E-Paper
Advertisement

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!
Advertisement

Huawei Mate 90: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు హువావే త్వరలోనే ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వబోతోంది. హువావే మేట్ 90 సిరీస్‌ కోసం టెక్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఈ ఫోన్ల లాంచ్ తేదీకి సంబంధించిన కీలక సమాచారం ముందుగానే బయటకు వచ్చింది. హువావే చైనా అధికారిక వెబ్‌సైట్‌లో పొరపాటున లాంచ్‌కు సంబంధించిన ఓ పేజీ ప్రత్యక్షం కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పేజీని వెంటనే తొలగించినప్పటికీ, అందులోని పోస్టర్ మాత్రం అప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మేట్ 90 సిరీస్ డిజైన్, కొత్త ఫీచర్లపై ఇప్పుడు మరింత ఆసక్తి నెలకొంది.

లాంచ్ ఎప్పుడు?

వెబ్‌సైట్‌లో లీక్ అయిన పోస్టర్ ప్రకారం ఈ కొత్త మేట్ 90 సిరీస్ ఫోన్లు అక్టోబర్ 1వ తేదీన విడుదల కానున్నాయి. ఈ పోస్టర్‌లో కనిపించిన అర్ధచంద్రాకారం రింగ్ డిజైన్ చూస్తుంటే.. ఫోన్ వెనుక భాగంలో ఒక పెద్ద సర్క్యులర్ కెమెరా మోడ్యూల్ రాబోతోందని స్పష్టమవుతోంది. దాంతో పాటు ఈసారి ఒక సరికొత్త గ్రీన్ కలర్ వేరియంట్‌ను కూడా పరిచయం చేయబోతున్నట్లు ఆ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ఈ లుక్ ఫోన్‌ను చాలా ప్రీమియమ్‌గా మార్చనుంది.

Advertisement

Also Read: జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

లైవ్ ఇమేజెస్ లీక్..

పోస్టర్ లీక్ అయిన కొద్దిసేపటికే మేట్ 90 ఫోన్‌కు సంబంధించిన లైవ్ ఫోటోలు కూడా నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఇందులో బ్రైట్ గ్రీన్ కలర్ ఫోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ రెండు భాగాలుగా డిజైన్ చేశారు. పైన నిలువు, అడ్డ గీతలతో కూడిన లేత అల్లిక లాంటి డిజైన్ ఇచ్చారు. ఇది వెలుగు పడినప్పుడు విభిన్నమైన షేడ్స్‌లో మెరుస్తూ చాలా కొత్తగా కనిపిస్తుంది. ఇక కింద భాగం ప్లాన్‌గా ఉంటూ కింద మెటాలిక్ హువావే లోగోతో మెరిసిపోతోంది.

కెమెరా సెటప్..

Advertisement

ఈ ఫోన్ వెనుక వైపు పెద్ద గుండ్రటి కెమెరా మోడ్యూల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. దీని చుట్టూ షైనీ పాలిష్డ్ ఎడ్జ్ ఇచ్చారు. ఈ రింగ్ లోపల మూడు కెమెరా లెన్స్‌లు, మధ్యలో హువావే సొంత XMAGE బ్రాండింగ్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరా పైన గజర్ ఆటోఫోకస్ సెన్సార్, కింద చిన్న ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ అమర్చారు. ఈ డిజైన్ ఫోన్ ఓవరాల్ లుక్‌ను మరింత ట్రెండీగా మార్చింది. ఫోన్ సైడ్ ఫ్రేమ్ గోల్డ్ ఫినిషింగ్‌తో రావడంతో మరింత లగ్జరీ లుక్ ఇస్తుంది.

రెడ్ పింక్ లుక్..

గ్రీన్ మోడల్‌తో పాటు మేట్ 90 ఆర్‌ఎస్ అల్టిమేట్ మోడల్ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇది రెడ్ సెరామిక్ బ్యాక్ ప్యానెల్‌తో డ్యూయల్ టోన్ డిజైన్‌లో మెరిసిపోతోంది. మేట్ 90 సిరీస్‌లో వేర్వేరు మోడల్స్ అందుబాటులోకి రానున్నాయి. కెమెరా విషయంలో కూడా హువావే పెద్ద మార్పులే చేస్తోందని సమాచారం. కొత్త టెలిఫోటో యాక్సెసరీ సాంకేతికతతో రానున్న ఈ ఫోన్లలో ఫోటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోంది. మొత్తానికి ఈ లాంచ్ కోసం టెక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: ఇంత భారీగా ధర తగ్గుతుందని ఎవరూ ఊహించి ఉండరు.. Galaxy Z Fold 4 ఇప్పుడు రూ.89 వేలకే!

Tags

Related News

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

ఇంత భారీగా ధర తగ్గుతుందని ఎవరూ ఊహించి ఉండరు.. Galaxy Z Fold 4 ఇప్పుడు రూ.89 వేలకే!

అదరగొట్టే ఫీచర్లతో Redmi 17C 5G వచ్చేస్తోంది.. ధర, లాంచ్ వివరాలు ఇవే!

ఇప్పుడే కొనేస్తే మంచిది.. అక్టోబర్ నుంచి టీవీలు, ఏసీలు సహా గృహోపకరణాల ధరలు పెరిగే అవకాశం!

టైప్ చేసే పనిలేదు.. ChatGPT కొత్త వాయిస్ ఫీచర్ చూస్తే ఆఫీస్ ఉద్యోగులు ఎగిరి గంతులేస్తారు!

Big Stories

Advertisement
×