Ramiz Raza issues a massive warning to the Indian cricket team : ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ కు ముహూర్తం దగ్గర పడింది. అక్టోబర్ మూడవ తేదీన అంటే శనివారం రోజున టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్స్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ షురూ అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా. టీమిండియాకు సైమ్ అయూబ్ (Saim Ayub ) పెద్ద తలనొప్పిగా మారబోతున్నాడని హెచ్చరించారు. అతన్ని తట్టుకోవడం టీమ్ ఇండియా తరం కాదని వార్నింగ్ ఇచ్చారు. అంచనాలకు మించి సైమ్ అయూబ్ రాణిస్తాడని తెలిపారు. అతని దెబ్బకు ఫైనల్స్ లో టీమిండియా ఓడిపోవడం గ్యారంటీ అని అంచనా వేశారు రమీజ్ రాజా.
ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దళం కంటే పాకిస్తాన్ బలంగా ఉందని రమీజ్ రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు. అబ్రార్ అహ్మద్, సుఫియాన్ ఇద్దరూ టీమిండియా కు ముచ్చెమటలు పట్టిస్తారని హెచ్చరించారు. అయితే వీళ్ళిద్దరి కంటే ఆల్ రౌండర్ సైమ్ అయూబ్ (Saim Ayub )… అత్యంత ప్రమాదకరమని తెలిపారు. స్పిన్ బౌలింగ్ తో టీమిండియా కు చుక్కలు చూపిస్తాడని వెల్లడించారు రమీజ్ రాజా.
ఇండియా తరహాలో జపాన్ మైదానాలు ఫ్లాట్ ట్రాక్స్ కాదని గుర్తు చేశారు. స్పిన్ బౌలింగ్ కు జపాన్ మైదానాలు అనుకూలిస్తున్నాయని వ్యాఖ్యానించారు. భారత జట్టు స్పిన్నర్ల కంటే తమ వాళ్ళు అద్భుతంగా బంతిని టర్న్ చేస్తారని వివరించారు. ఇలాంటి నేపథ్యంలో టీమిండియాను కచ్చితంగా ఓడించే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. టీమిండియా పై ప్రతీకారాన్ని తీర్చుకునే అవకాశం వచ్చిందని.. దీన్ని అస్సలు వదులుకోవద్దని పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సూచనలు చేశారు రమీజ్ రాజా. దీంతో రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ మ్యాచ్ కు వర్షం పడితే పరిస్థితి మరోలా ఉంటుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారితే 5 ఓవర్లు అయినా నిర్వహించే ఛాన్సులు కనిపిస్తున్నాయి. మ్యాచ్ రద్దు అయితే మాత్రం రెండు జట్లు గోల్డ్ మెడల్ పంచుకోవాలి. ఇలాంటి నేపథ్యంలో రేపటి రోజు వర్షం పడి, మ్యాచ్ రద్దు కావాలని కోరుతున్నారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు. వర్షం పడి, మ్యాచ్ రద్దు అయితే మాత్రం…ఇరు జట్లు గోల్డ్ మెడల్స్ పంచుకోవచ్చని పేర్కొంటున్నారు.