How to save mobile data: సోషల్ మీడియా యుగంలో రీల్స్ చూడటం అనేది ఒక అడిక్షన్ గా మారిపోయింది. ఒక్క రీల్ చూద్దామని ఓపెన్ చేస్తే.. బ్యాక్‌గ్రౌండ్‌లో హై-క్వాలిటీ వీడియోలు లోడ్ అవుతూ వందల కొద్దీ ఎంబీల డేటాను గుటకకాయ స్వాహా చేసేస్తుంటాయి. ఫలితంగా ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోవడం, డేటా అయిపోయిందని మెసేజ్ రావడం జరుగుతుంది. కానీ టెన్షన్ పడకండి. ఇన్-బిల్ట్ యాప్స్‌లోనే డేటాను సగం కంటే ఎక్కువ ఆదా చేసే కొన్ని స్మార్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. వాటిని ఎలా యాక్టివేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఇన్‌స్టాగ్రామ్ ‘డేటా సేవర్’ ఆన్ చేయండి:
రీల్స్ ఎక్కువగా చూసేది ఇన్‌స్టాగ్రామ్‌లోనే కాబట్టి మొదట ఇక్కడే సెట్టింగ్స్ మార్చాలి. ఇన్‌స్టాలో మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ రాబోయే వీడియోలు ముందే హై-రిజల్యూషన్‌లో లోడ్ అయిపోతాయి. దీనికి బ్రేక్ వేయడానికి.. మీ ఇన్‌స్టా ప్రొఫైల్‌లోకి వెళ్లి.. పైన ఉండే త్రీ లైన్స్ పై క్లిక్ చేయండి. తర్వాత కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే “Data usage and media quality” ఆప్షన్ కనిపిస్తుంది. అందులోకి వెళ్లి “Data Saver” మోడ్‌ను ఆన్ చేయండి. దీని వల్ల వీడియో క్వాలిటీలో పెద్దగా తేడా తెలియదు కానీ.. మీ డేటా మాత్రం విపరీతంగా సేవ్ అవుతుంది.
2. యూట్యూబ్ షార్ట్స్ డేటా సేవింగ్ మోడ్ :
యూట్యూబ్ షార్ట్స్‌లో కూడా వీడియోలు ఆటోమేటిక్‌గా హై-డెఫినిషన్ లో ప్లే అవుతుంటాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి.. యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి మీ Profile Icon పై నొక్కండి, ఆపై Settings లోకి వెళ్లండి. అక్కడ “Data Saving” అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి, ‘Data Saving Mode’ ని ఆన్ (Toggle ON) చేసుకోండి. ఇది ఆన్ చేస్తే, మీరు షార్ట్స్ చూస్తున్నప్పుడు మీ నెట్ స్పీడ్‌ను బట్టి క్వాలిటీ అడ్జస్ట్ అవుతుంది తప్ప అనవసరంగా డేటా వేస్ట్ కాదు.
3. మొబైల్ ఇన్-బిల్ట్ డేటా సేవర్ :
యాప్స్ మాత్రమే కాకుండా మీ ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ సెట్టింగ్స్‌లో ఒక మాస్టర్ బటన్ ఉంటుంది. మీ ఫోన్ Settings ఓపెన్ చేసి, Network & Internet లేదా Connections లోకి వెళ్లండి.
అక్కడ Data Saver అనే ఆప్షన్ వెతికి దాన్ని ఆన్ చేయండి. లాభం ఏంటంటే.. ఇది ఆన్ చేయడం వల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే ఇతర యాప్స్ (ఫేస్‌బుక్, వాట్సాప్ అప్‌డేట్స్ మొదలైనవి) మీ పర్మిషన్ లేకుండా డేటాను వాడుకోలేవు. మీరు ఏ యాప్ వాడుతుంటే దానికి మాత్రమే ఇంటర్నెట్ అందుతుంది.
Also Read: ఆపద వస్తే కాపాడేది మీ ఫోనే.. ఈ 5 ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ ఇప్పుడే ఆన్ చేసుకోండి!
4. ఆటో-అప్‌డేట్స్ ఆఫ్ చేసుకోండి:
చాలా సార్లు మనకు తెలియకుండానే.. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్‌ను అప్‌డేట్ చేసేస్తుంటాయి. ప్లే స్టోర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి “Network Preferences” లో “Auto-update apps over Wi-Fi only” గా సెట్ చేసుకోండి. దీని వల్ల మొబైల్ డేటా వృధా అవ్వదు.
స్మార్ట్‌గా ఆలోచిస్తే స్మార్ట్‌ఫోన్ వాడకం చాలా ఈజీ అయిపోతుంది. పైన చెప్పిన సింపుల్ సెట్టింగ్స్ మార్చుకుంటే, మీ రోజువారీ 1.5 GB డేటా కూడా రోజంతా హ్యాపీగా వస్తుంది. ఇక నెట్ అయిపోతుందనే భయం లేకుండా.. నిశ్చింతగా రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు.