E-Paper
Advertisement

ఫేక్ ఇ-ఇన్‌వాయిస్ మెసేజ్‌లతో మోసపోకండి..అసలు,నకిలీ బిల్లులను ఇలా గుర్తించండి!

ఫేక్ ఇ-ఇన్‌వాయిస్ మెసేజ్‌లతో మోసపోకండి..అసలు,నకిలీ బిల్లులను ఇలా గుర్తించండి!
Advertisement

Fake e-invoice scam India 2026: ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను దోచుకోవడానికి రోజుకో కొత్త దారి వెతుకుతున్నారు. తాజాగా ‘ఇ-ఇన్‌వాయిస్’ , ఆన్‌లైన్ బిల్లుల పేరుతో ప్రజలకు వివిధ రకాల మెసేజ్2లు పంపి అకౌంట్ ఖాళీ చేస్తున్నారు. ఏదో ఒక ఈ-కామర్స్ బిల్లు లేదా జీఎస్‌టీ ఇన్‌వాయిస్ అనుకుని ఆ మెసేజ్‌లపై ఉన్న లింక్‌లపై క్లిక్ చేస్తే మీ కష్టపడి సంపాదించిన డబ్బు క్షణాల్లో మాయం కావచ్చు. అసలైన ఇన్‌వాయిస్‌కు, సైబర్ నేరగాళ్లు పంపే నకిలీ ఇన్‌వాయిస్‌కు మధ్య తేడాను గుర్తించి ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

నకిలీ ఇ-ఇన్‌వాయిస్ మెసేజ్‌లను గుర్తించడం ఎలా?

లింక్‌లు, డొమైన్ పేర్లు:
నకిలీ ఇన్‌వాయిస్ మెసేజ్‌లలో సాధారణంగా .zip, .apk, లేదా తెలియని వింత లింక్‌లు ఉంటాయి. అసలైన జీఎస్‌టీ పోర్టల్ లేదా అధికారిక సంస్థల నుంచి వచ్చే లింక్‌లు ఎప్పుడూ ప్రభుత్వ అధికారిక డొమైన్‌లతో (.gov.in) మాత్రమే ఉంటాయి.అక్షరాలలో చిన్న చిన్న స్పెల్లింగ్ తప్పులు ఉండటం నకిలీ వాటి ముఖ్య లక్షణం.

Advertisement

భయపెట్టే హెచ్చరికలు :
“తక్షణమే ఈ బిల్లు చెల్లించండి లేదంటే చట్టపరమైన చర్యలు ఉంటాయి” లేదా “మీ అకౌంట్ రద్దవుతుంది” అంటూ హడావుడి చేసే మెసేజ్ లు దాదాపుగా నకిలీవే అయి ఉంటాయి. మోసగాళ్లు కస్టమర్లకు ఆలోచించడానికి అవకాశం ఇవ్వకుండా భయపెట్టి తొంద రపాటు నిర్ణయాలు తీసుకునేలా చేస్తారు.

తెలియని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లు:
అధికారిక సంస్థలు ఎప్పుడూ సాధారణ పర్సనల్ మొబైల్ నుంచి లేదా గుర్తు తెలియని వాట్సాప్ అకౌంట్ల నుంచి ఇన్‌వాయిస్‌లను పంపవు. కేవలం అధికారిక హెడర్ నేమ్స్ తోనే మెసేజ్‌లు వస్తాయి.

Advertisement

అసలైన ఇ-ఇన్‌వాయిస్‌ను గుర్తించే విధానం:

ఐఆర్​పీ (IRP) పోర్టల్ ద్వారా చెకింగ్:
అసలైన జీఎస్‌టీ ఈ-ఇన్‌వాయిస్ పైన ప్రత్యేకమైన ఐఆర్ఎన్ (IRN – Invoice Reference Number), క్యూఆర్ కోడ్ (QR Code) ఉంటాయి. ఆ క్యూఆర్ కోడ్‌ను ప్రభుత్వ అధికారిక జీఎస్‌టీ/ఐఆర్పీ పోర్టల్‌లో స్కాన్ చేయడం ద్వారా అది అసలైనదా కాదా అనేది క్షణాల్లో తెలుసుకోవచ్చు.

డిజిటల్ సంతకం:
అధికారిక ఇన్‌వాయిస్‌లు ఎప్పుడూ పీడీఎఫ్ ఫార్మాట్‌లో మాత్రమే ఉంటాయి. అంతే కాకుండా వాటిపై సరైన వెరిఫైడ్ డిజిటల్ సంతకం ఉంటుంది. ఇన్‌వాయిస్ జారీ చేసిన సంస్థ పేరు, జీఎస్‌టీ ఐఎన్ నంబర్ ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయి.

Also Read: డబ్బులు కట్ అయ్యి మనీ పడలేదా?ఈ తప్పులు అస్సలు చేయెద్దు!

మోసాల పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

లింక్‌లపై క్లిక్ చేయెద్దు: మీకు వచ్చిన ఏ మెసేజ్ లేదా ఈమెయిల్‌లో ఉన్న అనుమానాస్పద లింక్‌లపై పొరపాటున కూడా క్లిక్ చేయకండి.

పర్సనల్ వివరాలు చెప్పకండి: మీ యూపీఐ పిన్, బ్యాంక్ పాస్‌వర్డ్ లేదా ఓటీపీని ఎవరికీ షేర్ చేయెద్దు.

సైబర్ క్రైమ్: ఒకవేళ పొరపాటున మోసపోయి డబ్బులు కోల్పోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి లేదా cybercrime.gov.in పోర్టల్‌లో కంప్లైంట్ చేయండి.

ఇ-ఇన్‌వాయిస్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఒక చిన్న మెసేజ్ మీ జీవితాంతం కష్టపడిన సంపాదనను హారతి కర్పూరంలా కరిగించగలదు. కాబట్టి ఎలాంటి మెసేజ్ వచ్చినా తొందరపడకుండా.. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం చాలా మంచిది.

Related News

5Gకి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది..త్వరలోనే జియో 6G ఇంటర్నెట్

రూ.25 వేల బడ్జెట్‌లో ఐదు అదిరిపోయే ఫోన్ ఆఫర్లు.. ఏది కొనడం బెస్ట్ అంటే?

సమయాన్ని కొలవడంలో సరికొత్త విప్లవం.. న్యూక్లియర్ క్లాక్ ఎలా పనిచేస్తుందో తెలుసా?

డబ్బులు కట్ అయ్యి మనీ పడలేదా?ఈ తప్పులు అస్సలు చేయెద్దు!

షాపింగ్ ప్రియులకు పండుగ బొనాంజా.. టీవీ నుంచి ల్యాప్‌టాప్ వరకు.. మిస్ చేసుకోలేని డీల్స్!

బోర్‌ నీళ్లకు ఏ వాటర్ ప్యూరిఫైయర్ బెస్ట్? RO మోడల్స్ ఎందుకు ఎంచుకోవాలి?

రూ.16,300 వరకు ఆదా.. అమెజాన్ సేల్‌లో Vivo X300 Ultraపై సెన్సేషనల్ ఆఫర్!

Big Stories

Advertisement
×