E-Paper
Advertisement

హాస్పిటల్‌ మాఫియా… డాక్టర్ల గుట్టురట్టు చేసే లేడీ సర్జన్… క్రేజీ కొరియన్ మెడికల్ థ్రిల్లర్ సిరీస్

హాస్పిటల్‌ మాఫియా… డాక్టర్ల గుట్టురట్టు చేసే లేడీ సర్జన్… క్రేజీ కొరియన్ మెడికల్ థ్రిల్లర్ సిరీస్
Advertisement

Korean Medical Thriller Drama OTT : హాస్పిటల్‌ కు వెళ్లే ప్రతి ఒక్కరూ డాక్టర్లను నమ్మి తమ ప్రాణాలను వారి చేతుల్లో పెడతారు. కానీ రోగుల ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రిలోనే అధికారం, అవినీతి, స్వార్థం రాజ్యమేలితే… వైద్యం కంటే పదవులు, డబ్బు, తమ పలుకుబడిని కాపాడుకోవడానికే కొందరు పెద్దలు ప్రాధాన్యం ఇస్తే… అలాంటి వ్యవస్థలో నిజాయితీగా పని చేయాలనుకునే డాక్టర్ పరిస్థితి ఎలా ఉంటుంది ? ఈ ప్రశ్నలకు సమాధానమే దక్షిణ కొరియా మెడికల్ డ్రామా ‘Doctor X Age of the White Mafia’. వైద్యరంగం వెనుక దాగి ఉన్న అధికార పోరాటాలను చూపించే ఈ సిరీస్ తాజాగా ఓటీటీలోకి వచ్చింది. మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది అంటే…

కథలోకి వెళ్తే…

గే సూ-జంగ్ ఓ ప్రతిభావంతమైన సర్జన్. వైద్య పరిజ్ఞానం, క్లిష్టమైన కేసులను ఎదుర్కొనే స్కిల్స్ ఆమె బలం. రోగి పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉన్నా, వైద్యపరంగా సరైన నిర్ణయం తీసుకోవడమే ఆమెకు ముఖ్యం. కానీ ఆమె పని చేసే గుసియో యూనివర్సిటీ హాస్పిటల్ ‌లో పరిస్థితులు అంత సులభంగా ఉండవు. ఆసుపత్రిలో వైద్య నైపుణ్యంతో పాటు రాజకీయాలు, అధికారం, అంతర్గత వర్గపోరు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఆసుపత్రి డైరెక్టర్ బూ సియుంగ్-గ్వాన్‌ తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. వైద్య సంస్థను నడపాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, అక్కడి అధికార వ్యవస్థలో ఎవరి మాట నడవాలి, ఎవరు పైకి ఎదగాలి, ఎవరి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి అనే అంశాలు కూడా కీలకంగా మారతాయి.

Advertisement

ఇలాంటి వాతావరణంలో సూ-జంగ్ తన పనిని నిజాయితీగా వర్క్ చేయడం సవాలుగా మారుతుంది. ఆసుపత్రిలో కొత్తగా చేరిన ఇంటర్న్ పార్క్ టే-గ్యోంగ్ కూడా ఈ వ్యవస్థలోని వాస్తవాలను దగ్గరగా చూస్తాడు. వైద్య విద్యలో నేర్చుకున్న ఆదర్శాలు, ఆసుపత్రిలో ప్రత్యక్షంగా ఎదురయ్యే పరిస్థితుల మధ్య ఎంత తేడా ఉందో అతడికి అర్థమవుతుంది. రోగికి ఏది మంచిదనే దానికంటే, సంస్థలో ఉన్న అధికారులకు ఏది అనుకూలమనే దానిపై నిర్ణయాలు ప్రభావితం అవుతుంది. సూ-జంగ్ ఇలాంటి పరిస్థితులను నిశ్శబ్దంగా అంగీకరించే వ్యక్తి కాదు.

తన వైద్య నైపుణ్యాన్ని ఉపయోగించి రోగులను కాపాడాలనుకునే ఆమె, ఆసుపత్రిలోని అధికార వర్గాలు సృష్టించే అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవైపు వైద్యపరమైన క్లిష్ట కేసులు, మరోవైపు వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతి… ఈ రెండింటినీ ఎదుర్కోవడం ఆమెకు పెద్ద పరీక్షగా మారుతుంది. ఇక్కడ కథ కేవలం డాక్టర్లు, రోగుల మధ్య జరిగే సంఘటనలకే పరిమితం కాదు. వైద్య వ్యవస్థను ఎవరు నియంత్రిస్తున్నారు ? ఆసుపత్రి పేరుతో లాభపడుతున్నది ఎవరు ? నిజాయితీగా పని చేసే వ్యక్తులు ఆ వ్యవస్థలో నిలబడగలరా ? సూ-జంగ్ అవినీతి వ్యవస్థను బయట పెట్టగలదా? తన వృత్తిపరమైన విలువలను కాపాడుకుంటూ ముందుకు వెళ్లగలదా ? అన్నదే ఈ సిరీస్‌లోని ప్రధాన ఉత్కంఠ.

Advertisement

ALso Read : హోటల్ నిండా దెయ్యాలు… చిన్న పిల్లాడిలో డెమాన్… నవ్విస్తూనే భయపెట్టడానికి తిరిగొచ్చిన సీజన్ 2

స్ట్రీమింగ్ ఎక్కడ ?

‘డాక్టర్ ఎక్స్ ఏజ్ ఆఫ్ ది వైట్ మాఫియా’లో కిమ్ జీ-వోన్ డాక్టర్ గే సూ-జంగ్‌గా, సన్ హ్యూన్-జూ ఆసుపత్రి డైరెక్టర్ బూ సియుంగ్-గ్వాన్‌ గా, కిమ్ వూ-సోక్ ఇంటర్న్ పార్క్ టే-గ్యోంగ్‌ గా నటించారు. ఈ సిరీస్ ‌కు లీ జంగ్-రిమ్ దర్శకత్వం వహించారు. ఇది వైద్యరంగంలోని అవినీతి, అధికార పోరాటాల చుట్టూ తిరిగే కొరియన్ మెడికల్ నోయిర్ డ్రామా. అక్టోబర్ 9 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.

Tags

Related News

భూమిపై మనుషులు మాత్రమే లేరా ? ప్రపంచాన్ని కుదిపేసే రహస్యం… ఏలియన్స్ గురించి స్పీల్‌బర్గ్ చూపించిన షాకింగ్ కథ

హోటల్ నిండా దెయ్యాలు… చిన్న పిల్లాడిలో డెమాన్… నవ్విస్తూనే భయపెట్టడానికి తిరిగొచ్చిన సీజన్ 2

కొడుకు కిడ్నాప్… కోట్ల డబ్బు కోసం వేట… ప్రతి నిమిషం టెన్షన్ పెంచే హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగులోకి

కరెంట్ షాక్ ఇచ్చే అమ్మాయే అతడి హార్ట్ ఛార్జర్… ఈ వింత లవ్ స్టోరీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

అక్రమ ఇసుక మాఫియా పని పట్టే లేడీ రిపోర్టర్… డైరెక్ట్ గా ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్… తెలుగులోనే స్ట్రీమింగ్

పోలీస్ స్టేషన్‌లో ఖాకీల క్రైమ్… నిజాన్ని దాచేందుకు పోలీసులే కుట్ర… ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ ను మిస్ కావొద్దు

వైష్ణవి చైతన్య – ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ ఓటీటీలోకి… తెలుగుతో సహా 5 భాషల్లో

Big Stories

Advertisement
×