E-Paper
Advertisement

50 గంటల బ్యాటరీ లైఫ్‌తో హువావే కొత్త ఇయర్‌బడ్స్.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్, రేటు ఎంతంటే?

50 గంటల బ్యాటరీ లైఫ్‌తో హువావే కొత్త ఇయర్‌బడ్స్.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్, రేటు ఎంతంటే?
Advertisement

Huawei New Earbuds: హువావే నుంచి రెండు సరికొత్త ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి రానుంది. హువావే ఫ్రీబడ్స్ 7i, హువావే ఫ్రీబడ్స్ SE 4 పేర్లతో వస్తున్న ఈ మోడల్స్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. జూన్ 18న ఇవి అధికారికంగా భారతదేశంలో విడుదల కానున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఆర్‌టీసీ ఇండియా అధికారిక వెబ్‌సైట్లలో వీటి ధరలు, రంగుల వివరాలు ముందే దర్శనమిచ్చాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లకు సపోర్ట్ చేసే ఈ ఇయర్‌బడ్స్ అదిరిపోయే ఫీచర్లతో వస్తున్నాయి.

ప్రీమియం లుక్‌తో ఆకట్టుకునే హువావే ఫ్రీబడ్స్ 7i మోడల్ ధర రూ.13,999గా ఉంది. ఇది పింక్, వైట్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో అద్భుతమైన సౌండ్ క్వాలిటీ కోసం 11 మిమీ క్వాడ్ మాగ్నెట్ డైనమిక్ డ్రైవర్‌ను అందించారు. నాయిస్ క్యాన్సిలేషన్ విషయానికొస్తే.. ఇందులో ఉన్న ఇంటెలిజెంట్ డైనమిక్ ఏఎన్‌సీ 4.0 టెక్నాలజీ బయటి శబ్దాలు అస్సలు వినబడకుండా చేస్తుంది. ప్రయాణాల్లో లేదా రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా స్పష్టమైన కాల్స్ మాట్లాడుకోవడానికి వీలుగా బోన్ కండక్షన్ మైక్రోఫోన్‌తో పాటు ఏఐ కాల్ నాయిస్ రిడక్షన్ ఫీచర్‌ను కూడా ఇందులో చేర్చారు.

Advertisement

Also Read: భారీ బ్యాటరీ, ఐఫోన్‌ను మించిన ఫీచర్లతో Redmi Turbo 5 లాంచ్.. ధర ఎంతంటే?

ఈ ఇయర్‌బడ్స్ కేవలం 40 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్ అవుతాయి. ఏఎన్‌సీ ఫీచర్ ఆఫ్ చేసి ఉంచితే కేస్ సహాయంతో ఏకంగా 35 గంటల పాటు నిరంతరాయంగా పాటలు వినవచ్చు. ఒకవేళ అర్జంట్‌గా బయటికి వెళ్లాల్సి వస్తే, కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు, సుమారు 4 గంటల పాటు వాడుకోవచ్చు. ఇవి దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ కోసం ఐపీ54 రేటింగ్‌తో వస్తున్నాయి. తల ఊపడం ద్వారా కాల్స్ లిఫ్ట్ చేయడం లేదా రిజెక్ట్ చేయడం వంటి వినూత్నమైన గెస్టర్ కంట్రోల్స్ కూడా ఇందులో ఉండటం విశేషం.

Advertisement

తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు కోరుకునే వారి కోసం హువావే ఫ్రీబడ్స్ SE 4 మోడల్‌ను తీసుకొచ్చింది. దీని ధర రూ.7,999గా ఉండనుంది. ఇది కేవలం వైట్, బ్లాక్ రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనిలో 10 మిమీ డైనమిక్ డ్రైవర్‌ను అమర్చారు. 10 వేల కంటే ఎక్కువ మంది చెవుల ఆకృతిని పరిశీలించి, దీనిని చాలా సౌకర్యవంతంగా డిజైన్ చేశారు. ఇందులో కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ ఉంది.

ఈ బడ్జెట్ ఇయర్‌బడ్స్ బ్యాటరీ పరంగా చాలా మెరుగ్గా ఉన్నాయి. ఏఎన్‌సీ ఫీచర్ వాడకపోతే కేస్‌తో కలిపి ఏకంగా 50 గంటల భారీ బ్యాటరీ లైఫ్‌ను ఇది అందిస్తుంది. దీనిలో బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ ఉండటం వల్ల డివైజ్‌లకు చాలా వేగంగా కనెక్ట్ అవుతుంది. టచ్ కంట్రోల్స్ ద్వారా పాటలను మార్చుకోవడమే కాక.. మాట్లాడుకోవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ లైఫ్, నాయిస్ క్యాన్సిలేషన్ కావాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ కానుంది.

Also Read: iOS 27 కోడ్‌లో కీలక ఆధారాలు.. ఫోల్డబుల్ iPhone పేరు ఇదేనా?

Related News

రాత్రి పూట కూడా స్పష్టమైన రికార్డింగ్..బెస్ట్ అవుట్‌డోర్ వైఫై సీసీటీవీలు

సగం ధరకే.. 50 ఇంచుల టీవీలు,ఆఫర్ పూర్తవకముందే కొనండి

జియో కస్టమర్లకు లక్కీ ఛాన్స్.. 365 రోజుల వ్యాలిడిటీ, రోజూ 2.5GB డేటా.. ఉచితంగా Gemini Pro!

బ్యాంక్ ఖాతాలపై హ్యాకర్ల కన్ను.. ఈ 6 VPN యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి!

వాట్సప్‌లో ఫొటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కాకుండా ఎలా ఆపాలి?

25 రోజుల బ్యాటరీ.. వాచ్ ఫీచర్లతో క్యాసియో ‘స్మార్ట్ రింగ్’ వచ్చేసింది, ధర ఎంతంటే?

ఆరేళ్ల బ్యాటరీ గ్యారెంటీతో భారత్‌లోకి వచ్చేసిన Vivo T5x 5G.. లాంచింగ్ ఆఫర్‌తో తక్కువ ధరకే పొందొచ్చు!

రీఛార్జ్ రేట్లు పెరిగినా డోంట్ కేర్.. రూ.1849కే ఏడాది పొడవునా ఎయిర్‌టెల్ ప్లాన్ ఉందిగా!

Big Stories

Advertisement
×