E-Paper
Advertisement

ఐఫోన్ Siriలో ఈ ఒక్క సెట్టింగ్ ఆఫ్ చేయకపోతే.. మీ వ్యక్తిగత డేటా డేంజర్‌లో పడ్డట్టే!

ఐఫోన్ Siriలో ఈ ఒక్క సెట్టింగ్ ఆఫ్ చేయకపోతే.. మీ వ్యక్తిగత డేటా డేంజర్‌లో పడ్డట్టే!
Advertisement

iPhone Siri Privacy: ఈ రోజుల్లో ఐఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ ‘సిరి’ ఒక మంచి ఫ్రెండ్‌లా మారిపోయింది. దేనికైనా ఫోన్ చేతిలోకి తీసుకోకుండా మాట్లాడి పనులు కానిచ్చేస్తున్నాం. మెసేజ్‌లు పంపడం, అలారాలు పెట్టడం, క్యాలెండర్‌లో నోట్స్ రాసుకోవడం వంటివి సిరి చాలా వేగంగా చేస్తుంది. అయితే మనం అడిగే ప్రతీ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వడానికి సిరి మన ఫోన్‌లోని చాలా వివరాలను పరిశీలిస్తుంది. ఈ క్రమంలో మన వ్యక్తిగత డేటా ఎంతవరకు సురక్షితం అనేది ప్రతీ ఒక్కరి మెదడులో మెదిలే ప్రశ్న.

సిరి డేటా ఎలా పనిచేస్తుంది?

సిరి మన గురించి తెలుసుకునే సమాచారంలో ఎక్కువ భాగం మన ఐఫోన్‌లోనే ప్రాసెస్ అవుతుంది. మన కాంటాక్ట్స్, మెసేజ్‌లు, క్యాలెండర్ వివరాలు అన్నీ ఫోన్ లోపలే ఉంటాయి తప్ప నేరుగా యాపిల్ సర్వర్లకు వెళ్లవు. క్లిష్టమైన ప్రశ్నలు లేదా పెద్ద పనుల కోసం యాపిల్ ‘ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్’ సాంకేతికతను వాడుతుంది. దీనివల్ల మన వివరాలు సర్వర్‌లో సేవ్ అవ్వకుండానే మనకు సమాధానం వస్తుంది. ఇక లొకేషన్ వివరాలు లాంటివి సర్వర్‌కు వెళ్లినా.. అవి మన యాపిల్ ఐడీకి అనుసంధానం కాకుండా ఒక కోడ్‌ రూపంలో మాత్రమే వెళ్తాయి.

Advertisement

Also Read: వాట్సప్‌లో ఇప్పటివరకు లేని క్రేజీ ఫీచర్.. ఇక బర్త్‌డేలు, ఆన్‌లైన్ స్టేటస్ నేరుగా అక్కడే!

అతిగా మాట్లాడితే కష్టమే..

యాపిల్ ఎంత భద్రత ఇచ్చినా.. కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండటమే మంచిది. బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, క్రెడిట్ కార్డ్ వివరాలు, ఆఫీస్ రహస్యాలు లేదా చాలా పర్సనల్ విషయాలను సిరి ద్వారా డిక్టేట్ చేయడం మంచిది కాదు. సిరికి ఎంత సమాచారం కావాలో అంత మాత్రమే చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఉదా: డాక్టర్ అపాయింట్‌మెంట్ ఉంటే ‘సెట్ రిమైండర్ ఫర్ డాక్టర్ అపాయింట్‌మెంట్’ అని చెబితే సరిపోతుంది. అంతేకానీ, ఏ వ్యాధి కోసం వెళ్తున్నామో వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ ఒక్క సెట్టింగ్ మార్చితే..

Advertisement

మన ఐఫోన్ సెట్టింగ్స్‌లో ‘ఇంప్రూవ్ సిరి అండ్ ఆపిల్ ఇంటెలిజెన్స్’ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది ఆన్ చేసి ఉంటే.. మనం సిరితో మాట్లాడిన సంభాషణల నమూనాలను యాపిల్ సంస్థ తమ సాంకేతికతను మెరుగుపరుచుకోవడానికి పరిశీలిస్తుంది. ఈ డేటా మన ఈ-మెయిల్‌తో లింక్ అవ్వకపోయినా, మన ఆడియో రికార్డింగ్‌లు వారి సర్వర్‌కు వెళ్లడం ఇష్టం లేకపోతే దీన్ని ఆఫ్‌ చేసుకోవచ్చు. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ విభాగంలోకి వెళ్లి ఈ ఆప్షన్‌ను సులభంగా బంద్ చేయవచ్చు.

ప్రైవసీ కోసం చిన్న చిట్కాలు..

సిరి సౌకర్యాన్ని వాడుకుంటూనే ప్రైవసీని కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ముందుగా మీ ఫోన్ సెట్టింగ్స్‌కి వెళ్లి ఏ యాప్స్‌కి సిరి పర్మిషన్ ఉందో ఒకసారి చెక్ చేయండి. అలాగే లాక్ స్క్రీన్ మీద సిరి సజెషన్స్ రాకుండా ఆపవచ్చు. లొకేషన్ యాక్సెస్ అవసరం లేదనుకుంటే సిరికి మాత్రమే దాన్ని తీసేయవచ్చు. ఒకవేళ అసలు సిరి అవసరమే లేదు అనుకుంటే.. పూర్తిగా డిసేబుల్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మన ఫోన్‌లో స్థానికంగా ఉన్న డిక్టేషన్ వివరాలన్నీ డిలీట్ అయిపోతాయి.

Also Read: ఇలాంటి ఫీచర్లు ఈ ధరలో సాధ్యమేనా? Oppo K14 Plus ఫీచర్లపై ఓ లుక్కేయండి!

Tags

Related News

రూ.16,300 వరకు ఆదా.. అమెజాన్ సేల్‌లో Vivo X300 Ultraపై సెన్సేషనల్ ఆఫర్!

అమెజాన్ సేల్‌లో..టాప్ 5 గేమింగ్ మానిటర్లపై భారీ డిస్కౌంట్లు!

మార్కెట్‌లోకి కొత్త హెడ్ ఫోన్..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం గ్యారంటీ !

ఇలాంటి ఫీచర్లు ఈ ధరలో సాధ్యమేనా? Oppo K14 Plus ఫీచర్లపై ఓ లుక్కేయండి!

వాట్సప్‌లో ఇప్పటివరకు లేని క్రేజీ ఫీచర్.. ఇక బర్త్‌డేలు, ఆన్‌లైన్ స్టేటస్ నేరుగా అక్కడే!

మీ ఇంటికి సరైన వాషింగ్ మెషీన్ కొనడానికి ఇదే బెస్ట్ టైమ్..సేల్ ఆఫర్లు ఇవిగో!

రూ.9,999 ఇయర్‌బడ్స్ ఇప్పుడు రూ.2,999కే.. అమెజాన్ సేల్‌లో అద్భుతమైన డీల్!

Big Stories

Advertisement
×