుమార్ రెడ్డి ఆడ‌టం లేద‌ని బీసీసీఐ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. దీంతో రేప‌టి మ్యాచ్ లో రిష‌బ్ పంత్‌, జురేల్ ఆడే ఛాన్సులు క‌నిపిస్తున్నాయి.

టీమిండియా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల అంచ‌నా

ఇండియా ప్రిడిక్టెడ్ XI: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్ & వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

దక్షిణాఫ్రికా ప్రిడిక్టెడ్ XI: ఐడెన్ మార్క్రామ్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డి జోర్జి, టెంబా బావుమా (కెప్టెన్), కైల్ వెర్రెయిన్ (వికెట్ కీప‌ర్), సెనురన్ ముత్తుసామి, కార్బిన్ బాష్, సైమన్ హార్మర్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ.

Also Read: PAK VS SL: పాకిస్తాన్ లో చ‌చ్చినా ప‌ర్లేదు, మ్యాచ్ ఆడండి..లేక‌పోతే 2 ఏళ్ల బ్యాన్‌…శ్రీలంక బోర్డు హెచ్చ‌రిక‌లు

 

Related News

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

Big Stories

×