E-Paper
Advertisement

ఒక్క ఏడాదిలోనే రూ.3.2 లక్షల నుంచి రూ.40 లక్షల ప్యాకేజీకి.. ప్రభుత్వ కాలేజీ విద్యార్థి కెరీర్ సూపర్ ఫాస్ట్

ఒక్క ఏడాదిలోనే రూ.3.2 లక్షల నుంచి రూ.40 లక్షల ప్యాకేజీకి.. ప్రభుత్వ కాలేజీ విద్యార్థి కెరీర్ సూపర్ ఫాస్ట్
Advertisement

Inspiring Career Success Story| ఒకప్పుడు ఏడాదికి రూ.3.2 లక్షల ప్యాకేజీతో కెరీర్ ప్రారంభించిన యువ టెక్కీ ఇప్పుడు రూ.40 లక్షల ప్యాకేజీ అందుకుంటున్నాడు. టైర్ – 3 ప్రభుత్వ కళాశాలలో బీటెక్ చదివిన సౌరభ్ మిశ్రా, టిసిఎస్, నుంచి అమెజాన్ వరకు అన్ని పెద్ద కంపెనీల్లో తన సత్తా చాటాడు. కేవలం ఏడాది వ్యవధిలో ఆయన ప్యాకేజీలో భారీ మార్పు వచ్చింది. కుటుంబ పరిస్థితుల కారణంగా ఉద్యోగంలో చేరిన ఆయన, అదే అనుభవాన్ని తదుపరి అవకాశానికి ఉపయోగించుకున్నాడు.

కెరీర్‌ ప్రారంభం

సౌరభ్ మిశ్రా UPTCలో బీటెక్ పూర్తి చేశారు. అదొక టైర్ – 3 ప్రభుత్వ కాలేజీ. కాలేజీలో ఉన్న సమయంలో ఆయన క్యాంపస్ ప్లేస్‌మెంట్లపై ఎక్కువగా దృష్టి పెట్టలేదు. అప్పట్లో GATE కంప్యూటర్ సైన్స్ పరీక్షకు సిద్ధం కావడంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారు. కోడింగ్, ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్ కంటే థియరీ నాలెడ్జ్‌ను బలపరచుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించారు. అయితే కుటుంబ పరిస్థితులు ఆయన కెరీర్ ప్రణాళికలను మార్చాయి.

కుటుంబ బాధ్యతలతో TCSలో ఉద్యోగం

Advertisement

కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయడానికి సౌరభ్ మిశ్రా త్వరగా ఉద్యోగం చేయాల్సి వచ్చింది. దీంతో ఆయన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఉద్యోగం పొందారు. TCSలో ఆయన అసిస్టెంట్ సిస్టమ్ ఇంజినీర్‌గా కెరీర్ ప్రారంభించాడు. ఆ సమయంలో ఆయన వార్షిక ప్యాకేజీ రూ.3.2 లక్షలుగా ఉన్నట్లు సమాచారం. ఈ ఉద్యోగం ద్వారా ఆయనకు టెక్నాలజీ రంగంలో ప్రాక్టికల్ అనుభవం లభించింది. అదే సమయంలో భవిష్యత్తులో మంచి అవకాశాలను అందుకోవడానికి అవసరమైన అనుభవాన్ని కూడా సంపాదించారు.

ఉద్యోగం చేస్తూ నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నాడు

టిసిఎస్‌లో ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మిశ్రా నేర్చుకోవడం ఆపలేదు. ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూనే మెరుగైన కెరీర్ అవకాశాల కోసం తనను తాను సిద్ధం చేసుకున్నారు. ఉద్యోగంతో పాటు నైపుణ్యాలను పెంచుకోవడానికి సమయం కేటాయించారు. ఫుడ్ టైమ్ జాబ్ చేస్తూ నేర్చుకోవడాన్ని సమతుల్యం చేయడానికి క్రమశిక్షణ అవసరమైంది. టిసిఎస్‌లో పనిచేసిన అనుభవం టెక్నాలజీ రంగంలోని పని విధానాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. అక్కడ సంపాదించిన అనుభవం తదుపరి కెరీర్ అడుగుకు పునాదిగా మారింది.

Advertisement

Also Read: రూ.50 లక్షల పెట్టుబడితో రూ.50 కోట్ల రాబడి.. 21 ఏళ్ల యువతి జాక్‌పాట్

ఏడాదిలోనే అమెజాన్‌లో మరో అవకాశం

సుమారు ఏడాది తర్వాత మిశ్రా అమెజాన్‌లో ఉద్యోగం పొందాడు. అయితే ఈసారి ఆయన వార్షిక ప్యాకేజీ సుమారు రూ.40 లక్షలకు పెరిగినట్లు సమాచారం. ఆయన ఉద్యోగం చేస్తూ తన స్కిల్స్ పెంచుకోవడమే దీనికి కారణం. ప్రస్తుతం ఆయన అమెజాన్‌లో క్లౌడ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. టిసిఎస్‌లో ప్రారంభ ప్యాకేజీతో పోలిస్తే ఈ మొత్తం గణనీయంగా పెరిగింది. అయితే ఉద్యోగుల జీతాలు అనుభవం, నైపుణ్యాలు, ఉద్యోగ స్థానం, పాత్ర, మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి మారుతాయి. అందువల్ల ఈ ప్యాకేజీని ప్రతి టెక్కీకి వర్తించే సాధారణ ఫలితంగా చూడకూడదు.

Also Read: గోల్డ్ లోన్ చెల్లించినా మీ బంగారాన్ని బ్యాంక్ తిరిగి ఇవ్వకపోతే ఏం చేయాలి? ఇది తెలుసుకోండి

కెరీర్‌లో ఊహించని కొత్త అవకాశాలు

సౌరభ్ మిశ్రా మొదట GATE పరీక్షపై దృష్టి పెట్టాలని భావించారు. కుటుంబ బాధ్యతల కారణంగా ఆయన ఉద్యోగంలోకి చేరాల్సి వచ్చింది. అనుకోని పరిస్థితుల్లో తీసుకున్న ఆ నిర్ణయం తరువాత మరో కెరీర్ అవకాశానికి దారితీసింది. టిసిఎస్ నుంచి అమెజాన్ వరకు ఆయన ప్రయాణం నిరంతరం నేర్చుకోవడమే ప్రాధాన్యంగా సాగింది. ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా నైపుణ్యాలను పెంచుకుంటే కొత్త అవకాశాలను అన్వేషించవచ్చని ఈ కథనం సూచిస్తుంది.

Related News

గోల్డ్ లోన్ చెల్లించినా మీ బంగారాన్ని బ్యాంక్ తిరిగి ఇవ్వకపోతే ఏం చేయాలి? ఇది తెలుసుకోండి

బ్యాంకుకు వెళ్లకుండానే..ఫోన్ నంబర్ మార్చుకోవడం ఎలా? సింపుల్ ప్రాసెస్ ఇగో!

పదేళ్ల తర్వాత ఆదివారం బ్యాంకులు ఓపెన్.. నగదు విత్‌డ్రా పరిమితులు తొలగింపు, సమ్మెలో 7.5 లక్షల మంది

ఆన్‌లైన్‌లో తప్పుడు ప్రొడక్ట్ వచ్చిందా?రిటర్న్ చేసే ముందు ఈ తప్పులు చేయొద్దు!

ఇల్లు ఖాళీ చేసాక ఓనర్ డిపాజిట్ ఇవ్వట్లేదా? మీ డబ్బును తిరిగి పొందే సింపుల్ టిప్స్

చాక్లెట్ల పేరుతో ఆటపట్టించి.. ఉద్యోగులకు ఐఫోన్ గిఫ్టులు.. ఈ బాస్ బంగారం బాబోయ్!

కిరోసిన్ దీపం వెలుగులో చదివి రూ.20 లక్షల సాలరీ జాబ్.. వ్యవసాయ కూలీ బిడ్డ ఐపిఎస్ ఆఫీసర్

Big Stories

Advertisement
×