E-Paper
Advertisement

దున్న‌పోతు.. వెన్నుపోటు.. ! వైసీపీకి వెన్నుపోటు పొడిచిన దున్న‌పోతు..!

దున్న‌పోతు.. వెన్నుపోటు.. ! వైసీపీకి వెన్నుపోటు పొడిచిన దున్న‌పోతు..!
Advertisement

వెన్నుపోటు.. దున్న‌పోతు..! ఏదో క‌వితాత్మ‌కంగా ఉంద‌నుకున్నారు కాబోలు. ప్రాస‌, యాస‌లు క‌లిశాయి.. నిర‌స‌న బంప‌ర్ హిట్ట‌వుతుంద‌ని అనుకున్న‌ట్టున్నారు. కాన్సెప్ట్ బాగానే ఉంది. కానీ ప్రాక్టిక‌ల్‌కు వ‌చ్చే స‌రికి ఈడ్చి త‌న్నినంత ప‌నిచేసింది. ఆ దున్న‌పోతు. పాపం.. జ‌గ‌న్ కు కాలం క‌లిసి రావ‌డం లేదు. ఇప్ప‌టికే ఏపీలో ఎదురీదుతున్నాడు. మ‌ధ్య మ‌ధ్య‌లో త‌ను మాట్లాడే మాటల‌ను మీమ్స్ చేసి మ‌రీ వెంటాడుతున్న‌ది కూట‌మి సోష‌ల్ మీడియా.

తాజాగా కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల సంబ‌రాల‌కు రెడీ అయిపోతే.. జగ‌న్ అది చూస్తూ కూర్చుంటాడా? ఇది వెన్నుపోటు.. అని రంగంలోకి దిగాడు. ప్ర‌జ‌ల‌ను వెన్నుపోటు పొడిచి రెండేండ్లు పాలించిన స‌ర్కార్‌ను దున్న‌పోతుతో పోల్చారు. అందుకే రెండు దున్న‌ల‌ను దింపారు. నిర‌స‌న‌కు మంది బాగానే వ‌చ్చారు. ఇక దున్న‌పోతుకు విన‌తులు స‌మ‌ర్పించ‌డ‌మే లేటు.. ఒక్క‌సారిగా ప్లానంతా తిర‌గ‌బ‌డింది. ఆ దున్నపోతు వెన్నుపోటు పొడిచింది పార్టీకి. అప్ప‌టికే అవి బిక్కు బిక్కు మంటూ ఉన్నాయి.

Advertisement

వాటిని ప‌ట్టించుకున్న‌వాడెవ్వ‌డూ. ఎవ‌రికి వారు ఫోటోల‌కు ఫోజులిస్తున్నారు. కానీ ఆ దున్న‌పోతుల ఫేస్ ఫీలింగ్సును మాత్రం గ‌మ‌నించ‌లేదు. బిత్త‌ర చూపులు చూస్తున్న ఆ దున్న‌పోతులు.. చివ‌ర‌కు త‌మ‌ను చుట్టిముట్టిన మందీమార్బ‌లాన్ని పెక్క పెక్క త‌న్నుకుంటూ ల‌గెత్తాయి. ప‌రుగో పరుగు.. ! ముందు దున్న‌పోతులు.. వెనుక వైసీపీ నేత‌లు. వైసీపీ నేత‌లు ఎంత‌గా ల‌గెత్తితే … అవి అంత‌గా ల‌ఘించి మ‌రీ ప‌రుగెత్తాయి. వాటిని ప‌ట్టుకోక‌పోతే.. ఇంత‌క‌న్నా పెద్ద వెన్నుపోటు ఉండ‌ద‌నుకున్నారో.. న‌వ్వెటోడి ముందు జారిప‌డ్డ‌ట్ట‌వుతుంద‌నకున్నారో.. వాటిని వెంబ‌డించారు. కానీ అవి వింటే క‌దా! దున్న‌పోతులు క‌దా. విన‌లేదు. విన‌తిప‌త్రాలు తీసుకోలేదు.

ఆ నేత‌ల‌కు కూడా కావాల్సింద‌దే. సింబాలిక్‌గా ఇదే చెప్పాల‌నుకున్నారు. కానీ అవి నిల‌క‌డ‌గా నిల‌బ‌డి.. తీరుబ‌డిగా తీసుకుని..బుద్దిగా ఫోటోలకు ఫోజులిచ్చి.. ఇది క‌దా నిర‌స‌న రూపం. ఈ దున్న‌పోతులేంటీ.. ఇలా వెన్నుపోటు పొడిచాయి… అనుకుని తెగ‌బాధ‌ప‌డిపోయార‌ట ఆ నేత‌లు. జ‌గ‌న్‌కు ఏవీ కలిసి రావ‌డం లేదు.. చివ‌ర‌కు ఇలా దున్న‌పోతులు కూడా వెన్నుపోటు పొడిచాయ‌ని అనుకుని ఎలాగోలా జ‌నాల‌కు మా ఉద్దేశం చేరింది అది చాలు అని స‌రిపెట్టుకున్నార‌ట‌.

Advertisement

అస‌లు ఎవ‌రిచ్చారో గానీ ఈ స‌ల‌హా.. వాడిని ఓ పోటు పొడ‌వాల‌నే ఆలోచ‌న కూడా వ‌చ్చిన‌ట్టుంది ఆ కోపంలో వారికి. త‌మాయించుకుని, రెండేండ్ల వెన్నుపోటు స‌ర్కార్ ఇది.. దున్న‌పోతు క‌న్నా అధ్వానం ఈ ప్రభుత్వం అని కొత్త నినాదం అందుకున్నారు. అంటే ఇక‌పై దున్న‌పోతు పేరెత్త‌రు. వెన్నుపోటు అందామ‌నుకుంటే.. ఇప్పుడు అంద‌రికీ దున్న‌పోతే గుర్తుకు వ‌స్తుంది? ఎలా… ! అందుకే ఇక‌పై నో వెన్నుపోటు.. నో దున్న‌పోతు.. ! ఇంకా వేరే నినాదాలు, ప్రాస‌లు చూసుకోవాల‌నుకున్నార‌ట‌. మ‌న‌కెందుకులే ఆ ప్ర‌యాసాలు.. అనుకుని కామ్‌గా స‌మోసాలు తిన్నార‌ట ఒగ‌రుస్తూ అచ్చం దున్న‌పోతుల వ‌లె..

Related News

భారత రాజకీయాలకు టర్నింగ్ పాయింట్ 1980.. ఇందిరా గ్రాండ్ రీఎంట్రీ, బీజేపీ ఆవిర్భావం!

ఇది మా అసెంబ్లీ.. మాక్‌ అసెంబ్లీ.. ! బీఆర్‌ఎస్‌ మాక్‌ అసెంబ్లీ ఫుల్ కామెడీ…! సీరియస్ రచ్చ ఇలా నవ్వుల పాలు..

తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం.. 80’sలో ఎన్టీఆర్ సంచలనం, అంతలోనే సంక్షోభం!

లేటుగానైనా మధుయాష్కీకి మంచి గుర్తింపు.. ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు.. కలిసివచ్చిన వేళ..!

బీఆర్‌ఎస్‌ సర్వేలో రేవంత్ సర్కార్‌కు పాస్‌ మార్కులు.. ! పాలనపై అసంతృప్తి లేదు.. సంతృప్తీ లేదు..

సభా సమరంలో ఓడినా.. ఇలా సబ్జెక్టుతో కొడతాం! కరెంటు కష్టాలపై సర్కార్‌ను నిలదీసిన బీఆరెస్‌!

నిజం చెప్పిన జర్నలిజంపై నిషేధమా? ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెబుతారా? DSC స్కామ్‌పై జగన్ అస్త్రాలు!

సంఘాలపై ఉద్యోగుల గుర్రు.. నిరసనలపై సర్కార్‌ నీళ్లు జల్లే ప్రయత్నం.. చీఫ్ సెక్రటరీ రాతపూర్వక హామీతో – ఛలో హైదరాబాద్ తాత్కాలిక వాయిదా..!

Big Stories

Advertisement
×