E-Paper
Advertisement

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!
Advertisement

Gmail Storage Full: ఇప్పుడున్న డిజిటల్ యుగంలో మన ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో అత్యంత ముఖ్యమైనది జీమెయిల్. ఆఫీస్ మెయిల్స్, బ్యాంక్ అలర్ట్స్, ముఖ్యమైన పత్రాలు.. ఇలా అన్నింటికీ జీమెయిలే ఆధారం. అయితే ఉన్నట్టుండి Storage Full అని నోటిఫికేషన్ రాగానే చాలామంది కంగారు పడుతుంటారు. కొత్త మెయిల్స్ రావడం ఆగిపోవడమే కాకుండా, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫోటోస్ సేవలు కూడా నిలిచిపోతాయి. మరి డబ్బులు కట్టకుండానే, ముఖ్యమైన డేటా పోకుండా ఈ ప్రాబ్లమ్‌ను ఎలా సాల్వ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా..

ఫ్రీ స్టోరేజ్ ఎటు పోతోంది?

గూగుల్ మనకిచ్చే 15 జీబీ ఉచిత స్టోరేజ్ కేవలం జీమెయిల్‌కి మాత్రమే అనుకుంటే పొరపాటే. జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫోటోస్.. ఈ మూడూ కలిసి ఆ 15 జీబీని వాడుకుంటాయి. హై-క్వాలిటీ ఫోటోలు, డ్రైవ్‌లో పెద్ద పెద్ద వీడియోలు ఉండటం వల్ల జీమెయిల్ నిండిపోతుంది. అందుకే ముందుగా ఏది ఎక్కువ స్పేస్ వాడుతుందో చెక్ చేసుకోవడం మంచిది.

Advertisement

Also Read: బ్లడ్ షుగర్ హెచ్చుతగ్గులకు చెక్ పెట్టే CGM సాంకేతికత.. వానకాలంలో ఎంతగానో హెల్ప్!

జీమెయిల్ క్లీనింగ్ వెరీ ఈజీ:

మీ మెయిల్‌లోని సెర్చ్ బార్‌లో larger:10M అని టైప్ చేస్తే.. 10 ఎంబీ కంటే ఎక్కువ సైజ్ ఉన్న మెయిల్స్ కనిపిస్తాయి. వీటిలో అవసరం లేని పెద్ద పెద్ద ఫైల్స్ ఉన్న మెయిల్స్‌ను డిలీట్ చేయవచ్చు. ముఖ్యమైన అటాచ్‌మెంట్స్ ఉంటే ముందుగా డౌన్‌లోడ్ చేసుకుని, ఆ తర్వాతే మెయిల్స్ తీసేయండి. మెయిల్స్ డిలీట్ చేశాక ట్రాష్, స్పామ్ ఫోల్డర్లను ఖాళీ చేయడం అస్సలు మర్చిపోవద్దు.

డ్రైవ్, ఫోటోస్ సెట్టింగ్స్:

Advertisement

గూగుల్ డ్రైవ్‌లో ఉన్న భారీ వీడియోలు, అవసరం లేని జిప్ ఫైళ్లను డిలీట్ చేయండి. అలాగే గూగుల్ ఫోటోస్‌లో ఒకేలాంటి ఫోటోలు, అవసరం లేని వీడియోలను తీసేస్తే చాలా స్పేస్ కలిసి వస్తుంది. ఒకవేళ ఇవన్నీ చేసినా స్పేస్ చాలకపోతే.. నెలకు సుమారు రూ.130 చెల్లించి గూగుల్ వన్ ద్వారా 100 జీబీ వరకు ఎక్స్‌ట్రా స్టోరేజ్ పొందవచ్చు.

డేటాను దాచుకోవడం ఎలా?

ఏదైనా మెయిల్ డిలీట్ చేసేటప్పుడు అనుమానం ఉంటే తొందరపడి తీసేయకండి. వాటిని మరొక మెయిల్ ఐడీకి ఫార్వర్డ్ చేయడం లేదా కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవడం ఉత్తమం. కేవలం మెయిల్స్‌ను ఆర్కైవ్ చేయడం వల్ల ఇన్ బాక్స్ మాత్రమే శుభ్రపడుతుంది కానీ స్పేస్ మాత్రం పెరగదని గుర్తుంచుకోండి. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఒక్క పైసా ఖర్చు లేకుండా జీమెయిల్ స్పేస్‌ను ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు.

Also Read: ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

Tags

Related News

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

ఇంత భారీగా ధర తగ్గుతుందని ఎవరూ ఊహించి ఉండరు.. Galaxy Z Fold 4 ఇప్పుడు రూ.89 వేలకే!

అదరగొట్టే ఫీచర్లతో Redmi 17C 5G వచ్చేస్తోంది.. ధర, లాంచ్ వివరాలు ఇవే!

ఇప్పుడే కొనేస్తే మంచిది.. అక్టోబర్ నుంచి టీవీలు, ఏసీలు సహా గృహోపకరణాల ధరలు పెరిగే అవకాశం!

టైప్ చేసే పనిలేదు.. ChatGPT కొత్త వాయిస్ ఫీచర్ చూస్తే ఆఫీస్ ఉద్యోగులు ఎగిరి గంతులేస్తారు!

ఎంపీ రాఘవ్ చద్దా పోరాటం.. దిగొచ్చిన ట్రాయ్, మొబైల్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్లు ఇకపై 30 రోజులు

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

Big Stories

Advertisement
×